Sunday 4 December 2016

సుందరం ఫ్యామిలి

    

గడియారం 8 గంటలు కొట్టన చప్పుడుతో తన నిద్ర నుండి మేల్కోన్నాడు సుందరం.
2002- JAN 1:- అందరి ముఖాలలో రాత్రి తాగిన మందు తాలూకు ప్రభావం యింకా స్పష్టంగానే కనపడుతుంది కాని సుందరం ముఖంలో మాత్రం టెన్షన్ తో కలగలిసిన స్వేదబిందువులు తాళమాడుతున్నాయి.
సుందరం ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూనే వుంది అతని భార్య సుశీల. కానీ ఎందుకు అలా వున్నారు అని అడిగే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.
   ఎందుకంటే 1 వ తారీకు రాగానే కిళ్ళీ నములుకుంటూ వచ్చే ఇంటి యజమాని మంగళం గారు ( అతని ఇంటికంటే అతని నోరే పెద్దది) పాల బిల్లు కోసం వొచ్ఛే మల్లిగాడు ( వాడు పొసే పాలలో పాలకంటే నీళ్లే ఎక్కువ కానీ 1వ తారీకు రాగానే తీసుకునే బిల్లు మాత్రం కొండంత) వాటి గురించే టెన్షన్ అని సుశీల కి బాగా తెలుసు.
బాగా టెన్షన్ వున్నప్పుడు సుందరానికి సిగిరెట్ తాగే అలవాటు వుంది తన ఇంటికి 10 అడుగుల దూరంలో వున్న బడ్డీ కొట్టుదగ్గరకు వెళ్లి తన రేంజ్ కు తగిన విధంగా పనామా సిగిరెట్ ని వెలిగించుకొని యింట్లో కి అడుగుపెట్టాడు. అది చూసిన సుశీల సిగిరెట్ తాగను అని 5 సంవత్సరాల క్రితం మన బాబు పుట్టినప్పుడు చెప్పారు కదా.
సిగిరెట్ తాగి తాగి ముఖేష్  ఏమయ్యాడో  చూసారు కదా అని అరవటం మొదలు పెట్టింది. దానికి సుందరం
                CIGARETTE
C- CARRER
I-  ISSUUES
G- GON
A- AND
R- RECEIVING
E- ENERGY
T- TECHNIQUE
T- TABLET
E- EVERYTIME
మన జీవితం లోని కష్టాలను దూరం చేసి ప్రతీసారి మనకు కొత్త ఎనర్జీ ని యిచ్ఛే టెక్నిక్ టాబ్లెట్. అయినా 40 సంవత్సరాల తర్వాత వొచ్ఛే కాన్సర్ కంటే 4 నిమిషాలలో నా టెన్షన్ ని దూరం చేసే ఈ సిగిరెట్ నాకు ఇష్టం.
నా గురించి నీకు తెలుసు రాత్రి 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు వాచ్ మెన్ గా చీకటితో యుద్ధం చేస్తే నాకు వొచ్ఛే జీతం 4000/-
అందులో ఇంటి అద్దెకు 1500/-
పాలబిల్లుకు 600/-
మిగతా రోజూ వారీ సామాగ్రికి 1000/- ( బియ్యం, నూనె, సబ్బులు)
మిగిలిన 900 లలో మన పిల్లాడి ఖర్చు, కూరగాయలు. యిలాగే 6 సంవత్సరాల నుండి
సంసారాన్ని నెట్టుకొస్తున్నాను.
కానీ ఇప్పుడు పిల్లాడిని స్కూల్ లో చేర్పించాం LKG సీట్ కి 6000/- అడిగితె బేరం ఆడి ఆడి 4000/- కు చేర్పించాం నా జీతం మొత్తం స్కూల్ ఫీజ్ కే సరిపోయింది యిప్పుడు అద్దె , బిల్లు ఎలా కట్టాలి అది మర్చిపోటానికే  ఈ సిగిరెట్.
ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చెసి ఉద్యోగం కోసం వెళ్తే 3000/- లంచం అడిగాడు ఒక లాంచగొండి. నా దగ్గర డబ్బులు యిచ్ఛే అంత స్తోమత లేదు యివ్వమని అడగటానికి నాన్న కూడా లేడు. యిక ఉద్యోగం అంటే చిరాకు పుట్టి తినటానికి తిండిలేక వాచ్ మెన్ గా జాయిన్ అయ్యా. ఇప్పుడు తెలుస్తుంది దాని ఎఫెక్ట్. రోజు మొత్తం కష్టపడి 100/- సంపాదించింన మధ్య తరగతి వాడి దగ్గర కుడా లంచం తీసుకునే వాళ్ళు వున్నంత కాలం మన దేశం బాగు పడదు.
సుందరం అదృష్టం బాగుందో లేక కొత్త సంవత్సరం కలిసొచ్చిందో కానీ మంగళం గారు వాళ్ళ కూతురి దగ్గరకు వెళ్తున్నాడు ఈ నెల అద్దె కూడా వొచ్ఛే నెల కలిపి తీసుకుంటా అని కబురు పంపించారు. అది విని నాకు సంతోషించాలో లేక వొచ్ఛే నెల రెంట్ రెండు కలిపి ఎలా కట్టాలో అర్ధం కాలేదు. ఇంతలో పాలవాడు వొచ్చి వాడి వాటా వాడు పట్టుకొని పోయాడు.
యిక ఈ వాచ్ మెన్ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కోవాలి అనుకొని అలా వీధిలోకి నడవటం మొదలు పెట్టాడు.అలా నడుస్తూ తన స్నేహితులు,బంధువులు యిప్పుడు ఏం చేస్తున్నారో ఎవరైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే బాగుండు అని  గుర్తుచేసుకుంటున్నాడు.అందులో కొంత మంది మంచి పొజిషన్ లో వున్నారు కానీ సుందరాన్ని గుర్తుపట్టే స్థితి లో వాళ్ళు లేరు.
ఇంతలో ఎలా వున్నావయ్యా సుందరం అంటూ  ఒక ముసలి వాడి గొంతు వినపడింది,అతన్ని గుర్తుపట్టటానికి నాకు ఎక్కువ సమయం కూడా పట్టలేదు
  ( నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో చిన్న ,చిన్న కథలు,కవితలు రాసే వాడిని అప్పట్లో అవి మా కాలేజ్ లో కొంచెం ప్రసిద్ధి కూడా చెందాయి కాని మా కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం అవి తనకు ఇస్తే తన పేరు మీద పబ్లిష్ చేయించుకొని నీకు కొన్ని డబ్బులు ఇస్తాను అని నా వెంట తిరిగేవాడు అతనికి నా కథలు ఇవ్వటానికి నా అహం ఒప్పుకోలేదు)
అని పాత రోజులని గుర్తుచేసుకుంటు ఆ జ్ఞాపకాల నుండి తేరుకొని హాఆ ఏం బాగులెండి సార్ అని తన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా వివరించాడు.
అది విన్న ఆ ముసలి వ్యక్తి నీకు అభ్యంతరం లేక పోతే పొతే అని నాన్చటం మొదలుపెట్టాడు.నేను ఏం అనుకోను చెప్పండి సార్ అన్నాడు సుందరం.
ఏమి లేదయ్య మా అబ్బాయి పేరు బాలు అతను ఫారెన్ వెళ్లి చాలా డబ్బు సంపాదించి ఈ మధ్యనే తిరిగి ఇండియా కి వొచ్చాడు వాడికి సినిమా లు అంటే పిచ్చి అందుకే ఒక మంచి కథ దొరికితే నిర్మాత గా ఉండి డైరెక్షన్ కూడా  చేద్దాం అనుకుంటున్నాడు నువ్వు ఒక మంచి స్టోరీ రాసి ఇస్తే దానికి డబ్బు , పేరు నీకు వొచ్ఛలా నేను చూసుకుంటాను ఏం అంటావు.
దానికి సుందరం ఆ రోజుల్లో ఆంటే అందరి దృష్టి నా మీదనే ఉండాలి అనే అత్యాశ తో రాసే వాడిని కానీ ఇప్పుడు రాయటం నా వల్ల కాదు సార్ ఇంట్లో పరిస్థితి కూడా బాగా లేదు.అందుకే నయ్యా సుందరం మీ ఇంట్లో పరిస్థితి బాగుపడాలి అన్నా, నీకు మంచి పేరు రావాలి అన్నా ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకో ( ఒక వేళ సక్సెస్ ఐతే రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది ) అని చెప్పి నా చేతిలో 10000/- పెట్టి యిది అడ్వాన్స్ మాత్రమే సినిమా పూర్తయ్యే వరకు ప్రతి నెలా పది వేలు నేను పంపిస్తాను అని చెప్పి వెళ్లి పోయాడు.
జీవితం లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం విజయం సాదించేది అని చెప్పాడు ఒక మహాకవి ఆ మాటలే అప్పుడు నాకు జ్ఞాపకం వొఛ్చాయి.
యింటికి చేరుకున్న తర్వాత సంతోషం తో ఇప్పటి నుండి సుందరం వాచ్ మెన్ కాదు త్వరలో రైటర్ సుందరం అని అందరికి తెలుస్తుంది అని జరిగినది సుశీల కి చెప్పాడు.
పెన్ను చేతపట్టు కొని కథ కోసం పుస్తకపు ద్వారాలు తెరిచాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మధ్య తరగతి వ్యక్తి వారి బాధలు గురించి రాస్తే బాగుంటుంది అనిపించి తన జీవితాన్ని ఆధారం గా చేసుకొని రాయటం మొదలు పెట్టాడు
     
              సుందరం ఫ్యామిలీ
                       ( ఒక సామాన్యుడి జీవితం)
2 నెలల్లో కథ పూర్తి చెయ్యటం బాలు కి అది బాగా నచ్చటం జరిగింది. మిగతా 10 నెలలు కష్టపడి ఆఖరికి కొత్త సంవత్సరం రోజున రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.
2003- నేను రైటర్ గా ఇవాళ స్క్రీన్ మీద  నా పేరు ఈ  లోకానికి పరిచయం కాబోతుంది ఈ సినిమా విజయం సాధిస్తే ఇక మనకు తిరుగు ఉండదు అని సుందరం,సుశీల మూవీ కి వెళ్లారు.అనుకున్నట్లుగానే సినిమా కి మంచి రెస్పాన్స్ వొచ్చింది  కానీ అక్కడ నా పేరు మాత్రం కనపడలేదు.
              కథ - మాటలు - దర్శకత్వం
                            బాలు
ఏంటి ఇది అని ప్రశ్నిస్తే మేము డబ్బులు పడేసి నీ టాలెంట్ ని కొనుక్కున్నాము.ఆఫ్ట్రాల్ వాచ్ మెన్ గాడివి,నువ్వు రైటర్ అవుతావు అని ఎలా అనుకున్నావురా
ఒక సంవత్సరం ఛాలా హాయిగా గడిచింది ఇక జీవితాంతం ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నాము కాను మున మధ్య తరగతి బ్రతుకులు ఎప్పటికి మారవు అని అర్ధం అయింది.
     
                                    రచన - కథ
                  
                                   రఘు చౌదరి
        

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts