Sunday 14 May 2017

చదరంగం



ఖమ్మం జిల్లా ..
ఒక మారుమూల పల్లెటూరు.
చిన్న పెంకుటిల్లు ముందు ఉన్న తులసి చెట్టు చుట్టూ ఒకొక్క పువ్వును వేస్తూ భక్తి తో తిరుగుతుంది సీత..
కార్తీక సోమవారం కావటం వలన ఉదయాన్నే లేచి తలంటుకుంది అనుకుంటా విరబోసుకున్న కురుల చివరినుండి చిన్న చిన్న నీటి చుక్కలు  భూమి మీద పడుతున్నాయి..ఆమె ఎరుపురంగు ముకచాయ కలిగివుండటం వలన కనపడి కనపడనట్లు కట్టుకున్న నలుపు రంగు చీర ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది..
సువాసనలు వెదజల్లే మల్లెపూలను తలలో పెట్టుకొని అందం అనే పదానికి కొత్త అర్ధాన్ని నేర్పేలా ఉంది.
మొత్తంగా చెప్పాలి అంటే ముద్దు, ముద్దుగా వున్న బంతిపువ్వుకి చీరకట్టినట్టు వుంది..
 

అమ్మాయిల అందాన్ని స్కర్ట్, బి ..లలో  కంటే చీరెలో చూస్తే మతి పోతుంది..ఆమెను చూసి ఎవరైనా సరే ఒక్క నిమిషం చూపు తిప్పుకోలేరు..ఇంత అందాన్ని అనుకువను దక్కించుకున్న రామయ్య ఎంత అదృష్టవంతుడు.
రామయ్య,రామయ్య అని గట్టిగా అరవటం వలన ఆ అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది..ఎదురుగా పక్కింట్లో వుండే నరసింహం..
రామయ్య లేడా అమ్మ..
లేడు బయటకు వెళ్ళాడు..ఏమైనా పని వుందా ఆయనతో అని అడిగింది.
ఒక చెంచాడు పంచదార కావాలి అంటూ పెద్ద సైజు గిన్నె ఒకటి ఇచ్చాడు నరసింహం..
సీతకి ఇది కొత్త ఏమికాదు..ఎందుకంటే అతను ఒక్క స్పూన్ ,ఒక్క స్పూన్ అని తీసుకెళ్లిన పంచదార దాదాపు 2 కేజీలు అయ్యి ఉంటుంది..అతను తీసుకెళ్లిన కారం వలన కొన్ని సార్లు మా కూరలు కారం సరిపోక చప్పగా మారాయి..
నరసింహం గారు మహా పిసినారి..అతని పిసినారి తనాన్ని తట్టుకోలేక తన భార్య పెళ్లి అయిన 2 సంవత్సరాలకే అతన్ని వొదిలేసింది..ఇంతలో సీత లోపలికి వెళ్లి డబ్బాలో వున్న ఆకరి 2 చెంచాల పంచదారను అతనికి ఇచ్చింది..
ఇంతలో వొచ్చాడు రామయ్య...ఏంటి సీత మనకే పూట గడవటం కష్టంగా ఉంటుంది నువ్వు ఇలా ఇచ్చుకుంటూ పొతే మన పరిస్థితి ఎలా ??
పూరి గుడిసెలో పూటకు కూడా గతిలేని పరిస్థితి..
గడిచిపోయే ఎన్నెన్నో దశాబ్ద, శతాబ్దములు..
పూట గడవలేని పేద బ్రతుకులు..
పూట,పూటకీ మారె బంగారు కంచాల ధనిక కుటుంబాలు..

( ఈ లైన్ రాస్తున్నప్పుడు ఎదో తెలియని అనుభూతి 10 -15 సార్లు చదివుంటాను).
ఎన్ని సంవత్సరాలు అయినా పేదవారు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు..ధనవంతులు మాత్రం పూట పూటకీ బంగారు కంచాలు మారుస్తున్నారు.ఈ లోకం ఎప్పుడు మారుతుందో??
రామయ్య..సీత ప్రేమ ..!
పక్క,పక్కన వున్న ప్రాంతాలు కావటం వలన శ్రీ రామనవమి ఉత్సవాలలో మొదటిసారి కలుసుకున్నారు..ఎదో తెలియని అనుభూతి సినిమాల్లో లాగా మెరుపులు మెరవలేదు, గుండెల్లో గంటలు మ్రోగలేదు..కానీ వారిరువురూ మనసులు ఒక్కటయ్యాయి..

తొలిపరిచయం లో పుట్టే మధురానుభూతి ప్రేమ.
ఒకరిని విడిచి మరొకరు బ్రతకాలేనంత ప్రేమ
ఒకరికోసం మరొకరు చనిపోయేంత ప్రేమ.
జీవన్మరణాంతరాలలో సైతం తోడుంటుంది ఈ ప్రేమ.

కులాలు,మతాల పేరుతో మనుషులు ఏర్పరిచిన ఆ అడ్డుగోడలు వారి మనుసుకు అడ్డుగా నిలిచాయి ..సీత తల్లిదండ్రులు రామయ్య కులం తక్కువ అన్న పేరుతొ వారి పెళ్ళికి అడ్డుగా నిలిచారు..
జంటగా బ్రతకాలనుకున్న వారు వాళ్ళ పెద్దల అడ్డుగోడలను అడ్డుజరిపి పెళ్లి అన్న పవిత్ర బంధంతో ఈ చిన్న పెంకుటిల్లుకు చేరుకున్నారు..ఎంత పెద్ద కష్టం వొచ్చినా వారిరువురు ముఖం మీద మాత్రం చిరునవ్వు చేరగదు..
ఎంత కష్టాల్లో అయినా ఆనదం గా వున్న వారి జీవితాల్లో చిన్న విషాదం..
NEXT EPISODE WILL BE UPDADTED SOON.
 
                       
     *           *            *             *               *
    (  ENGLISH VERSION )

               Chadarangam

 Khammam jilla..
Oka maarumoola palletooru.

Chinna penkutillu pakkane vunna tulasi chettu chuttu okkokka puvvunu vestu bhakthi to tirugutundi seetha..
Kaarthika somavaaram kaavtam valana thalantu posukundi anukuntaa virabosukunna kurula chivari nundi chinna chinna neeti  chukkalu boomi meedha padutunnayi. Ame erupu rangu mukahachaaya kaligi vundatam valana kanapadi kanapadanatlu kattukunna nalupu rangu cheera aameku marintha andhanni techi pettindi.
Motham gaa cheppali ante mudhu,mudhugaa vunna banthi puvvuki cheere  kattinattu vundi.

Ammayila andhanni,skirt,bikinilalo kante ccheerelo chuste mathi potundi..aamenu chesina evaraina Sare oka nimisham paatu choopu tippukoleru. antha andhanni dakkinchukunna raamayya entha adhrusta vanthudo ..

Ramayya,Ramayya ani pilichina chappudiki vulikkipadi venakku tirigindi seetha edurugaa pakkintlo vunde narasimham.
Ramayya Intlo ledaa amma??
Aayana bayataku velladu emaina pani vunda aayanato..
Oka chemchaadu panchadaara kaavali antoo chinna paati  ginne okati ichaadu.
Seetha ni ilaa adagatam kothem kadhu..endukante narasimham gaaru oka chemchaadu ,oka chemchaadu ani teesukellina panchadaara konchem konchem kalipi daadapu 2 kejeelu aindi..narasimham gaaniki appugaa ichina kaaram valana maa seetha valla koorallo kaaram leka chappaga tayaarayyai.
Lopaliki velli panchadaara dabbalo vunna aakari 2 cchemchala panchadaaranu techi athaniki ichindi..
Bayataku velle  narasimham gaarini chustu lopaliki vochaadu Ramayya..enti seetha idi manake poota gadavaleni paristhiti alantidi ilaa daanalu chesta ela??

penkutintlo vunna vaallaki poota gadavaleni paristiti..
Gadiche ennenno dhasabdha,shatabdhambulu..
Poota gadavaleni pedha brathukulu..
Poota pootaki maare bangaaru kanchaal dhanika kutumbaalu.

( ee  line rastunnappudu naku Edo teliyani anuboothi..oka 10-15 times chadivuntaanu.)

Ramayya,seetha parichayam prema..!
Pakka pakkane vunna pranthaala vaaru kavatam valana sri  raama navami utsavaallo modati sri kalusukunnaru. iddari  Madhya Edo teliyani anuboothi.sinimallo laaga merupulu meravaledu,gantaalu mrogakapoyina vaariruvuri Madhya prema chigurinchindi.

Toliparichayam lo putte Madhu raanuboothi prema.
Okarini vidichi marokaru brathakalenantha prema.
Jeevan maranaallo saitam thidutundi prema..

Kulaala mathaala perutho manushulu erparichina ee addugodalu vaari manusulaku addugaa nilichaayi.seetha talli,thandrulu ramayya kulam thakkuva Anna kaaranamto vaari premanu tiraskarinchaaru.

Jantagaa brathakali anukunna vaaru kulaala addugodalanu addu jaripi pavitramaina pelli ane  bhandamto okkatai ee  chinna penkutilluki cherukunnaru..
Entha kastaallo vunna vaari mukhaala meeda chirunavvu matram charagadu.
Kaani vaari iruvuri manasulo  oka chinna vishaadam daagundi..
(Next episode will be updated soon).
                                     
                                  
                                             Rachana
     
                                        Raghu chowdary                 

No comments:

Post a Comment

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts