Tuesday 25 July 2017

మను


కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మనల్ని నిర్విరామంగా మోస్తూనే ఉంది..పాపా,పుణ్యాలను సమపాళ్లతో స్వీకరిస్తుంది.. పురాణాలను చదివిన వారు ఈ భూమిని దేవతంటారు..సైన్స్ చదివిన వారు ఆకర్షణ అంటారు..

ఎప్పటిలాగే తన చుట్టూ తాను తిరుగుతూ అలానే సూర్యుని చుట్టూ  ఒక కక్షలో తిరుగుతూ పోతుంది భూమి.. అలా తిరుగున్న సమయంలో   కనురెప్ప పాటు కాలంలో ఎన్నో చావులు,ఎన్నో పుట్టుకలు..ఎన్నో జీవితాలు కథలుగా మారుతాయి..మరెన్నో జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతాయి..

   ఈ కథ కూడా అలాంటి రెప్ప పాటు కాలంలోనే ప్రాణం పోసుకుంది...ప్రతి కథ ని ఒక రచయిత ప్రాణం పోస్తాడు కానీ నా కథకు మాత్రం పగ అనే మారణాయుధం  ప్రాణం పోసింది..

ఆవారాగా తిరిగే ఒక కుర్రాడు ??

కష్టపడి రూపాయి ,రూపాయి కూడపెట్టే ఒక అల్ప సంతోషి ??

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ఒక కరుడుకట్టిన రాజకీయ నాయకుడు ??

జరిగిన ఒక ఘోర సంఘటన ?? ఎంతమంది పరిస్థితుల్ని మార్చింది..??
చివరకు గెలిచింది న్యాయమా ??  అన్యాయమా ??

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ...


     *                               *                               *                             *

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రానున్ను రెండు రోజులు ఆంధ్ర,రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..కావున ప్రజలు అప్రమత్తులై ఉండాలి అని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేయడం జరిగింది..

  సిటీలో చిన్న గల్లీలో ఉన్న ఒక ఇరుకు ఇల్లు అది.. అక్కడ ఇళ్లే కాదు మనుషుల మధ్య కూడా ఇరుకే..ఒకవైపు ఇల్లు మొత్తం వర్షం కారణంగా నీటితో నిండి ఉంది..ఇక్కడ మన దేశపు రాజకీయ నాయకుడు మాకు చేసిన అన్యాయంతో మా  కళ్ళలో కూడా నీళ్లు నిండుతున్నాయి..

సెప్టెంబర్ 12
సాయంత్రం 6 గంటల సమయం

వర్షాకాలం కావటం వలన అందులోను వర్షం వలన చీకటి తొందరగా పాలన మొదలుపెట్టింది ... ఆ కటిక చీకటిలో ఒకరికి ఒకరు కూడా కనపడటం లేదు .. అప్పుడే సరిగ్గా బొంగురు గొంతు నుండి చిన్నగా బయటకు వొచింది ఒక మాట ,రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మనది మనకు ఎందుకురా పెద్ద వాళ్ళతో గొడవలు..మనం ఈ ఊరు వొదిలి దూరంగా ఎక్కడకు అయినా వెళ్లి బ్రతుకుదాం..ఇప్పటికి జరిగినది చాలు ?? మనకు ఆ స్థలం వొద్దు ఏం వొద్దు ?

ఎక్కడకు వెళదాం నాన్న ??

ఎక్కడకు వెళ్లినా ఇలాంటి నీతి మాలిన కుక్కలు ఉంటూనే వుంటారు..డబ్బు ఉంది అన్న అహంకారం..పదవిలో వున్నాను అన్న పొగరు..అనవసరంగా నాలాంటి మెంటల్  (నా బీప్ -----) గెలికాడు..నేనేంటో చూపిస్తా వాడి పొగరు దించుతా ?? ఇప్పటివరకు ఆవారాగా తిరిగా అదే ఆవారాగాడికి ఏం చెయ్యాలో కూడా తెలుసు ..మనల్ని అవమానించిన వాడే మన కాళ్ళ మీద పడేలా చేస్తా..,?? 


5 సంవత్సరాల తర్వాత??

        ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , ఈ రోజు మాత్రం రిసీవ్ చేసుకోవటానికి వొచ్చిన వారితో కిత కితలాడుతోంది..ఇసుక వేస్తె రాలనంత మంది జనం.. ఆడ,మగ తేడా లేదు..వయసు మళ్ళిన వారు ఎముకలు క్రుళ్ళిన వారు అని భేదం లేదు ?? 

అందరి కళ్ళు నిస్తేజంగా ఎదురుచూస్తున్నాయి.. మాములు జనం తో  పాటు మంత్రులు,MLA లు కూడా అతని రాక కోసమే ఎదురుచూస్తున్నారు..అతను దిగగానే ఎదో ప్రళయం వోచినట్టు అందరూ, సెక్యూరిటీ వారిని కూడా లెక్కచేయకుండా ఒక్కసారిగా  మీద పడిపోయారు..ఫొటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపిస్తూ తమ కెమెరాలో అతన్ని భందించేసారు. విడియోగ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే సమయం వొచ్చింది అన్నట్లు అందులో లీనమైపోయారు..
ఎంతో మంది ఇలాంటి కొడుకు నాకు ఎందుకు పుట్టలేదా అని కుమిలిపోయారు ?? మంత్రులు పుష్పగుచ్చా లతో అతనికి స్వాగతం పలికారు..

5 సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఆవారా గాడు అని బిరుదులు ఇచ్చిన వారు...ఈ రోజు అతని విలువ తెలుసుకొని దేవుడు అని సంబోదిస్తూ అతనికి స్వాగతం పలకటానికి వొస్తున్నారు ..

అతను రాజకీయ నాయకుడా ??  కాదు.
దొంగ స్వామిజీనా ??  కాదు..

అతను ఇండియా వొదిలి 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇంత ప్రేమ ఎలా ??
కేవలం 5 సంవత్సరాలలో ఇంత ఎదుగుదల ఎలా సాధ్యం..??

అసలు ఎవరు ఈ మను ??

జనం ఇంతగా అతన్ని ఎందుకు ఆదరిస్తున్నారు..??

5 సంవత్సరాల క్రితం _______     బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలవ్వక ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మరుసటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ??


( ఇంకా ఉంది ...next episode will be updated soon ).

No comments:

Post a Comment

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts