Wednesday 25 January 2017

ప్రేమ కథలు - 2

PART - 1 లో రఘు ఫ్రెండ్ సంపత్ కి బదులుగా అజయ్ అని తప్పుగా రాయటం జరిగింది.కావునా పాఠకులు గమనించగలరాని ప్రార్థన.

జరిగిన కథ : -

     ( ఎటిఎం దగ్గర అమ్మాయిని చూస్తాడు రఘు.ట్రాన్స్ఫర్ కావటం వలన కొత్త ప్లేస్ కి వెళతాడు.పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూడటం వల్ల ఎటిఎం దగ్గర చుసిన అమ్మాయిని కలిసి పెళ్లి కి ఒప్పించి తీసుకు రావటానికి వెళదాం అనుకుంటాడు.

   బర్త్ డే పార్టీ లో బిందు ని చూసి మనసు పారేసుకుంటాడు నవీన్...నవీన్ ఫ్రెండ్ కీర్తన ఆ అమ్మాయిని పరిచయం చేస్తుంది.అప్పుడు నవీన్ కి bye చెప్పి అజయ్ తో వెళ్ళిపోతుంది బిందు ).

                           ( 4 )

అమ్మాయిలను చూడగానే అలవాటుగా నేలను చూసే నీ కళ్ళు ఆ అమ్మాయి వెళ్ళిపోయినా తర్వాత కూడా అటువైపే చూస్తున్నాయి ఏంటి విషయం అంది కీర్తన.

నవీన్ : - చూడగానే నచ్చేసింది...చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది...ఆ అమ్మాయిలో ఏదో  తెలియని ఆకర్షణ నన్ను ఆమె వైపు లాగేసింది.

కీర్తన : - అమ్మాయిని చూడగానే కవిత్వం వస్తుంది లవ్ చేస్తున్నావా ఏంటి ?

నవీన్ : - ఏమో తెలియదు ..? ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలి..?

కీర్తన : - 8686482562.

నవీన్ : - ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటా..

కీర్తన :- ఎంత నచ్చిన అమ్మాయిది ఐతే మాత్రం ఫ్యాన్సీ నెంబర్ కి..పనికి రాని నెంబర్ కి కూడా తేడా తెలియదా.

NEXT DAY

10 వ సారి ఫోన్ చెయ్యటం అది రింగ్ అవ్వకముందే కట్ చెయ్యటం..చేతులు వొణుకుతున్నాయి..తల నుండి చెంపల మీదకు చెమటలు కారుతున్నాయి.భయం వల్లనో,టెన్షన్ వల్లనో తెలియదు ..మొదటి సారి తెలియని అమ్మాయితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ క్షణం అర్ధం అయింది.

  11th టైం

     భయాన్ని మొత్తం బలంగా వెనక్కి నెట్టి,ధైర్యాన్ని మొత్తం చేతిలోకి తీసుకొని కాల్ చేశా.

   డూప్లెక్స్ హౌస్..అద్భుతమైన వాస్తు ..రిచ్ ఫర్నిచర్...అదే ఇంట్లో యింకా నిద్ర లేవకుండా ముసుగు తన్ని పడుకున్న అమ్మాయి బెడ్ మీద పడివున్న i phone రింగ్ అయింది.

   హలో..అంది బిందు మత్తుగా.

అది నిద్ర మత్తు కావొచ్చు,లేక రాత్రి మందు తాలూకు హ్యాంగౌర్ కావొచ్చు.నా పేరు నవీన్ నిన్న బర్త్ డే పార్టీ లో కీర్తన పరిచయం చేసింది కదా..

  Yeah.. tell me..

నవీన్ : - మిమ్మల్ని ఒక సారి కలవాలి.
బిందు :- ఎందుకు.......?

నవీన్ : - మీతో కొంచెం మాట్లాడాలి.
బిందు : - OK
నవీన్ : - evng 6 p. m  star bucks కాఫీ షాప్..
బిందు : - ok

  వెలుతురును యిచ్చి, యిచ్చి అస్తమించటానికి  సూర్యుడు...చీకటిని పెంచటానికి చంద్రుడు రెడీగా వున్నాడు...ఆ గ్యాప్ లో 12,13 టేబుల్స్ మీద ఎదురెదురుగా కూర్చొని వున్నారు నవీన్,బిందు.

వైటెర్ వొచ్చి వైట్ చేస్తున్నాడు ఆర్డర్ కోసం..దానితో పాటు వొచ్చే టిప్ కోసం..మెనూ ఓపెన్ చేస్తే ...

  ESPRESSO
  CAPUCINO
  MOCHA
  MACCIATO
  GLASSE....

అసలు నోరు కూడా తిరగని కాఫీ పేర్లు...ఆకాశాన్ని అంటే ప్రైస్ లు..అసలు వాటి పేర్లు కూడా ఎప్పుడు వినలేదు..కాఫీ అంటే మా మహాలక్ష్మి టీ ప్లాజా కి వెళ్లి కాఫీ అంటే చాలు..పొగలు కక్కుతూ గుమగుమలాడే కాఫీ... కేవలం 10 /- కె.
ఎలాగైనా బయటపడాలి అని ...లేడీస్ 1st..అని తప్పించుకున్నాను.

      1 mocha...
     
       నాకు కూడా అదే తీసుకురండి.

నవీన్ : - మెడిపండు లాగా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒక లాగా మాట్లాడటం నాకు తెలియదు ..నిన్న పార్టీ లో మిమ్మల్ని చూడగానే నాచ్చేశారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.

బిందు : - your a handsome..  మీరు అంటే ఎవరైనా ఇష్టపడుతారు. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కుదరదు. నేను ఎవరైనా ఫేమస్ పర్సన్స్ నే పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాను.

నవీన్ : - అంటే ....?

బిందు : -  i mean..
హీరో కి భార్య గానో లేక క్రికెటర్ కి భార్యగానో ఉంటే వాళ్ళ వలన మనం కూడా ఫేమస్ అవుతాము.అంతే కాని నిన్ను పెళ్లి చేసుకుంటే...అందరి లాగానే ఈ రోజు విధంగానే రేపు రొటీన్ గా ఉంటుంది ,అది నాకు ఇష్టం లేదు. నేనంటే కనీసం కొందరికైనా తెలియాలి అనేది నా ఆశ.

నవీన్ : -  మనసులో ... ( అమ్మాయిలు అంటే ఏ చైనో,లేక ప్రేమగా చూసుకునే భర్త నో  కావాలనుకుంటారు..కానీ ఫేమస్ పర్సన్స్ ని పెళ్లి చేసుకోవాలి అనటం ఏమిటో.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అమ్మాయిల టెక్నికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది ).

నవీన్ :- నేను కూడా ఫేమస్ పర్సన్ నే ..నేను చేసే రీసెర్చ్ సక్సెస్ ఐతే మన దేశం లోనే కాదు ఈ వరల్డ్ లొనే ఫేమస్ అవుతా.

బిందు : -  సరే అయితే..ఇంకో 5 నెలల్లో మా పేరెంట్స్ అజయ్ తో నాకు ఎంగేజ్ మెంట్ చేద్దాం అనుకుంటున్నారు . (అజయ్ ..ఇండియా క్రికెట్ టీం కి సెలెక్ట్ అయ్యాడు).నువ్వు రిసెర్చ్ అంటున్నావు కాబట్టి ఈ 5 నెలలు నేను వెయిట్ చేస్తాను.ఈ లోపులో నువ్వు గొప్పవాడివి ఐతే సరి లేక పొతే అజయ్ ని పెళ్లి చేసుకుంటా.
       ఇదిగో మా ఇంటి అడ్రస్ నువ్వు ఫేమస్ అయిన రోజు మా ఇంటికి వొచ్చి మాట్లాడు .

        Bye

         *       *        *          *          *

                           ( 5 )

అంటే సంవత్సరం క్రింద ఒక అమ్మాయిని చూశావు.. లవ్ చేస్తున్నావు..కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు..ఇప్పుడు ఆ అమ్మాయిని వెతకాలి అంటున్నావు,ఇదంతా జరిగే పనేనా అన్నాడు సంపత్.
            జరిగి తీరాలి ఈ 3 రోజుల్లో ఆ అమ్మాయిని వెతికి నా ప్రేమ విషయం తెలియచేసి,పెళ్ళికి ఒప్పించాలి.నువ్వు పెళ్లి పనుల్లో బిజీగా వుంటావ్ కాదా అందుకే సురేష్ గాడు నేను ఆ అమ్మాయిని వేతకటానికి వెళుతున్నాము.మళ్ళీ పెళ్లి రోజు వస్తాను..అన్నాడు రఘు.

1

2

3

కాలం మాత్రం చిరుత కంటే వేగంగా పరుగులు తీస్తుంది.
    కళ్ళు DSLR కెమెరా కంటే ఎక్కువగా స్కాన్ చేస్తున్నాయి.. శరీరం అంతటా అలసట,నీరసం ఆవహించాయి..కాలేజ్ లు,బస్సు లు,బస్ స్టాప్ లు అన్ని వెతికి వెతికి విసిగి పోయాము తప్ప ఆ అమ్మాయి ఆచూకీ మాత్రం దొరకలేదు.కానీ అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి.
        
Sat 

పెళ్లి టైం కి మండపానికి చేరుకునే సరికి..ఇసుక వేస్తె రాలనంత మంది జనం, పట్టు చీరెలు,పరికినులు,సల్వార్ లతో నిండిన ముద్దు గుమ్మలు,సూట్లు..జీన్స్ లతో నీటుగా రెడీ అయిన అబ్బాయిలు.వరుడు వధువుతో కళకళలాడుతున్న
కళ్యాణ మండపం..పక్కనే పల్లకిలో పెళ్లికూతురు రాణిలా వుంది..అంటూ మొదలు పెట్టిన బ్యాండ్ గ్రూప్ లో సింగర్...
       తిరిగి తిరిగి పీక్కు పోయిన నా ముఖం.

ఇంతలో ఏమైంది ఆ అమ్మాయి దొరికిందా అంటూ సంపత్.

రఘు : - దొరికితే నేను ఇలా ఎందుకు వుంటాను.

సంపత్ : - సరే మళ్లీ ట్రై చేద్దాం రా మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా..

వీళ్ళు తెలుసు నీకు అంతా మన 10 th batch..

ఇక వీళ్ళు నా ఇంటర్ ఫ్రెండ్స్..

వీడు మధు ...హలో

వీడు నవీన్...హలో

ఈ హడావిడిలో అమ్మ దగ్గర నుండి కాల్.. లిఫ్ట్ చేసానో లేదో బ్యాటరీ డెడ్..నీ ఫోన్ ఇవ్వు సంపత్.

నా ఫోన్ అన్నయ్య దగ్గర వుంది ..

బాస్ నా ఫోన్ తీసుకో అన్నాడు నవీన్..

లాక్ ఓపెన్ చేయగానే wallpaper మీద నా మహాలక్ష్మి ఫోటో.
సంతోషం తో మాటలు రావటం లేదు..ఎవరు ఈ అమ్మాయి..ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు చెప్పు ,చెప్పు..అన్నాడు రఘు.

నవీన్ :- నా గర్ల్ ఫ్రెండ్ బిందు..

సంతోషం పోయి ఆవరించుకున్న దుఃఖం..ఏడుపు ఆపుకోవటం వలన అప్రయత్నంగా వొణుకుతున్న పెదవులు..షాక్ తగిలినట్టుగా తయారైన 6 అడుగుల బాడీ.రఘు కంటి నుండి నీరు బయటకు వస్తున్నాయి ఆ నీటిలోని వేడి అతని ప్రేమను తెలియచేస్తుంది.

ఏమైంది అలా అయ్యావు అని అడిగాడు నవీన్.
జరిగింది మొత్తం చెప్పాడు సంపత్..పక్కనే వున్న సంపత్.

నవీన్ : -కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చెయ్యటం లేదు ..

మళ్ళి సంతోషం ..

అజయ్ అని వేరే వ్యక్తి తో ఆ అమ్మాయికి ఇంకో 5 నెలల్లో ఎంగేజ్మెంట్.

*            *            *             *            *

( ఏమైంది...ఆ బిందు ఎవరికి దక్కింది.. అజయ్ కా,నవీన్ కా,లేక రఘు కా,)

ప్రేమ కథలు - 3 feb 7 వ తేదీన సాయంత్రం 6 కి అందుబాటులో ఉంటుంది.

   
                                       రచన

                                  రఘు చౌదరి
  

Saturday 14 January 2017

ప్రేమ కథలు -1

పాఠకులకు విజ్ఞప్తి..ఈ బ్లాగ్ లో రెండు ప్రేమ కథలు parallel గా నడుస్తూ వుంటాయి అందువల్ల 3 parts గా విడుదల చేస్తున్నాను.కావున పాఠకులందరు ఎప్పటిలాగే ఈ బ్లాగ్ ని కూడా  ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను.

ప్రే- ప్రేమ అంటే కష్ట సుకాల సమ్మేళనేమే కాదు మనసు టూ ది పవరాఫ్ మనసు మధ్య జరిగే ఒక రసాయన చర్య.



                             ( 1 )

2012 :- చల్లని గాలి, నీలిరంగు ఆకాశంలో ఎర్రగా మండుతున్న సూర్యుడు ఎందుకో తెలియదు గాని  ఆ రోజు ATM దగ్గర కొంచెం జనసంచారం ఎక్కువగానే వుంది. DEMONITIZATION యింకా స్టార్ట్ కాకపోవటం వలన అందరు డీసెంట్ గానే లైన్ మెయింటైన్ చేస్తున్నారు.
ఏటీఎం దగ్గరకు వొచ్చి 5 నిముషాలు అయిన కాలేదు కానీ కొన్ని గంటలు వెయిట్ చేసిన ఫీలింగ్. సరిగ్గా ఆ సమయంలో  నా చూపు ముందు వరుసలో ఉన్న అమ్మాయి మీద పడింది.
  తల నుండి పిరుదుల వరకూ వొయ్యారంగా ఊగుతున్న వొతైనా జడ, డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా same కలర్ ఇయర్ రింగ్స్,బ్యాంగిల్స్,పెద్ద కలర్ కూడా కాదు కాని అప్పుడే పాలసముద్రం నుండి బయటకు వొచ్చిన దేవతలా వుంది.
     పేరు తెలియదు కాని ఆమెని చూస్తే మాత్రం మహాలక్ష్మి అన్న పేరు మాత్రం కరెక్ట్ గా సూట్ అవుతుంది.అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టు అయస్కాంతం లాంటి ఆ అమ్మాయి చూపులు ఇనుము లాంటి నా మనసును ఆకర్షించాయి.అప్పటి వరకు అమ్మాయిలు అంటే ఆమెడ దూరం లో వుండే నేను ఆ క్షణం నుండి ఆ అమ్మాయి లేకుండా వుండలేనేమో అనిపించింది.
SSC లో హారిక,ఇంటర్ లో సారిక వాళ్ళు నా లావ్ ని కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేసినా కనీసం నాకు చీమ కుట్టినట్టు అయినా అనిపించలేదు కానీ ఈ మహాలక్ష్మి దూరం చేసుకుంటే మాత్రం ( A సర్టిఫికెట్ మూవీ లో B గ్రేడ్ సీన్స్ మిస్ అయితే ఎంత బాధపడుతామో) చాలా  బాధ పడుతాను అనిపించింది.అందుకే ప్రపోజ్ చెయ్యటం మానేసి ఎవ్వరె నువ్వు నను కదిపావు అంటూ డ్యుయట్ లోకి వెళ్ళాను.
పక్కనే వున్న చర్చిలో వున్న గడియారం 2 గంటలు కొట్టడంతో ఆ చప్పుడికి తిరిగి యీ లోకానికి వొచ్చే సరికి ఆ అమ్మాయి ATM లోపలకి వెళ్ళటం డబ్బుతో బయటకు వెళ్ళటం కూడా జరిగిపోయాయి.మా నాన్న కి ట్రాన్సఫర్ కావటం అదే సమయానికి నా ఇంజనీరింగ్ కంప్లీట్ కావటంతో ఆ అమ్మాయి గురించి వేతకటం మానేసి కొత్తగా వెళ్లిన సిటీలో జాబ్ రూట్ కోసం వేతకటం మొదలు పెట్టాను.
   ఇంతకు చెప్పటం మరిచాను నా పేరు రఘు.
   *       *      *       *        *        *        *        *
                              ( 2 )
తెలుసుకదా రేపు  నా BIRTHDAY  మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నువ్వు రావాలి నవీన్, అంది కీర్తన ముక్తకంటంగా.
డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక దానికి   బర్త్ డే, బ్యాచలర్ పార్టీ అని ఏవేవో పేర్లు పెట్టి (ఎంతమందో పేద ప్రజలు ఆ డబ్బు లేకనే సూసైడ్ లు చేసుకుంటున్నారు) డబ్బు ని   నాశనం చేస్తుంటారు.అలాంటి పార్టీలు నాకు ఇష్టం వుండవు అని నీకు తెలుసు కదా.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు రాకపోతే నేను పార్టీ కూడా జరుపుకొను అంది కీర్తన.
       ( కీర్తన,నవీన్ చిన్నతనం నుండి మంచి స్నేహితులు )
నవీన్ : - సరే వస్తాను ఎన్ని గంటలకి ?
కీర్తన : - సాయంత్రం 6 గంటలకు
లోపల నుండి వొచ్చే శబ్దానికి గుండె ఆగిపోతుందా అనేలా ఏర్పాటు చేయబడిన సౌండ్ ఎఫెక్ట్.
జిమ్,రమ్, విస్కీ,బీర్, బ్రాందీ,వోడ్కా లతో నిండిన పెద్ద విశాలమైన హాలు,ఆ విశాలమైన హాలు మధ్యలో చిన్న కేకు,ఆ కేకు మీద ఆ అమ్మాయి వయసును అందరికి తెలియచెప్పేలా వున్న 22 క్యాండిల్ ఆ పార్టీ జరుగుతున్న గది వేరే లోకాన్ని తలపిస్తుంది.
సరిగ్గా కేకు కట్ చేసిన గంట తర్వాత మగవాళ్లు తాగి  తూలుతున్నారు వాళ్లకు మేము తక్కువేమీ కాదంటున్న అమ్మాయిలు కూడా అదే మత్తులో వున్నారు.
అప్పుడు ఒంటరిగా వాళ్ళు ఎలా చెడిపోతున్నారో చూస్తూ కూర్చున్న నా పక్కకు వొచ్చింది కీర్తన..
ఈమె నా ఫ్రెండ్ సౌమ్య అని పరిచయం చేసింది
హలో....!
కీర్తన :- ఈమె స్వాతి....
నేను  : - హలో 
ఇలా అందరిని పరిచయం చెయ్యటం నేను వారికి హలో చెప్పటం ఒక ఆర్డర్ లో జరుగుతూ పోతుంది సరిగ్గా ఆ సమయంలో....
 ఈమె బిందు
 హ.. హ.... హలో
ఒక్కసారిగా స్పాట్ లైట్ తన మీద పడటంతో ఆ వెలుతూరులో నల్లని కలవలు లాంటి కళ్ళు..ఎరుపు రంగు లిప్ స్టిక్ తో నిండి వున్న లేత పెదవులు,చెయ్యి వేస్తె కంది పోతాయా అనేలా వున్న సొట్టబుగ్గలు, 36 - 26 -36 ఫర్ పెక్ట్ స్ట్రక్చర్... మంచి చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన శిల్పంలా వుంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి మెడలో డైమండ్ షేప్ లో వున్న నెక్లస్ ని చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయిది కొన్ని కోట్లకు పడగలెత్తిన కుటుంబం అని.
హాయ్ అజయ్ అంటూ అంటూ 6 అడుగుల వ్యక్తితో వెళ్ళిపోయింది.వెళుతూ,వెళుతూ,నా మనసును కూడా తీసుకెళ్లింది.
     *         *         *         *         *          *
                            ( 3 )
హలో..మిస్టర్ రఘు కంగ్రాట్స్
You got selected for tech mahindra...
Next monday నుండి మీరు ఆఫీస్ కి రావొచ్చు.
హమ్మ.. నీకు జాబ్ కూడా వొచ్చింది,నీ కాళ్ళ మీద నువ్వు నిలుచోగలవు అని నిరూపించుకున్నావు ఇక నీ పెళ్లి చేసి కోడలు,మనవడు,మనవరాళ్లతో హాయిగా మా శేష జీవితం గడపాలి అంటుంది అమ్మ.
పెళ్లి ..పెళ్లి అనగానే గుర్తొచ్చిన మొదటి వ్యక్తి ATM దగ్గర చుసిన అమ్మాయి.చూసి సంవత్సరం అవుతుంది అయినా అచ్చు వేసినట్టు అలాగే ఉంది ఆ అమ్మాయి రూపం నా మనసులో.
ఒక వేళ ప్రేమిస్తున్నానా...!
ప్రేమిస్తే ఒక వేళ ఆ అమ్మాయిని కలవటం ఎలా ?
ఒక వేళ పెళ్లి అయ్యి ఉంటే..
నాలో నేనే ఏవో చేడు ఆలోచనలతో ఒంటరిగా వున్నా.
           ( ఒంటరిగా వున్నప్పుడు మన మెదడులో మెరిసే ప్రశ్నలకు గూగుల్ లో కూడా సమాధానాలు దొరకటం కష్టం )
           ఇలాంటి  చెడు ఆలోచనల నుండి బయటకు తీసుకొచ్చింది అజయ్ గాడు చేసిన ఫోన్.
అజయ్ : - ఎంత ట్రాన్సఫర్ అయ్యి కొత్త ప్లేస్ కి వెళితే మాత్రం పాత స్నేహితులను మరిచిపోతావా ఏంటి అసలు కాల్ లేదు,మెసేజ్ లేదు.
నేను :- అలాంటిది ఏం లేదురా...! ఎదో జాబ్ టెన్షన్ లో వుండి....కుదరటం లేదు.
  అజయ్ : - మా సిస్టర్ నందిని మ్యారేజ్ ఫిక్స్ అయింది..ఈ శనివారం రాత్రి.మన ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు.నువ్వు మాత్రం రేపు ఉదయమే బయలుదేరి రావాలి.
నేను : - అది కాదురా ....హలో ..హలో.. ఫోన్ కట్ చేసాడు .
పెళ్ళికి యింకా 3 రోజులు వ్యవధి వుంది. ఈ గ్యాప్ లో ఎలాగైనా నా మహాలక్ష్మి ఆచూకీ వెతికి పట్టుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లో ను ఈ సారి నా మహాలక్ష్మి ని మిస్ చేసుకోకూడదు.
ఇక రేపే నా ప్రయాణం..
                                   
    ( part - 2 -- jan 26  6.00 pm )                                  

                                        రచన
                                     రఘు చౌదరి
 

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts