Sunday 5 February 2017

ప్రేమ కథలు - 3


                                                             【6】

ఆ అమ్మాయి తనకు దక్కలేదు అన్న బాధతో ఎన్నో  నిద్రలేని రాత్రులు గడపటం వలన   ఎర్రబడిన కళ్ళు.ఉద్యోగంతో పాటుగా ఒక అలవాటుగా మారిన తాగుడు.
గొప్పవాడు అవుతాడు అనుకున్న కొడుకు తాగి తాగి ఏమవుతాడో అని బాధపడుతున్న రఘు తల్లిదండ్రులు ఒకవైపు ...

అమ్మాయి ప్రేమను ఎలాగైనా పొందాలి అన్న దృఢనిశ్చయంతో రిసెర్చ్ అనుకుంటూ తిండి తిప్పలు నిద్రాహారాలు మానేసిబుక్స్,బ్యాటరీస్,అమ్మీటర్లు,వైర్ల తో నిండి వున్న గదిలోకి వెళ్లి 4 నెలలు కావొస్తుంది.

తమ కొడుకు గొప్పవాడు కాకపోయినా పరవాలేదు కానీ రిసెర్చ్ పేరుతొ పిచ్చి వాడు మాత్రం కాకుండా ఉంటే 100 కొబ్బరికాయలు కొడతాం దేవుడా అని వేడుకునే నవీన్ తల్లిదండ్రులు యింకోవైపు.
     
                                                          【7】

కోపం,బాధ మిలినమైన కళ్ల మీద నుండి విలువైన కళ్లజోడును తీస్తూ చూపుడు వ్రేలితో రాని కన్నీటిని ఫార్మాలిటీకి తుడుస్తూ వొచ్చి సోపాలో కూలబడ్డాడు  బిందు తండ్రి - సుందరమూర్తి.
  తమ 25 సంవత్సరాల దాంపత్యంలో తన భర్తని ఎప్పుడూ అంత విచారంగా చూడని భార్య పార్వతి పరుగులాంటి నడకతో వొచ్చి ఈ రోజు సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి బిందు,అజయ్ ల నిశ్చితార్ధానికి మూహర్తం కుదుర్చుకుని వస్తా అన్నారు కదా..
ఏమైంది మరి అలా వున్నారు ??.
వాళ్ళు ఏం అన్నారు..?
     {  సుబ్రహ్మణ్యం గారు అజయ్ వాళ్ళ నాన్న }
వాళ్ళకి మినిస్టర్ గారి ఇంటి సంబంధం ఖాయం అయింది..మన బిందూని చేసుకోవటం కుదరదు అన్నారు.
 
ఏదో షాక్ తిన్న దానిలా అయింది పార్వతి ముఖం,మరి అజయ్ ఏం అన్నాడు ??

రాని నవ్వును అప్పు తెచుకున్నట్లు నవ్వి ...

మీరు, మీ అమ్మాయి ఏ విధంగా పేరు,ప్రఖ్యాతలు వున్న మాతో సంబంధం కుదుర్చుకోవాలనుకున్నారో , మేము కూడా అలానే మినిస్టర్ గారి సంబంధం కావాలనుకున్నాము. 

  ( త్వరలో సుబ్రహ్మణ్యం గారు మినిస్టర్ పదవి నుండి ముఖ్యమంత్రి పదవికి వెళ్తున్నారు అది ఒక కారణం ).
వీరి సంభాషణ అంతా చాటుగా వింటున్న బిందూకి అప్పుడు అర్ధం అయింది..ఫేమస్ పర్సన్స్ ని  కాదు పెళ్లి చేసుకునేది.. జీవితాంతం ప్రేమగా చూసుకునే పర్సన్ ని పెళ్లి చేసుకోవాల్సింది అని ..

అప్పుడు గుర్తొచ్చాడు నవీన్...!
వెంటనే కాల్ చేసింది నవీన్ కి..

హలో.. అటునుండి ఆడ గొంతు ..( నవీన్ వాళ్ళ అమ్మ )
హలో... ఆంటి నవీన్ లేడా..

ఎక్కడ నవీన్ అమ్మా.. ఎవరో అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం రీసెర్చ్ అని గదిలోకి వెళ్లి 4 నెలలు అవుతుంది..ఎప్పుడు తింటాడో తెలియదు,ఎప్పుడు పడుకుంటాడో తెలియదు.
అప్పుడు అర్థమైంది నవీన్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో బిందూకి.

4 నెలల తర్వాత అతని రిసెర్చ్ కంప్లీట్ అయింది..అతను తయారు చేసింది ఒక ఫోన్ బ్యాటరీ.. 3,300..4000 MAH బ్యాటరీలు రాజ్యమేలుతున్న సమయంలో..
14500 MAH తో వారం పాటు ఛార్జింగ్ వొచ్చేలా  బ్యాటరీ తయారు చేసాడు..
4 నెలల తర్వాత అప్పుడు వొచ్చాడు బయటకు..
మునికి,ఋషికి మధ్యలో వున్నాడు..నిస్తేజమైన అతని కళ్లు తప్ప అంత గడ్డంతో కలిసిపోయింది..జుట్టు మొత్తం పెరిగిపోయి రింగులు తిరిగింది.

మరుసటి రోజు..

సూర్యుడు ఉదయించి అప్పటికి గంట కావొస్తుంది..నవీన్ ముఖం లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనపడడుతుంది...ఎందుకంటే ఆ రోజే తను తయారు చేసిన బ్యాటరీని చెక్ చేసి తన తలరాతని నిర్ణయించటానికి సైంటిస్ట్ లు వస్తున్నారు. సక్సెస్ ఐతే మొత్తం అతని తలరాతే మారిపోతుంది..ఫెయిల్ అయితే 5 నెలల కాలంలో పాటు బిందు కూడా దూరమవుతుంది..ఏమయ్యేది ఇవాళ తేలిపోతుంది..
మొత్తం నెల రోజుల్లో 4 సార్లు చెక్ చేసి...వారం రోజులు గ్యారెంటీ అని తేల్చారు.
          *        *           *           *
 యువత ముందంజ..
.
ప్రపంచం లొనే కొత్త చరిత్ర సృష్టించిన 23 సంవత్సరాల యువకుడు..

ఎక్కడ చూసినా న్యూస్ పేపర్స్ లో ,న్యూస్ చానల్స్ లో యిదే వార్త..ఎక్కడ చూసినా నా ఫొటోనే..
బిందు చెప్పిన 5 నెలల గడువు నిన్నటితో పూర్తయిపోయింది..అనుకున్నట్లుగానే తాను చెప్పింది సాధించాడు...తన బ్యాటరీ కోసం మన దేశ కంపెనీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పోటీ పడుతున్నాయి.బిందు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతుంది..అనుకున్నాడు..
   ( నవీన్ కి తెలియని నిజం ఏమిటంటే బిందు నవీన్ ప్రేమలో ఎప్పుడో పడింది అని ).
వెంటనే బిందు ఇంటికి బయలుదేరాడు..హాల్ లో కూర్చొని వుంది బిందు..

సాధించాను...!
నువ్వు చెప్పినట్టుగానే నా కంటూ చరిత్రలో ఒక పేరు ,స్టేటస్ ఏర్పరుచుకున్నాను.
ఇక మన పెళ్లికి ఏ అభ్యoతరం లేదనుకుంటాను..?
ఏయ్ మిస్టర్ ఎవరు నువ్వు..? ఏం మాట్లాడుతున్నావ్..
నువ్వే వొచ్చావు.. సాధించా అంటున్నావు..పెళ్లి అంటున్నావు..
నిన్ను ఇప్పుడే 1st time చూస్తున్నాను..అంది..

అదేంటి బిందు అలా మాట్లాడుతావు..3 నెలల క్రితం..కాఫీ షాప్.. ( అతని మాట పూర్తికాకముందే )

సారీ నేను బిందూని కాదు ...బిందు సిస్టర్ ని నా పేరు హారికా మేము ఇద్దరం ట్విన్స్..
నేను ఖమ్మం లో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర వుంటారు 5 నెలల క్రితమే నేను ఇక్కడికి వొచ్చాను..
అప్పుడు గుర్తొచ్చాడు..రఘు అంటే అతడు వెతికేది హారిక కోసం అనుకుంటా..వెంటనే ఈ విషయం అతనికి తెలియచెయ్యాలి..సంపత్ కి కాల్ చేసి రఘు నెంబర్ తీసుకొని కాల్ చేసాడు..
        *         *          *           *          *
5 వ పెగ్ తాగి వొణుకుతున్న చేతులతో గ్లాస్ ని కిందపెట్టి..సిగిరెట్ వెలిగించుకోవటానికి రెడీ అవుతున్న రఘు ఫోన్ రింగ్ అయింది

హలో..!
హలో నేను నవీన్ ని బాస్..
హా ...గుర్తున్నావ్ చెప్పు..నిన్ను ఎలా మర్చిపోతాను..

జరిగింది మొత్తం పూస గుచినట్టు వివరించాడు..అంటే నువ్వు ATM దగ్గర చూసింది హారిక ని..నేను లవ్ చేసింది బిందూని..నువ్వు వెంటనే బయలుదేరు.. మిగతా విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అని అడ్రస్ చెప్పాడు..

గార్డెన్ లో వున్న బిందూ,సుందరమూర్తి అప్పుడే హాల్ లో కి అడుగుపెట్టారు.. హాల్ లో వున్న నవీన్ ని చూడగానే బిందు పెదవులు విచ్చుకున్నాయి..ఆమెతో పాటే ఆమె తండ్రివి కూడా..

బిందు..నవీన్ ని వాళ్ళ నాన్నకి పరిచయం చేద్దాం అని అనుకుంటూ .
డాడీ ఇతనిపెరు..

నవీన్ కదా అన్నాడు సుందరమూర్తి..రా బాబు నువ్వు తెలియక పోవటం ఏమిటి...ఇంత చిన్న వయసులో ఎంత ఘనత సాదించావు..కూర్చో బాబు..ఏంటి విషయం.

జరిగింది మొత్తం వివరించాడు...నవీన్.
సుందరమూర్తి కూడా వారి పెళ్ళికి ఒప్పుకున్నాడు..

కావాలనే అడిగాడు నవీన్ మరి మీ హారిక కు ఏం సంబంధాలు చూడటం లేదా...?
ఎందుకు చూడటం లేదు బాబు ..చూస్తున్నాము కానీ అది ఖమ్మం లో ఎదో ATM దగ్గర ఒక అబ్బాయిని చూసింది...పెళ్లంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటా అని పట్టుపట్టుకు కూర్చుంది..ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు..ఒక సంవత్సరం పాటు అతన్ని వెతికింది కూడా అతని ఆచూకీ దొరకలేదు..

అది విన్న నవీన్ పేస్ లో ఒక్క సారిగా బావాలు మారిపోయాయి..ఏం తెలుసుకోకుండా రఘు కి కాల్ చేసాను ఇప్పుడు అతను వొచ్చి ఏం మాట్లాడుతాడో ఏమో..

ఇంతలో రానే వొచ్చాడు రఘు...

ఎవరు బాబు నువ్వు..?

నా ఫ్రెండ్ అంకుల్..నేనె రమ్మన్నాను..అన్నాడు నవీన్..

హారిక అతని వైపే కన్నార్పకుండా చూస్తుంది..రఘు కూడా అంతే ....వెళ్లిదర్నీ చూస్తున్నాడు సుందరమూర్తి..ఏం జరుగుతుందో అనుకుంటూ వాళ్ళ పేస్ లని నవీన్ చూస్తున్నాడు.

ఏంటమ్మా..అలాచూస్తున్నావు...అడిగాడు సుందరమూర్తి హరికని..
నేను ఎటిఎం దగ్గర చూసాను అని చెప్పానే..అది ఇతన్నే నాన్న అంది..

రఘు కి ఏం అర్ధం కాలేదు,ఆమె ఏం చెప్పిందో..
తర్వాత చెప్పింది ..నేను మిమ్మల్ని ఎటిఎం దగ్గర చూసాను..చూడగానే నాచ్చేశారు..మీ కోసం సంవత్సరం వెతికాను కానీ మీ ఆచూకీ దొరకలేదు..నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడిగింది హారిక..
రఘు కళ్ళలో ఆనందం సముద్రాలై పొంగుతుంది..ఆ క్షణం లో అతని సంతోషాన్ని కొలవటానికి సముద్రం లోతు,భూమి వెడల్పు కూడా సరిపోవు..
ఎందుకు ఇష్టం ఉండదు...అతను నిన్ను ఎంతోకాలంగా లవ్ చేస్తున్నాడు. కల్పించుకున్నాడు నవీన్..
అతడు ఎంత ప్రేమించాడో..ఎంత వెతికాడో ఆ అమ్మాయికి చెప్పాడు..

  ( హారిక వెతుకుతున్నంత కాలం ట్రాన్స్ఫర్ కావటం వలన రఘు హైదరాబాద్ లో వున్నాడు పెళ్లికి 5 నెలల క్రితం వెళ్లి ఆ అమ్మాయిని రఘు వెతుకుతున్నప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ వొచ్చింది అందుకే వాళ్ళు కులుసుకోలేక పోయారు).

తమ కొడుకు ఆ మద్యం మత్తు నుండి బయట పడినందుకుదుకు రఘు తల్లిదండ్రులు, తన కొడుకు పిఛ్చివాడు కాకుండా గొప్పవాడు అయినందుకు నవీన్ తల్లిదండ్రులు ,తనకి మంచి అల్లుళ్ళ దొరకడంతో సుందరమూర్తి ఫ్యామిలీ అంతా ఆనందం గా వున్నారు..
         

                                                   -    శుభం  -
  
                                                                                                                రచన
                                                                                                          రఘు చౌదరి
         

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts