Sunday, 5 November 2017

రఘు అనే నేను - 5ఎలా చెప్పగలవు..??

నా మీద నాకు ఉన్న నమ్మకం..హారిక మీద ఉన్న ప్రేమ ..ఇవి చాలవా??
సినిమాలో చూడటానికి  బాగానే ఉంటాయి ఇటువంటి dialogue లు, నిజజీవితంలో ఇవన్నీ వొట్టి కబుర్లే..అయినా నువ్వు చెప్పే మాటలకు అమ్మాయిలు పడతారేమో కానీ అమ్మాయిల తండ్రులను పడేయాలి అంటే మాత్రం ఒక హోదా ఉండాలి ..అయినా ఇదంతా చెప్పటం అనవసరం నీకు.. ఇక నువ్వు వెళ్ళొచ్చు..

వొచ్చే నెల పదవ తేదీన మా హారిక పెళ్లి..అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.. నీలా ఖాళీగా ఉండడు..

హారిక వైపు తదేకంగా చూసాను ఒక క్షణం..తాను తలా క్రిందికి దించుకుని మౌనంగా ఉంది..మా ప్రేమ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె మౌనంగా తలదించుకునే ఉండేది..అయినా తను మాత్రం ఏం చెప్పగలదు  వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ తనకు..

వెళ్ళొస్తాను హారిక..!
హహహహ చిన్న నవ్వు నవ్వి సారీ వెళ్తున్నాను..

అలా  చెపుతున్నప్పుడు నా  మాటల అడుగున ఒక చిన్నటి వణుకు..కనుల చివర నుండి ఎప్పుడెప్పుడు బయటపడుదామా అని సిద్ధంగా ఉన్న నీళ్లు..

నేనుఇక  అక్కడ నుండి వొచ్చేసాను..తర్వాత రెండు రోజులు భారంగా గడిచాయి..ఎక్కడ చూసినా మేము తిరిగిన  ప్రదేశాలే.. విడిపోని జ్ఞాపకాలే..!

ఇక అక్కడ ఉంటే తన జ్ఞాపకాల నుండి బయట పడను అనిపించింది..అందుకే ఇక ఆ సిటీ వొదిలి ఎక్కడికైనా వెళదాం అనుకున్నాను.. చివరిగా మా ఫ్రెండ్ గౌతమ్ బెంగళూరు లో ఉండటంతో  బెంగుళూరు వెళదాం అని నిర్ణయించుకున్నాను.. రెండు రోజుల తర్వాత పాత స్నేహితులకి , హైదరాబాద్ కి వీడ్కోలు చెప్పి బెంగళూరు వెళ్ళాను..తర్వాత హరికకు పెళ్లి అయిపోయింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను..అది జరిగాక  నా ఫోన్ wallpaper హారిక ఫోటో నుండి..లవ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఫోటో లకి ..నా ఫోన్ లో సాంగ్స్ పాప్ ,రాప్ సాంగ్స్ నుండి..మనసు గతి ఇంతే..లాంటి మెలోడీ సాంగ్స్ కి మారిపోయాయి.

  దురదృష్టం మన వెంటే ఉంటే..ఆ దేవుడు కూడా మనల్ని బాగు చెయ్యలేదు..అవసరం కోసం ప్రయత్నించిన ప్రతీసారి నిరాశపరిచిన ఉద్యోగ అవకాశాలు..హారిక కు పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ వొచ్చాయి..అందులోనూ ఒకటి కాదు రెండు జాబ్ లు..దీనినే దురదృష్టం అంటారు కాబోలు..

మొదటి రోజు ఆఫీసు..
   కొంచెం భయం భయంగా..కొంచెం ఆనందంగా గడిచింది..మరుసటి రోజు నుండి కొద్దీ కొద్దీ గా పరిచయాలు ఊపందుకున్నాయి..

హలో రఘు..నువ్వా ?? అంటూ దూరం నుండి ఒక గొంతు వినపడింది..

నేను..! ఈ గొంతును ఎక్కడో విన్నట్టు వుందే అనుకుంటూ తలా పైకెత్తి చూసాను..

నా ఎదురుగా వుంది ఎవరంటే.. ????

Tuesday, 24 October 2017

కన్యాశుల్కం కాలంలో...

18 వ శతాబ్ధపు మధ్యకాలంలో....!

    ఒకవైపు బ్రిటీష్ వాళ్ళు, మరొకవైపు కన్యాశుల్కం ఈ రెండింటి ప్రభావం వల్ల మన దేశం బానిస బ్రతుకు బ్రతుకుతుంది.. ఎక్కడ చూసినా తెల్లచీరె కట్టుకొని కనపడే పసిపిల్లలతో దేశం మొత్తం చిందర వందరగా వుంది.. 

సావిత్రి ...!    వెంకటయ్య ,మంగమ్మ గారి ఏకైక సంతానం..బాల్య  వివాహాలు ఎక్కువగా ఉండటం వలన 12 సంవత్సరాల వయస్సులోనే రంగయ్య అనే 70 సంవత్సరాల ముసలి వాడు అంతేకాకుండా మూడవ పెళ్లి వాడికి  ఇచ్చి పెళ్లి చేసాడు సావిత్రి తండ్రి వెంకటయ్య..( ఆ కాలంలో పిల్ల తండ్రి ముందుకి బానిష అయితే వారికి మందు ఆశ చూపించే వారు లేకపోతె ఎంతోకంత డబ్బు ని ఆశగా చూపించి వారి అమ్మాయిలను వివాహం చేసుకునేవారు )
  పెళ్ళైన నెల రోజుల నుండి రంగయ్య మంచాన పడ్డాడు ఆ రోజు నుండి అతనికి సేవ చెయ్యటానికే 2 సంవత్సరాల సమయం గడిచిపోయింది తర్వాత అనారోగ్యంతో అతను మరణించాడు..భర్త చనిపోయినప్పుడు కూడా సావిత్రి ఏడవలేదు  అసలు భర్త ,బాధ్యతలు అనే బంధాలు కూడా తెలియవు..భర్త చనిపోగానే సావిత్రిని విధవని చేసి తెల్లచీరె కట్టి ఇంట్లో కూర్చో పెట్టారు.. 

6 సంవత్సరాల తర్వాత..! 

      ఈ బాల్య వివాహాలు, కన్యాశుల్కం ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది..అప్పుడు అప్పుడే ప్రజలలోకొద్దికొద్దిగా  చైతన్యం మొదలయింది ఈ బాల్య వివాహాలను అరికట్టాలి అనే దిశగా.. 

శ్రీను ....!     26 సంవత్సరాల యువకుడు..ముఖంలో తేజస్సు..అపారమైన తెలివి తేటలు..ఎంతటి వారినైనా రెండు నిమిషాలు చూసి మనిషిని అంచనా వెయ్యగల దిట్ట.. పట్టణంలో బారిస్టారు పూర్తి చేసి  5 సంవత్సరాల తర్వాత ఊరికి తొలిసారిగా  తిరిగి వొచ్చాడు ..ఎప్పటినుండో ఈ బాల్య వివాహాల పట్ల అతను వ్యతిరేకతను చేస్తూనే ఉండేవాడు..కానీ తన ఊరిలో చిన్న చిన్న పిల్లలను విదవలుగా చూడగానే అతని గుండె చేదిరిపోయింది..ఈ మూఢనమ్మకాలను ఆపాలి అని కొద్దో గొప్పో చదువుకున్న వారికి హితోపాదేశం చేసి ఒక పది మందితో కలిసి చిన్న గ్రూప్ లాంటిది ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఈ మూఢనమ్మకాల ప్రభావాన్ని వివరిస్తూ దీని వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు గురించి వివరిస్తూ అందరిని చైతన్య వంతులను చెయ్యటం మొదలుపెట్టాడు..  

వీరి ఉద్యమం చాలా మందిని చైతన్య వంతులను చేయసాగింది ..అలా ఊరు ఊరు తిరుగుతూ ఉండగా ఒక ఊరిలో చూసాడు సావిత్రిని..గుండ్రటి ముఖం,నల్లని కలువల లాంటి కళ్లు,నడకతో పాటు ఒయ్యారంగా ఊగుతున్న ఒతైన జడ,ఎంతటి వారినైనా ఒకే నవ్వుతో పడేసే చిరునవ్వు..వీటి అన్నిటికి విరుద్దంగా తాను కట్టుకున్న తెల్లని చీరె..ఒక్క నుదిటిన బొట్టు తప్ప దేనిలోను అప్సరసలకి తీసిపోదు..వీరి ఇరువురి చూపులు కలుసుకున్నాయి సావిత్రి వెంటనే సిగ్గుతో లోపలికి వెళ్లిపోయింది..అమ్మాయిలకు పెళ్లి పట్ల ఎన్నో ఊహలు ఉంటాయి అవన్నీ ఎలాగూ తీరలేదు భర్త చనిపోయాక వేరే వారికి కన్నెత్తి చూసే అవకాశం లేదు మొదటి సారిగా శ్రీను ని చూడగానే ఎదో తెలియని అనుభూతి.. 

  ఇది ఇలా ఉండగా మరోపక్క తమ ఆచారాన్ని మంటగలుపుతున్నారు  అని  అక్కడ పెద్దమనుషులు అనే పేరు పెట్టుకున్న వారు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇది మన హక్కు అని చెపుతూ  బాల్య వివాహాల లాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించటం మొదలుపెట్టారు ...
మూఢనమ్మకాలకు విరుద్ధంగా పోరాటం చేసేవారు మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారితో  పోరాటాలు తారాస్థాయిలో జరుగుతున్నాయి..

కానీ ఇంతలోనే...! 

next episode will be updated soon                                                                                                                         రచన 

                                                                                                               రఘు చౌదరి 

Tuesday, 25 July 2017

మను


కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మనల్ని నిర్విరామంగా మోస్తూనే ఉంది..పాపా,పుణ్యాలను సమపాళ్లతో స్వీకరిస్తుంది.. పురాణాలను చదివిన వారు ఈ భూమిని దేవతంటారు..సైన్స్ చదివిన వారు ఆకర్షణ అంటారు..

ఎప్పటిలాగే తన చుట్టూ తాను తిరుగుతూ అలానే సూర్యుని చుట్టూ  ఒక కక్షలో తిరుగుతూ పోతుంది భూమి.. అలా తిరుగున్న సమయంలో   కనురెప్ప పాటు కాలంలో ఎన్నో చావులు,ఎన్నో పుట్టుకలు..ఎన్నో జీవితాలు కథలుగా మారుతాయి..మరెన్నో జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతాయి..

   ఈ కథ కూడా అలాంటి రెప్ప పాటు కాలంలోనే ప్రాణం పోసుకుంది...ప్రతి కథ ని ఒక రచయిత ప్రాణం పోస్తాడు కానీ నా కథకు మాత్రం పగ అనే మారణాయుధం  ప్రాణం పోసింది..

ఆవారాగా తిరిగే ఒక కుర్రాడు ??

కష్టపడి రూపాయి ,రూపాయి కూడపెట్టే ఒక అల్ప సంతోషి ??

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ఒక కరుడుకట్టిన రాజకీయ నాయకుడు ??

జరిగిన ఒక ఘోర సంఘటన ?? ఎంతమంది పరిస్థితుల్ని మార్చింది..??
చివరకు గెలిచింది న్యాయమా ??  అన్యాయమా ??

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ...


     *                               *                               *                             *

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రానున్ను రెండు రోజులు ఆంధ్ర,రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..కావున ప్రజలు అప్రమత్తులై ఉండాలి అని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేయడం జరిగింది..

  సిటీలో చిన్న గల్లీలో ఉన్న ఒక ఇరుకు ఇల్లు అది.. అక్కడ ఇళ్లే కాదు మనుషుల మధ్య కూడా ఇరుకే..ఒకవైపు ఇల్లు మొత్తం వర్షం కారణంగా నీటితో నిండి ఉంది..ఇక్కడ మన దేశపు రాజకీయ నాయకుడు మాకు చేసిన అన్యాయంతో మా  కళ్ళలో కూడా నీళ్లు నిండుతున్నాయి..

సెప్టెంబర్ 12
సాయంత్రం 6 గంటల సమయం

వర్షాకాలం కావటం వలన అందులోను వర్షం వలన చీకటి తొందరగా పాలన మొదలుపెట్టింది ... ఆ కటిక చీకటిలో ఒకరికి ఒకరు కూడా కనపడటం లేదు .. అప్పుడే సరిగ్గా బొంగురు గొంతు నుండి చిన్నగా బయటకు వొచింది ఒక మాట ,రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మనది మనకు ఎందుకురా పెద్ద వాళ్ళతో గొడవలు..మనం ఈ ఊరు వొదిలి దూరంగా ఎక్కడకు అయినా వెళ్లి బ్రతుకుదాం..ఇప్పటికి జరిగినది చాలు ?? మనకు ఆ స్థలం వొద్దు ఏం వొద్దు ?

ఎక్కడకు వెళదాం నాన్న ??

ఎక్కడకు వెళ్లినా ఇలాంటి నీతి మాలిన కుక్కలు ఉంటూనే వుంటారు..డబ్బు ఉంది అన్న అహంకారం..పదవిలో వున్నాను అన్న పొగరు..అనవసరంగా నాలాంటి మెంటల్  (నా బీప్ -----) గెలికాడు..నేనేంటో చూపిస్తా వాడి పొగరు దించుతా ?? ఇప్పటివరకు ఆవారాగా తిరిగా అదే ఆవారాగాడికి ఏం చెయ్యాలో కూడా తెలుసు ..మనల్ని అవమానించిన వాడే మన కాళ్ళ మీద పడేలా చేస్తా..,?? 


5 సంవత్సరాల తర్వాత??

        ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , ఈ రోజు మాత్రం రిసీవ్ చేసుకోవటానికి వొచ్చిన వారితో కిత కితలాడుతోంది..ఇసుక వేస్తె రాలనంత మంది జనం.. ఆడ,మగ తేడా లేదు..వయసు మళ్ళిన వారు ఎముకలు క్రుళ్ళిన వారు అని భేదం లేదు ?? 

అందరి కళ్ళు నిస్తేజంగా ఎదురుచూస్తున్నాయి.. మాములు జనం తో  పాటు మంత్రులు,MLA లు కూడా అతని రాక కోసమే ఎదురుచూస్తున్నారు..అతను దిగగానే ఎదో ప్రళయం వోచినట్టు అందరూ, సెక్యూరిటీ వారిని కూడా లెక్కచేయకుండా ఒక్కసారిగా  మీద పడిపోయారు..ఫొటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపిస్తూ తమ కెమెరాలో అతన్ని భందించేసారు. విడియోగ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే సమయం వొచ్చింది అన్నట్లు అందులో లీనమైపోయారు..
ఎంతో మంది ఇలాంటి కొడుకు నాకు ఎందుకు పుట్టలేదా అని కుమిలిపోయారు ?? మంత్రులు పుష్పగుచ్చా లతో అతనికి స్వాగతం పలికారు..

5 సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఆవారా గాడు అని బిరుదులు ఇచ్చిన వారు...ఈ రోజు అతని విలువ తెలుసుకొని దేవుడు అని సంబోదిస్తూ అతనికి స్వాగతం పలకటానికి వొస్తున్నారు ..

అతను రాజకీయ నాయకుడా ??  కాదు.
దొంగ స్వామిజీనా ??  కాదు..

అతను ఇండియా వొదిలి 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇంత ప్రేమ ఎలా ??
కేవలం 5 సంవత్సరాలలో ఇంత ఎదుగుదల ఎలా సాధ్యం..??

అసలు ఎవరు ఈ మను ??

జనం ఇంతగా అతన్ని ఎందుకు ఆదరిస్తున్నారు..??

5 సంవత్సరాల క్రితం _______     బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలవ్వక ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మరుసటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ??


( ఇంకా ఉంది ...next episode will be updated soon ).

Monday, 19 June 2017

రఘు అనే నేను - 4


స్కూటీ ఇక్కడ ఆపు అంది ఆపాక ఇలా అంది..
నాలో టెన్షన్ ఎక్కువ అయింది ఆమె వైపు సూటిగా చూడాలేక పోతున్నాను..
రఘు నేను నీకు నో చెప్పలేను అలాగని యెస్ కూడా చెప్పలేను..
అర్ధం కాలేదు..??

నువ్వంటే నాకు ఇష్టమే...కానీ నా జీవితానికి సంబంధించిన ఏ విషయం అయినా మా తల్లిదండ్రులు నిర్ణయించాల్సిందే..నేను లవ్ చేసి అది వాళ్లకు నచ్చక పారిపోయి పెళ్ళిచేసుకోటాలు,ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల పరువు తీసి వాళ్ళు తల ఎత్తుకోకుండా చెయ్యటాలు ఈ ప్రోసెస్ ఏ నాకు చిరాకు..అందుకే మా పేరెంట్స్ ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు..

   ఇప్పుడు నీ మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది హారిక..లవ్ చేసి పారిపోయే వాళ్ళను చూశాను కానీ తల్లిదండ్రుల పరువు పోతుంది అని ఆలోచించే వాళ్ళు కొందరే వుంటారు ఆ కొందరిలో నేను లవ్ చేసిన అమ్మాయి ఉండటం నాకు ఎంతో ఆనందంగా వుంది..
జాబ్ రాగానే వొచ్చి మీ నాన్నగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను..

                 *  2014 సెప్టెంబర్ *

ఈ సాఫ్టువేర్ జాబ్ లను నమ్మటమే పాపం అయిపోయింది.. రెండు సంవత్సరాలు గడిచినా జాబ్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది..జాబ్ లేకుండా ఏమని అడగను మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అని..పోషించటం చేతకాని నాతొ సంసారానికి పంపండి అని..

హారిక ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అని చెప్పింది.. ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.

ఇక వెళ్లి హారిక వాళ్ళ నాన్నకు జరిగినది చెప్పి కొంచెం గడువు అడుగుదాం అని  బయలుదేరాను..నేను హారిక ఫ్రెండ్ గా వాళ్ళ నాన్నగారికి పరిచయమే..

హలో అంకుల్ ..!
హా రావోయ్ రఘు ..ఏంటి ఈ మధ్య బొత్తిగా రావుటమే మానేశావ్..
మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంకుల్..
దేనిగురించోయ్..??

మీ అమ్మాయి గురించి..
మా అమ్మాయి గురించా అతని ముఖం మీద ఆశ్చర్యార్థకం క్లియర్ గా కనిపిస్తుంది..

జరిగిన విషయం, జాబ్ కోసం పడిన పాట్లు, మీతో ఈ విషయం చెప్పటానికి పడిన మనోవేదన, పూసగుచినట్టు వివరించాను..

ఐతే ఇప్పుడు నీకే దిక్కులేదు నా  కూతుర్ని పెళ్లి చేసుకొని ఆమెను పోషించాలి అంటే నీకు జాబ్ కావాలి అప్పటివారకు నా కూతురికి పెళ్లి చెయ్యకుండా ఉండాలి..నీకు జాబ్ వొచ్చేవరకు గడువు ఇవ్వాలి అంతే కదా ??

 సరే ఇది చెప్పు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు..వెనకాల ఎమన్నా ఆస్తులు ఉన్నాయా..
నాన్న చిన్నప్పుడే పోయారు..అమ్మ కూలి పని చేసి నన్ను చదివించింది..

ఒకవేళ నీకు జాబ్ రాకపోతే ??

ఒక వేళ వొచ్చినా కానీ.. వొచ్చిన కొంచెం శాలరీలో మీ అప్పు తీర్చటానికి సగం..మీరు బ్రతకటానికి సగం ఇంకా మా కూతుర్ని ఏం పెట్టి పోసిస్తావు..దాన్ని పస్తులు ఉంచుతావా..

నా రేంజ్ ఏంటో తెలుసా నీకు ..ఈ స్టేట్ లొనే ఒన్ అఫ్ ది బెస్ట్ లాయర్ ని, నా స్టేటస్ చూసి MLAలు MP లు నా కూతుర్ని తమ కోడలిగా చేసుకునేందుకు క్యూ కడుతున్నారు..

చిన్నపటి నుండి నా కూతురు ఏం కావాలంటే అది చిటికెలో ఎంత ఖరీదు అయినా సరే చిటికెలో తెచ్చి ఇచ్చే వాడిని..

నువ్వు ఇవ్వగలవా అలా..
నువ్వు చూసుకోగలవా నాలా..
ఏం చెయ్యగలవు నువ్వు నా కూతురు కోసం..

నాకు డబ్బు లేకపోవొచ్చు, మీ కూతురు అడిగింది నేను ఇవ్వలేక పోవొచ్చు..కానీ మీకంటే బాగా చూసుకుంటాను అని మాత్రం చెప్పొచ్చు..

ఎలా చెప్పగలవు...???

NEXT EPISODE WILL BE UPDATED SOON..
                                      
                                         రచన
                                      రఘు చౌదరి

Tuesday, 13 June 2017

రఘు అనే నేను - 3
ఏంటి తనని చూడకుండా ఉండలేక పోతున్నాను..
ప్రేమిస్తున్నానా..??

ఛా.. ఛా.. తను నా ఫ్రెండ్ కదా అలాంటిది ఏం ఉండదు..
ఒక వేళ తనకు కూడా ఇలాంటి ఫీలింగే వుందా.. ఉంటే ఎలా తెలుసుకోవాలి..

ఇలా నాలో నేను మధన పడుతూ ఉండగా ఆ ఆలోచనలను తెంచుతూ రాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేసింది హారిక.

రేపు సండే కదా నీ ప్లాన్ ఏంటి??
ప్లాన్ అంటూ పెద్దగా ఏం లేదు హాస్టల్ లొనే..
బయటకు వెళదాం...రేపు ఉదయం 5 కి రెడీ గా వుండు నేను మీ హాస్టల్ దగ్గరకు వొచ్చి పిక్ అప్ చేసుకుంటాను..
అవును ఇంతకీ ఎక్కడికి వెళ్లేది ??

మార్నింగ్ 6:00 

   స్కూటీ ఎల్ బి నగర్ హయత్ నగర్ రోడ్ల వెంబడి వెళ్తుంది.. చల్లటి గాలి రివ్వున వీస్తుంది..హారిక స్కూటీ డ్రైవ్ చేస్తుంది నేను వెనుక కూర్చున్న... ఆ గాలికి ఆమె కురులు నా ముఖాన్ని తాకుతున్నాయి ..ఆమె తలనుండి వొచ్చే  మల్లెపూల సువాసన నాకు మత్తు ఎక్కిస్తుంది..గంట తర్వాత స్కూటీ సంఘీ టెంపుల్ చేరుకుంది..
సినిమాలకి,షాపింగ్ లకి ఒక రోజు ముందుగానే చెప్పే ఆడవాళ్లు గుడికి మాత్రం వెళ్లే వరకు చెప్పరు..
సంఘీ :-
     అన్ని గుళ్లలో లోపలికి వెళ్ళాక కనిపించే దేవుడు సంఘీ లో మాత్రం బయట గుడి మెట్లు ఎక్కుతుంటేనే కనిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు.. నానా కస్టాలు పడి పైకి చేరుకున్నాం.
లోపలికి వెళ్ళాక 108 ప్రదక్షణల కార్యక్రమం మొదలయింది..భక్తితో ప్రదక్షణలు చెయ్యటం మానేసి రన్నింగ్ చేస్తున్నారు భక్తులు..దర్శనం చేసుకొని వొచ్చి బయట మెట్లమీద ప్రసాదం తింటూ కూర్చున్నాం..
ఎందుకో తెలియదు పరికీని, ఓణీలో కడిగిన ముత్యం లా చూపు తిప్పుకొనియ్యకుండా వుంది హారిక..ఆమెను అలాగే చూస్తూ ఉండి పోయాను..
ఏంటి అలా చూస్తున్నావు..??
ఏం లెదు ఊరికే.
లేదు నీ చూపులో ఏదో తేడా కనపడుతుంది ఏమైందో చెప్పు..??
ఈ రోజు నువ్వు చాలా చాలా అందంగా వున్నావు..   
ఏంటి ఇవాళ ఎదో కొత్తగా మాట్లాడుతున్నావ్..
కొత్తగా కాదు నిజం మాట్లాడుతున్నా..
     ఐ లవ్ యు

నువ్వు 3 నెలలుగా నాకు తెలుసు..ఈ మూడు నెలల్లో నీ ఇష్టాలు,అయిష్టాలు తెలుసుకున్నాను..నీ కష్ట, సుకాల్లో పాలుపంచుకున్నాను..
నువ్వు నవ్వితే నా పెదాల మీద చిరునవ్వు కదలాడేది.. నువ్వు ఏడిస్తే నాకు తెలియకుండానే నా కళ్లలో నీళ్లు తిరిగేవి..ప్రేమంటే ఏంటో అర్ధం చెప్పిన కవులు ఆ ప్రేమ ఎలా పుడుతుందో మాత్రం చెప్పలేక పోయారు..బహుశా ఇదేనేమో ప్రేమంటే..నీకు కష్టం కలిగించే ఏ పని ఏది నేను చెయ్యను..నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పలేను కానీ నాకు ఉన్నంతలో నిన్ను మహారాణిలా చూసుకుంటాను..నన్ను పెళ్లి చేసుకుంటావా??

అక్కడ సూది పడితే వినపడే అంత నిశబ్ధం.. లబ్ డబ్ అంటూ నా గుండె చప్పుడు నాకే వినపడుతోంది..తను ఏం మాట్లాడకుండా స్కూటీ దగ్గరకు వెళ్ళింది నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళాను..

నన్ను డ్రైవ్ చెయ్యమని చెప్పింది..ఆమె ముఖం లో ఏ భావాలు కనిపించటం లేదు..నాలో టెన్షన్ పెరిగిపోయింది..ఆమె నో అని చెప్పినా ఇంత టెన్షన్ పడేవాడిని కాదేమో..
స్కూటీ వెళ్తుంటే ఇక్కడ ఆపు అంది..అక్కడ దిగాక ఇలా చెప్పింది..

( అంతలా ప్రేమిస్తున్న వ్యక్తికి ఏం చెప్పి ఉంటుందో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి..).
Next episode will be updated soon..
                                        
                                                 రచన
                                           రఘు చౌదరి

Wednesday, 7 June 2017

రఘు అనే నేను - 2


     Special thanks to abhinay..!

       *    22 - జూన్ - 2012   *

ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హాస్టల్ కి దగ్గరగా వున్న కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుదాం అని డెమో క్లాస్ కి వెళ్ళాను..డెమో క్లాస్ మొదలయ్యి 10 నిమిషాలు అవుతుంది..క్లాస్ ని అదరగొడుతున్నాడు చెప్పటానికి వొచ్చిన సార్..నిశబ్ధంగా వున్న క్లాస్ డోర్ దగ్గర నుండి EXCUSE ME SIR అంటూ ఒక అమ్మాయి వాయిస్..

   క్లాస్ లో వున్న అబ్బాయిలందరూ ఒక్క నిమిషం పాటు తనవైపు తదేకంగా చూస్తూ కనురెప్ప కొట్టటమే మరిచిపోయారు..
అందానికే పర్యాయపదంలా...
అలంకారం అన్న పదానికే నానార్థం లా వుంది తను.

ఆమెను చూస్తూ నా డెమో క్లాస్ వినడమే మర్చిపోయాను..ఆ అమ్మాయి మా కాలేజీ.. ఇంకా చెప్పాలి అంటే మా పక్క సెక్షనే..
క్లాస్ అయిపోయాక వెళ్తుంటే..తనే వొచ్చి
హలో EXCUSE ME మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు వుంది..మీది గురునానక్ కాలేజీ నా..
అవును ...మీ పక్క సెక్షనే నేను..నా పేరు రఘు ,మీ పేరు హారిక కదా..
అవును..
మొత్తానికి పరిచయం అయిపోయింది..
     

హారిక
     ఆమె అందాన్ని వర్ణించాలి అంటే ఎంత పెద్ద కవి అయినా మాటలు వెతుక్కోవాల్సిందే..నుదిటి మీద తెలుగు అమ్మాయిని అని చెప్పటానికి సింబాలిక్ గా చిన్న బొట్టు.. చెవులకు పెద్ద ,పెద్ద హ్యాంగింగ్స్..ఎర్రటి పెదాల మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు..యింక ఆ నడుము గురించి చెప్పాలి అంటే ఆహా..మగవాడికి పిచ్చి ఎక్కించటానికే దేవుడు తయారు చేశాడు అనుకుంటా..
అందుకే నేమో కాలేజ్ లో ఆమె వెనుక తిరిగి తిరిగి దేవదాసు లు అయినవారు ఎందరో..

మొదట్లో హయ్, బాయ్ లతో సాగిన మా పరిచయం ఒకటే కాలేజ్ కావటం వలన రోజులు గడుస్తున్నా కొద్దీ తొందరగా ఫ్రెండ్ అయ్యాము..ఎంతలా అంటే ఏ చిన్న విషయం అయినా నాతొ షేర్ చేసుకునేది..వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తను చేసిన షాపింగ్స్ గురించి కూడా చెపుతూ ఉండేది..ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడేది..
చూస్తూ వుండగానే C అయిపోయి JAVA స్టార్ట్ అయింది.

                 *  ఆగష్టు -2012  *

ఎప్పటిలాగే కాల్ చేసి రేపు తన బర్త్ డే అని కొంత మందినే INVITE చేస్తున్నాను..నువ్వు కూడా తప్పకుండా రావాలి అని చెప్పిన సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేను..
( ఆ కొంత మందిలో నేను వున్నందుకు ఆ క్షణం నేను ఎంతో సంతోషపడ్డాను ).
బర్త్ డే పార్టీలో మిణుకు మిణుకు మంటున్న ఆ వెలుగుల్లో ముందుకు పడుతున్న ముంగిర్లను వెనక్కి నెడుతూ...అదిరిపోయే బర్త్ డే డ్రెస్ లో అందరిని ఆకర్షించేలా వుంది..వాళ్ళ పేరెంట్స్ కి నన్ను పరిచయం చేసింది..
మా అమ్మా, నాన్న అంటే నాకు చాలా ఇష్టం ..ఒక్కటే కూతుర్ని కాబట్టి చాలా గారభంగా పెంచారు..వారి ఇష్టానికి విరిద్దంగా నేను ఏ పని చెయ్యను అని హారిక చెప్పే మాటల్లో తన పేరెంట్స్ మీద తనకి వున్న ప్రేమ ని నేను తెలుసుకోగలిగాను..

తన వేసుకున్న డ్రెస్ ఎఫక్టో తెలియదు..ఏంటో తెలియదు గాని పార్టీ నుండి వొచ్చి పడుకుందాము అనుకుంటే కళ్ళు మూసినా తెలిసిన ఆమె రూపమే..ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావటం లేదు..తన ఒక్క రోజు కనపడక పోయినా ఫోన్ చేసి ఏమయిందో తెలుసుకునే వరకు ఎదో వెలితిగా ఉండేది తను పంపిన గుడ్ మార్నింగ్ తోనే నా డే స్టార్ట్ అయ్యేది..తను కూడా అంతే నేను ఒక్క రోజు కనపడక పోయిన వెంటనే ఫోన్ చేసి ఏమైందో తెలుసుకునేది..

అలా SUNDAY లతో కూడా సంబంధం లేకుండా మా పరిచయం సాగిపోతుంది..

ఏంటి తనని చూడకుండా ఉండలేక పోతున్నాను..
ప్రేమిస్తున్నానా..??
ఛా.. ఛా.. తాను నా ఫ్రెండ్ కదా అలాంటిది ఏం లేదు..
ఒక వేళ తనకు కూడా ఇలాంటి ఫీలింగే వుందా..ఎలా తెలుసుకోవాలి..
ఇలా నాలో నేను మధన పడుతూ ఉండగా అనుకోకుండా ఒక రోజు...

( please check my website..to read more blogs..)

( Raghuchowdary87.blogspot.com)

NEXT EPISODE WILL BE UPDATED SOON
                                      
                                                  రచన
                                             రఘు చౌదరి

Wednesday, 31 May 2017

రఘు అనే నేను

పాఠకులను దృష్టి లో ఉంచుకొని చదవటానికి అనుగుణంగా ఉండటానికి ఈ బ్లాగ్ ను ఎపిసోడ్స్ వారిగా రిలీజ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను..కావునా దయచేసి పాఠకులందరు ఎప్పటిలాగే ఈ బ్లాగ్ ని కూడా ఆదరిస్తారు  అని కోరుకుంటున్నాను..
 
         
                     ఎపిసోడ్ - 1

డాడీ..! నువ్వు,అమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా..!
అవునమ్మా..
మీ లవ్ స్టొరీ చెప్పండి డాడీ ప్లీజ్..నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ప్లీజ్ డాడీ..
సరే చిట్టి తల్లి ...అది 20121. 2012 :-
      ఈ సంవత్సరం నాకు బాగా గుర్తుంటుంది ఎందుకంటే యుగాంతం వొచ్చి ప్రపంచం అంతమవుతుంది అన్నారని కాదు..నేను అష్ట కష్టాలు పడి నా ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంవత్సరం కాబట్టి..ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక రెండు నెలలు అమ్మా వాళ్ళు చూసే బ్రతుకు జట్కాబండి,ఏడుస్తూ సాగిపోయే సీరియల్స్ ని చూస్తూ..చిన్నప్పుడు ఆడిన అష్టాచమ్మా, దాగుడుమూతలు,డాడీ, వానగుంటలు చిన్నపిల్లలతో ఆడుతూ అప్పటి మధుర స్పృతులను గుర్తుతెచ్చుకున్న రోజులవి..
ఇంజినీరింగ్ అయిపోయి 2 నెలలు పూర్తి అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావురా పోయి ఎదో ఒక జాబ్ చూసుకోరాదు..అని సతాయించే పక్కింటోళ్లు,ఎదిరింటోళ్లు.. వొచ్చిన కొత్తలో ఎంతో అపురూపంగా కోహినూర్ వజ్రంన్ని చూసినట్టు చూసినా మా పేరెంట్స్ ఇప్పుడు ఇసుకలో రాయిని చూసినట్టు చూస్తున్నారు.. ఇక  భరించలేక బయలుదేరాను ఎదో చేద్దాం ఎదో పొడుద్దాం అని..మనకు జాబ్ ఇచ్చే ఆ అదృష్టవ్యక్తి ని కలిసి అతని జన్మను సార్ధకం చేద్దాం అని..
ఖమ్మం బస్టాండ్ వొచ్చే పోయే ప్రయాణికులతో బిజీ గాను రద్దీ గాను వుంది..నేను అదే బస్టాండ్లో హైదరాబాద్ వెళ్లే బస్సు కోసం దాదాపు రెండు గంటల నుండి ఎదురుచూస్తూ వున్నా.. ఆ రోజు సండే కూడా కాదు కాని ఎందుకో కొంచెం రేష్ ఎక్కువుగా వుంది.. ఏదో కవి చెప్పినట్టు మనం ఎక్కాల్సిన బస్సు ఎప్పుడు ఒక జీవిత కాలం లేటు అది నిజమేనేమో అనిపించింది ఆ క్షణం..ప్రతి 5 నిమిషాలకి ఒక బస్ రావటం నా లగేజీ తీసుకోని బస్సు దగ్గరకు వెళ్ళగానే డ్రైవర్ రిజర్వేషన్ అని చెప్పటం అలా రెండు గంటల నుండి ఒక ప్రాసెస్లో జరుగుతుంది...బస్సు లు దొరకటం లేదు పైగా వేసవి కాలం అవటం వలన 46° లతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు..చిరాకు,నీరసం నా ముఖంలో క్లారిటీ గా కనిపిస్తుంది..
అప్పటి వరకు నా కంటికి కనిపించిన అమ్మాయిలందరు నీరసం వలన ఇప్పుడు బ్లర్,బ్లర్ గా కనిపిస్తున్నారు..
ఎదో నా అదృష్టవశాత్తూ ఒక ఎక్సప్రెస్ 1 వ నెంబర్ కి రావటం దానికి రిజర్వేషన్ లేకపోవటం తో వెళ్లి టికెట్ తీసుకొని విండో సీట్ ని ప్రిఫర్ చేసుకొని కూర్చున్నా..స్టేట్ ఫస్ట్ ర్యాంకు వొచ్చినా ఇంత ఆనందం కలిగేది కాదేమో..

2. ఖమ్మం - హైదరాబాద్ :-

నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఇంజినీరింగ్ చేసినా,కాలేజ్ అయిపోయాక హైదరాబాద్ వస్తుంటే మాత్రం ఎదో తెలియని ఫీలింగ్..బస్సు కదలగానే హెడ్సెట్ పెట్టుకోని ఇళయరాజా గారి హార్ట్ టచింగ్ సాంగ్స్ వినుకుంటు కళ్ళుమూసుకున్న...ఒక్క సారిగా బ్రేక్ వేసిన ఫీలింగ్ వొచ్చి కళ్ళుతెరిసే సరికి ఎక్సప్రెస్ బస్సు ఎక్సప్రెస్ వేగంతో వొచ్చి MGBS బస్టాప్ లో ఆగింది.. ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ నరకానికైనా ఆనందంగా వెళ్లొచ్చు ఆలాంటిది హైదరాబాద్ పెద్ద లెక్కేమీ కాదు..డ్రైవర్ దిగాలి,దిగాలి లాస్ట్ స్టాప్ అని అరుస్తున్నాడు.. నిద్ర మత్తులో ఉండటం వలన టికెట్ వెనకాల రాసివున్న 62 /-రూపాయలను  తీస్కోకుండానే బస్టాప్ బయటకు వొచ్చా..MGBS టూ KPHB బస్సు ఎక్కా.. బస్సు ఖైరతాబాద్ పంజాగుట్ట మీదిగా అమీర్ పేట చేరుకుంది..

3. అమీర్ పేట్ :- 

   బస్సు దిగగానే ఎదో ఒక కొత్త లోకాన్ని చూస్తున్నట్టుగా చుట్టూ ఎత్తయిన భవంతులు,, హారన్ సౌండ్,వైకిల్స్ సౌండ్ ఎఫెక్ట్స్ తప్ప మరేమీ వినపడటం లేదు..రోడ్డు మీద చిందర వందరగా పడివున్న పాంప్లేట్లు,ఎటు చూసినా కోచింగ్ సెంటర్ల పేర్లతో నిండి వున్న బ్యానర్లు..రోడ్డు మీద అక్కడ అక్కడా పడి వున్న గుంతలు, అక్కడి వాతావరణం అంతా కొత్తగా వొచ్చే వారిని ఆకర్షించేలా వున్నాయి..
       
      ఎంతో అందమైన అమ్మాయిలకు,వాళ్ళ వెంట పడే అబ్బాయిలకు,జాబ్ చేసేవాళ్లకు, జాబ్ వెతుక్కునే వాళ్లకు అమీర్పేట్ కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు..రక రకాల పేర్లు పెట్టి వున్న లాంగ్వేజ్ లని నేర్చుకోవటానికి ఇక్కడకు వస్తుంటారు చాలామంది.. ( C , JAVA , C++,DOTNET ) మేము కూడా వాళ్లలో వున్నవాళ్ళమే.. ఈ లాంగ్వేజ్ లు అర్ధం కావు అంటారు కొందరు..ఇవి నేర్చుకుంటేనే జాబ్ అంటారు ఇంకొందరు..ఏది ఏమైనా హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్..అమీర్ పేట్ కోచింగ్ సెంటర్స్ కి ఫేమస్ అని మాత్రం చెప్పొచ్చు..

4 . హాస్టల్ : -
 
     బస్టాండ్ కి కొంచెం దూరంలో ఎరుపు రంగు ఆక్షరాలతో గణేష్ బాయ్స్ హాస్టల్ అని కనిపిస్తుంది..బయట చూడటానికి పాడుబడ్డ భవంతిలా ,లోపల మాత్రం కొంచెం పరలేదు అనిపించేలా వుంది..లోపలికి అడుగు పెట్టగానే ఒక బల్ల కనిపించింది.. సాయంత్రం కావటం వలన దాని మీద స్నాక్స్ పెట్టి వున్నాయి..పక్కనే వేడి వేడి చాయ్ బిస్కెట్ కూడా..ఆ బల్ల పక్కనే నిల్చొని వుంది ఒక భారీ పర్సనాలిటీ...కుడి చేతికి రెండు,ఎడమ చేతికి రెండు ఉంగరాలు..చేతిలో iphone ... చూడటానికి ఎంతో నాటుగా వున్నా బయటకు మాత్రం స్టైల్ గా కనిపించటానికి నానా కష్టాలు పడుతుంది.. వయసు 40 - 50 మధ్యలో ఉంటుంది అని ఆమె ముఖం మీద వున్న ముడతలె చెపుతున్నాయి..ఆమె హాస్టల్ ఓనర్ లక్ష్మి..నాకు నవ్వుతూ స్వాగతం పలికింది..
  ఆంటీ హాస్టల్ ఫీజు ఎంత అడిగాను మొహమాటంగా..!
3,600/- అబ్బీ..! అంటూ ఆ హాస్టల్ గురించి అక్కడి ఫుడ్ ఫెసిలిటీస్ గురించి 10 నిమిషాలకు పైగానే ఆంధ్ర యాసలో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో స్పీచ్ ఇచ్చింది..
మరి రూమ్ ఎక్కడ ??
రూమా అబ్బీ మూడవ ఫ్లోర్లో ఎడమ వైపు గడియ పెట్టి ఉంటుంది 302 అని.. గిప్పటికైతే గా రూమ్ ల ఎవరు లేరు ఇంకో రెండు రోజుల్లో వొస్తారు అప్పటి వరకు జర సర్దుకో అబ్బీ..!
రూమ్ కొంచెం పెద్దదే.. మొత్తం నాలుగు చెక్క బెడ్ లు వాటి మీద పరుపులు అమర్చబడి వున్నాయి...ఆ బెడ్ మీద వేసిన పరుపులు ఎప్పుడో పురాతన కాలంలో వేసినవి అనుకుంటా బాగా పల్చగా  అయ్యాయి,యింకా చెప్పాలి అంటే దుప్పటి లా తయారయ్యాయి..ఇంతకు ముందు ఆ రూమ్ లో వున్న వారిలో సెహ్వాగ్ ఫ్యాన్ వున్నాడు అనుకుంటా రెండు ,మూడు ఫొటోస్ అంటించి వున్నాయి..మొత్తానికి చాలా హాస్టల్స్ తో పోలిస్తే బెటర్ అని చెప్పొచ్చు..


   NEXT EPISODE WILL BE UPDATED SOON..
                                                  
                                                        రచన
                                                  రఘు చౌదరి
    
    
              *  English version *

Paarakulaku anugunam gaa vundataaniki ee  blog nu episodes vaari gaa release cheddam anukunnanu.. kaavunaa paatakulandaaru eppatilaagane ee  blog ni kuda aadaristaru ani korukuntunnanu..

               
                      Episode - 1

Dadi ..ammaa nuvvu preminchi pelli chesukunnaraa..

Avunammaa..

Naaku love stories ante chaala istam dadi..nee  love story cheppu dadi..

Sare chitti thalli..adi 2012..


1 .2012 :-


  Aa year naaku baaga gurthundi..aa year lo prapancham antham avutundi annaru ani kadhu..asta kastaalu padi nenu engineerig poorthi chesina year kaabatti..Engineering poorthi ayyaka 2 nelalu kaalee gaa vundi amma vallu chuse brathuku jatka bandi,saagadeestu vunde T.V serials chustu...asta chamma,valana guntalu,dadycharkon,co,laanti chinnappati aatalani chinna pillalato aadi chinnappati madhura sprutulanu gurtutechu kuntunna rojulavi...

Result vochi 2 nelalu avutundi..inka enni rojulu vuntaavu kaaligaa ani adige pakkintollu,edirintollu,vochina kotha lo appudappudu voche pandagalaa chuse  maa parents ippudu eppudu voche weekends laa feel avutunnaru..ikaa thattukoleka bayaluderaanu..Edo cheyyataaniki..manaku  job iche adhrusta vyathi ni kalisi athani janma sardakam cheyyataaniki..

Khammam bustand lo Hyderabad velle bus kosam wait chestunna,Aa roju Sunday kuda kadhu kani rush konchem ekkuva vundatam valana bus lu dorakatam karuvayyayi..prathi 5 nimishaalaki okasaari Hyderabad bus raavatam adhi raagane naa laguage  teesukoni vellatm..alaa vellina prathi bus driver  reservation ani cheppatam.ilaage rendu gantala nundi oka  process lo jarugutundi..bus lu dorakatam ledu paiga vesavi kaalam kavatam valana 45° la range lo bhanudu thana prataapanni chupistunnadu, ika visugochi bus lu vochina vellakunda nirasha to kurchunna.

Aapati varaku naa kantiki kanipinchina andamaina ammayi landaru ippudu neerasam valla blur ga kanipistunnaaru.

10 nimishaala tarvata 2 express bus lu 1,2 plot forms ki vochi aagayi..entha neerasam gaa vunna kaani edo chinna hope vundatam valla adigi chuddam ani veltunna ee lopu lone raavali raavi suryapet,Hyderabad antoo driver maatalu..state 1st vochinantha aanandam ventane velli left side lo vunna window seat prefer chesukunna..

2 .Khammam to Hyderabad :-
Naalugu samvatsaraalu engineering HYD.lone chesina , college aipoyaka job kosam veltunte 1st time Edo teliyani evaru varninchaleni feeling..seat lo kurchoni headset pettu koni ilayaraaja gaari  heart touching songs vinukuntoo kallu moosukunna..ikayaraaja vaari songs vintu narakaanikaina haayi gaa vellichu ika  Hyderabad entha pani.

Driver Edo suddern break vesina feeling vochi kallu terichi chuse sariki nenu ekkina express ..express vegam to vochi MGBS bus stand lo aagi vundi..driver last stop ani peddagaa arustunnadu. Aa hadaavidilo ticket meeda rasi vunna
65/ - change ni marchipoyaanu, ventane digi MGBS to KPHB bus ekki ammerpet lo digaa..

3. Ameerpet :-

   Bus digagaane edho oka kotha lokanni chusinatlu gaa Chuttu ethaina buildings,road meede chindara vandaragaa padi vunna pamplates..Etu vaipu chusinaa coaching centerla perlato nindi vunna baners anni kothaga voche vallani aakarsinchelaa vunnayi.
Entho andamaina ammayilaku valla venta pade abbayilu ,coaching antu join ayye variki, job lu chese vaariki care of address ani cheppochu..
    raka rakaala perlu petti ardam kaani language ni nerchukotaaniki vochaamu Memu kuda. ( C , JAVA ,C++, DOTNET) maa  btech class mate goutham gaadu 2 rojula tarvata vasta mundu nuvvu velli aa coaching center laki daggara gaa vunna hostel ni chudu ani nannu pampinchaadu..

4 . Hostel : -

  Bus stop nundi konchem dooram kanipistundi erupu rangu aksharaalato vunna GANESH BOYS HOSTEL. Choodataaniki paadubadda bavanthi laa,lopala matram Edo konchem paravaaledu anipinchelaa vundi. lopaliki  vellagaane rendu ballalu ..evening kaavatam valana snaks time..oka balla paina guggeelu..inko balla paina vedi vedi chai bisckets..vunnayi..aa ballala pakkane nilchoni vundi oka baari  aakaram lanti manishi.  ( kitha kithalu movie lo heroin antha laavu ) naaku  swaagatam palikindi..aame hostel owner lakshmi.

Auntie hostel fee entha..annanu  mohamaatam gaa.

3,600 /- abbi..antu aa hostel food facilities gurinchi 10 nimishaalaku paigaane five star hotel range lo aandhra yasha lo explain chesindi.

Sare aaunti inko rendu rojullo maa friend kuda vastaadu..

Sarley abbi moodava floor lo kudi vaipu gadiya petti vuntadi aa room lo vundu  mee friend ni kuda Ade room lo vundamanule..

Room konchem peddade..motham naalugu chekka bed lu vaati meeda parupulu..aa bed meeda vesina parupu eppudo puraatana kaalam lo konnadi anukuntaa chaala palchaaga duppatilaa tayaarayindi ..padamarana hanumanthudi photo okati athikinchi vundi.. aa room lo vunde iddaru 2 rojula munde kaali cheyyatm valana okkadine ekakigaa vundalsi vochindi..mothaaniki aite chaala hostels to poliste better ani cheppochu.
                                     

                                              Rachana
                                      Raghu chowdary

రఘు అనే నేను - 5

ఎపిసోడ్ - 1 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఎపిసోడ్ - 2 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఎపిసోడ్ - 3 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఎపిసోడ్ -...

most popular posts