Friday 27 May 2016

K V ( కార్తీకుని వీరత్వము )

                         ( 1 )

రాజు గారి కాళ్ళ దగ్గర సేవకులుగా పనిచేసే మనం,రాజు గారి తర్వాత ఆ రాజ్యపు పగ్గాలు చేపట్టే అతని కూతురు సుకన్యాదేవితో ప్రేమ,పెండ్లి అని..,కలలో కూడ జరగని విషయాలను తలచుకొని మన ప్రాణాల మీదకు తెచ్చుకోవటం ఎందుకు అని కార్తికేయతో చావుకి దగ్గరగా వున్న తన తండ్రి శివయ్య అంటున్న మాటలు..
                
             కార్తికేయ..!  పేరుకి ఆ రాజ్యపు సేవకుడే కాని యుద్దపు విధ్యల్లో కాని,ఆలోచనలో కాని అతనికి ఆ రాజ్యంలో సరిపోయే వాడే లేడు..అందుకేనేమో యువరాణి చూపులు  కార్తికేయ మీద పడ్డాయి..
     
    
       సుకన్యా దేవి....చంద్రబింబం లాంటి ముఖంతో,జలపాతం లాంటి నల్లని కురులతో,ఎంతటి వారినైన తన అందంతో ముగ్దుల్ని చేయగల రూపం తనది..

              
           * * * * * * * * * * * * *

                           ( 2 )

తండ్రి మరణించటంతో చిన్న వయసులోనే కుంతి రాజ్యపు భారము మొత్తం తన కుమారుడు భరతుడు మీద పడింది..
   
భరతుడు.. శత్రువుని చండాడే ధీరుడు, అన్ని యుధ్ధపు విధ్యలో  ఆరితేరిన వీరుడు..కాని రాజ్యాన్ని కాపాడుకోవటానికి వీరత్వము ఒక్కటే వుంటే సరిపోదు..రాజ్యాన్ని పరిపాలించే విధానం,రాజ్యాన్ని ఎలా సుస్థిరం చేయాలి అనే అనుభవం,తప్పు చేస్తే రాజ్యములో విధించే శిక్షలు గురించి భరతుడికి తెలియదు..

ఇలాంటి రాజ్యపు విషయాల గురించి తెలియక పోవటంవల్ల,కొత్త రాజు రాజ్యాన్ని స్వీకరించాడు అని తెలిసి చుట్ట ప్రక్కల వున్న రాజ్యాలు అన్ని కుంతి రాజ్యాన్ని  వశం చేసుకోటానికి పన్నాగాలు మొదలుపెట్టాయి.

      ఈ విషయం తెలిసిన భరతుడు చింతించసాగాడు...అప్పుడు తన ఆస్థాన మహర్షి హిమాలయాలలో వున్న తాలపత్రాల గురించి తెలియచేసాడు..

       హిమాలయాలలో వున్న  తాలపత్ర గ్రంధాలలో రాజ్యా పాలన,యుద్దానికి కావలసిన శిక్షణ విద్యలు,రాజ్యములో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు చాల క్లుప్తంగా వసిష్ఠుడు అనే మహర్షి వివరించాడు..

              * * * * * * * * * * * *

                            ( 3 )

కార్తికేయ,సుకన్యా దేవి చూపులు చూపులు కలిసి   అది ప్రేమగా మారింది..తన రాజ్యపు గూడాచారుల ద్వారా వారి ప్రేమ విషయం తెలుసుకున్న రాజు ,కార్తికేయ ను చరసాలలొ బంధించి చిత్ర హిమ్సలు పెట్టసాగాడు..
   యువరాణి ప్రేమ విషయం రాజ్యంలో తెలియక ముందే ఆమెకు వివాహం చేద్దామని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా స్వయంవరం ప్రకటించాడు..యువరాణి అంద చందాల గురించి చుట్టుప్రక్కల అందరికీ తెలుసు కనుక యువరాణిని తమ రాణీగా చేసుకోవటానికి అనేక రాజ్యాల నుండి రాజులు విచ్చేశారు..

    స్వయంవరంలో ఏదో విల్లునో విరవమంటారు..ఒక కాయో,పండునో కొంచెం దూరం లో పెట్టి గురిచూసి కొట్టమంటారు అనుకున్నారు అక్కడ వున్న వారందరు..కాని అక్కడ రాజుగారు చెప్పినది విని అక్కడ స్వయంవరానికి వొచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు..
                   
                * * * * * * * * * * *
                            ( 4 )

అది చాల ప్రమాదకరమైన చోటు ఇప్పటి వరకు అనేక మంది రాజులు అక్కడకు వెళ్ళిన వారే కానీ వెనక్కి తిరిగివొచ్చిన వారే లేదు..యింక చెప్పాలంటే అక్కడకు వెళ్ళాలంటే ప్రాణాల మీద తీపి వోదిలేసుకొనే వెళ్ళాలి..

నా రాజ్యం కోసం ఆకరికి నా ప్రాణాలు ఐన వోదిలేయటానికి సిద్దమే అని బయలుదేరాడు భరతుడు..తమ రాజ్యం నుండి రెండు సంవత్సరాల పాటు కష్టపడి హిమలయాలను చేరుకున్నాడు..హిమాలయాలకు ఉత్తర భాగంగా ప్రవహించే చిన్న నది పక్కన ఒక స్వరంగ మార్గం లోపల ఆ తాలపత్ర గ్రంధాలు భద్రపరచి వున్నాయి..
                   కానీ ఆ స్వరంగ మార్గానికి, మనుషుల ప్రాణాలను ఎంతో సులభంగా తీయగల క్రూర జంతువులను వసిష్ఠుడు కాపలాగా పెట్టాడు..వాటిని చూడగానే బహుశ యిక్కడకు వొచ్చిన వారు తిరిగిరావటానికి కారణం ఈ జంతువులె అని భరతుడు మనసులో అనుకున్నాడు...
        రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన ముందు,ఈ క్రూర జంతువుల అరుపులు భరతుని చెవిన పడలేదు..ఎంతటి జంతువునైనా ఒక వేటుతో మట్టుకలిపే ఖడ్గం తోని ముందుకు దూకాడు..నాలుగు గడియల సమయం లోనే వాటిని మట్టుపెట్టాడు..చిన్న చిన్న గాయాలతో తాళపత్ర గ్రంధాలతో సహ తన రాజ్యాన్ని చేరుకున్నాడు....తిరిగి వొచ్చిన దగ్గర నుండి ఇరువై రెండు సంవత్సరాలపాటు తన రాజ్యాన్ని సుదీర్ఘంగా పాలించాడు..

                * * * * * * * * * * * *
                             ( 5 )

స్వయంవరంలో రాజు చెప్పిన విషయం...నా రాజ్యం కరువు కాటకాలతో చాల ఆపదలో వుంది ప్రజలు కనీసం తినటానికి తిండి కూడా లేక చనిపోతున్నారు..ఈ కరువును ఆపాలి అంటె 100 సంవత్సరాల క్రితము కుంతి రాజ్యంలొ భరతుడు అనే రాజు తాలపత్ర గ్రంధాల సహయంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు..తర్వాత వరుస భూకంపాల వల్ల కుంతి రాజ్యంతో పాటు ప్రక్కన 200 కిలోమీటర్ల వరకు అన్ని రాజ్యాలు మట్టికలిసి పోయాయి..రాజ్యాలతో పాటే ఆ తాళపత్ర గ్రంధాలు కూడా భూమిలొ కలిసిపోయాయో లేక ఎక్కడైన భద్రపరచడం జరిగిందో తెలీదు..మీలో ఎవరు ఐతే ఆ తాళపత్ర గ్రంధాలు తీసుకొని వస్తారో వారికే నా కూతురు సుకన్యా దేవిని యిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు..

అది వినగానే స్వయంవరానికి వొచ్చిన చాల మంది రాజులు అప్పుడే భయంతో తప్పుకున్నారు.కారణం కుంతి రాజ్యం ఇప్పటికీ వరుస భూకంపాలతో భీతిల్లుతోంది.అప్పుడు సుకన్యా దేవి తన తండ్రితో ఆ తాళపత్ర గ్రంధాలు తేవటమె కదా మీకు కావలసింది. నా కార్తికుడు నా కోసం ఎంత ప్రమాదం ఐన వాటిని తీసుకొని వస్తాడు అతనికి కూడా అవకాశం ఇవ్వండి అని అడిగింది..
                 అది విన్న మహరాజు కార్తీకుడు  కనుక ఆ తాలపత్రాలు కనుక తీసుకొని వస్తే నిన్ను యిచ్చి అతనికి వివాహం చెయ్యటమే కాకుండ నా తర్వాత నా రాజ్యానికి అతన్ని  రాజును చేస్తా అని మాట యిచ్చాడు..రాజులతో పాటు కార్తికుడు కూడా కుంతి రాజ్యానికి తాలపత్రాల కోసం పయనమయ్యాడు..

కుంతి రాజ్యపు భూకంపాల గురించి తన తాతయ్య చిన్నపటి నుండి చెప్పటం వల్ల కార్తికుని చాలా వరకు తెలుసు..అక్కడ సూర్యుడు ఉదయించిన సమయం నుండి సూర్యాస్తమయం వరకు ఎప్పుడు భూకంపం వస్తుందో  ఎవరు చెప్పలేరు కాని సూర్యాస్తమయం తర్వాత నుండి సూర్యోదయం వరకు మాత్రం అక్కడ భూమి కంపించదు..దాని గురించి తెలియక కుంతి బయల్దేరిన రాజులందరూ రాత్రి సమయము వరకు చేరుకోవాలని సూర్యాస్తమయం ముందే కుంతి చేరుకున్నారు..దానితో భూకంపము ధాటికి కుంతి చేరుకున్న రాజులందరూ ప్రాణాలు వోదిలారు.
          
      సూర్యాస్తమయం తర్వాత బయల్దేరిన కార్తికుడు సూర్యోదయం వరకు సగం దూరము చేరుకున్నాడు..మరలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు విశ్రాంతి తీసుకొని సూర్యాస్తమయానికి బయల్దేరి మళ్ళీ సూర్యోదయం వరకు కుంతి చేరుకున్నాడు..

కుంతి నగరము మొత్తం అస్థి,పంజరాలతో నిండి మొత్తం ఒక ఎడారిలా తయారైంది..అక్కడ నుండి తాలపత్రాల కోసం వెతకసాగాడు..దాదాపు ఒక రోజు మొత్తం వెతికి వెతికి అలసిపోయిన తర్వాత అతనికి ఒక కొండ కనపడింది..అక్కడ ఒక స్వరంగం దాదాపు 40 అడుగుల లోతు వుంది..కార్తికేయుడు దాని లోపలకి వెళ్ళిన తర్వాత అతనికి అర్దం ఐంది ..అది శత్రువులు అనుకోకుండా రాజ్యము మీద దాడి చేసినప్పుడు రాజులు ఆ గ్రుహ లోపలకి వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకునేవారు..
   
                భూకంపం రావటంతో తాళపత్ర గ్రంధాలతో సహ భరతుడు తన రహస్య స్వరంగం లోకి వెళ్ళిపోయాడు..కొన్ని సంవత్సరాల తర్వాత భరతుడు మరణించాడు..అలా లోపలకి వెళ్ళిన కర్తికేయకి తాళపత్ర గ్రంధాలు దర్శనం యిచ్చాయి..
                 
   వాటిని తీసుకొని తన రాజ్యానికి బయల్దేరాడు..దానికి మహ రాజు కార్తికేయ ధైర్యముకు మెచ్చి తన  రాజ్యాన్ని,తన కూతుర్ని అతనికి కట్టబెట్టాడు..

                                   
                                      రచన
                                * * * * * **
                                 రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts