Saturday 16 July 2016

STOP సూసైడ్ 🔫




ఆ రోజు చాలా దారుణంగా గడిచింది నా జీవితంలో..నా బర్త్ డే రోజునైన మర్చిపోతానేమో కాని ఆ రోజును మాత్రం మరవలేను..
Feb 14 :- దేశం మొత్తం వాలెంటైన్స్  డే ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..అందులో కొంతమంది కి తీపి జ్ఞాపకాలు మిగిలితే మరి కొంత మందిి చేదు జ్ఞాపకాలతో సరిపెట్టుకుంటారు..
కాని నాకు మిగిలింది మాత్రం కవి కూడా తన మాటలతో వర్ణించలేని ఒక విషాదం..
అమ్మాయి బాగుంటే కాంపిటీషన్ వుంటుంది అని వినటమే కానీ ఆ రోజు ప్రత్యక్షంగా చూసే అంత వరకు తెలియదు..
నా పేరు మధు
       మొదటి సారి ఒక అమ్మాయికి ప్రపోస్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను..కాని ఎలా చెయ్యలి..పక్కనే లవ్ లో అనుభవం వున్న నా స్నేహితుడు సలహా మేరకు గ్రీటింగ్ కార్డ్ తో   నా ప్రేమను తెలియపరచాలనుకున్నాను..
6 షాపులు తిరిగి 600 ఖర్చు పెట్టి ఆత్రుతగా నా చలి దగ్గరకు బయలుదేరాను.
   ఆమె రాక కొసం నా రెండు కళ్ళతో పాటు నా గ్రీటింగ్ కూడా వేచిచూస్తుంది ..
ఆ రోజు అందానికే ఆధార్ కార్డ్ లా వుంది తను
     తన పేరు సౌమ్య..
   వొచ్చి రాగానే తన చెలి కత్తెలతో మాటలు  మొదలుపెట్టింది..నేను నెమ్మదిగా అడుగులు వేస్తు నా చిన్ని మనసును ఆమె చిట్టి మనసుతో కలపటా నికి బయలుదేరాను..రాకెట్ వేగంతో మా సీనియర్ రాకేష్ రావటం నా ముందే ప్రపోస్ చెయ్యటం అంత క్షణాల్లో జరిగిపోయింది..ఆ షాక్ నుండి బయటపడేలోపె వాళ్ళ క్లాస్  అఖిల్ రావటం ప్రపోస్ చెయ్యటం జరిగింది..
నాకు మరాటి మూవీని సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్లు వుంది..
  ఆ సమయంలో నేను వున్న పరిస్థితిని మీ ఊహకే వోదిలేస్తున్నాను..వెంటనే అక్కడ నుండి నిరాశతో కంటి నుండి కారుతున్న నీళ్ళతో  వెనుదిరిగాను...లవ్ లో ఫైల్ ఐన వాళ్ళు బాధపడుతుంటే అది చూసి నేను తెగ సంబర పడే  వాడిని.. కాని నాకు ఈ రోజు జరిగిన దానికి అసలు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్ధం కావటం లేదు.
మరస టి రోజు నీ లవర్ కి వేరే వాళ్ళు ప్రపోస్ చేసారు అని మా స్నేహితుల వెక్కిరింతలతో నా డే స్టార్ట్ అయింది..కాని ప్రపోస్ చేసిన వారిరువురికి  ఆ అమ్మాయి  నో  చెప్పింది అని తెలిసి సంతోషం సముద్రంలా పొంగింది. ఇక ఎలా అయిన ఆ అమ్మాయికి దగ్గర కావాలని ఆమె స్నేహితురాల్ల సహయంతో ఆమెతో స్నేహం మొదలు పెట్టా,ఎందుకంటే ప్రేమకు స్నేహం తొలిమెట్టు..
అలా రోజులు  చిరుతలా చక చక పరిగెడుతున్నాయి, మా b tech కంప్లీట్ కావటానికి యింకా నెల రోజులు మాత్రమే మిగిలివుంది..తన బర్త్ డే రోజున నా లవ్ విషయం ఆమెకు తెలిపాను తాను  4 నెలలు టైం తీసుకొని నెమ్మదిగా  ఒప్పుకుంది..తర్వాత చాటింగ్ లు  ,మీటింగ్  లు ,సినిమాలు  కళలాగా     1 year  కరిగిపోయింది.
ఒక రోజు త్వరగా జాబ్ చూసుకో మా ఇంట్లో నాకు పెండ్లి సంబందాలు చూస్తున్నారు అని షాక్ యిచ్చి  వెళ్ళిపోయింది..నేను చాల ప్రయత్నాలు చేస్తున్నాను, కాని జాబ్ తెచ్చుకోవడం నాకు ఒక తలనొప్పిలా  మారింది.
  
   ఒక రోజు ఫోన్ చేసి చాల రోజుల నుండి నీకు జాబ్ వెతుక్కోమని చెప్పకనే చెప్పాను, కానీ నీకు జాబ్ రాలేదు.నాకు సంభంధo కుదిరింది అబ్బాయి కి సాఫ్టువేర్ జాబ్  నెలకు 1లాక్ పేకేజ్..
      మరి నా గురించి ఏం ఆలోచించావ్..?
  Sorry..అంటూ ఫోన్ కట్  చేస్తూ నా లవ్ కు  బ్రేక్ వేసింది..   
ఏం చెయ్యాలో తెలియని పరిస్తితి సూసైడ్ కూడా చేసుకుందాం అనిపించింది మా parents గుర్తొచ్చి ఆగిపోయా ..నా జీవితం లో యిదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది..100 కి 90% లవ్ లో  ఫైల్ అయ్యి చనిపోయిన వారే ఎక్కువ వున్నారు..అందుకే లవ్ లో ఫైల్ ఐన వాళ్ళ కొసం 
LOVE FAILURE - ( read for only love failures ) అని ఒక బుక్ ను రాసా ఆ బుక్ నాకు ఎంతో పేరును తెచ్చి పెట్టింది దానితో  ఒక రాచయితగా జీవితాన్ని మరలా స్టార్ట్ చేసా..
అమ్మాయిల మనసు తెలుసుకోవటం కంటే ఆకాశం లోని చుక్కలని లెక్కపెట్టడం చాల సులువు..
ఖచ్చితంగా పెండ్లి చేసుకుంటా అనుకుంటే మాత్రమే లవ్ చెయ్యండి లేక పోతే మానండి.. అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన..లవ్ పేరుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు..
సూసైడ్ చేసుకునే ముందు ప్రేమించిన అమ్మాయి గురించే కాకుండా మిమ్మల్ని పెంచి పెద్ద వాళ్ళని చేసిన మీ తల్లి,తండ్రుల గురించి ఒక సారి ఆలోచించoడి..
Please stop suicides..
                 
                                       రచన
                                  -------- -------
                                   రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts