Thursday 29 September 2016

ఆఖరి పేజీ


6 వ సిగిరెట్ తాగుతూ నోటి నుండి వస్తున్న పొగను  రింగులు,రింగులుగా వదులుతూ ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్య విహరిస్తున్న వాడిలా ఆనందాన్ని పొందుతున్నాడు సి.బి.ఐ ఆఫీసర్ శ్యామ్.
                      కంటి మీదకు వస్తున్న వెంట్రుకలను ఎడమచేతితో వెనక్కి నెట్టి ఒక నిమిషం పాటు ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి నెమ్మదిగా వెళ్ళి తన అల్మరాలో దాచివున్న డైరీని బైటకు తీసాడు.
( ఒక కేసు విషయం మీద ఇన్వెస్ట్ గేషన్ చేస్తుండగా అనుకోకుండా దొరికిన డైరీ అది ).
సి.బి.ఐ ఆఫీసర్లు సాధారణంగా చదవటానికి ఇష్టపడతారు ఆ కోవకు చెందిన వాడే శ్యామ్ కూడా.!
     
                                  
                                                          - 1996  -


కథ - మాటలు - దర్శకత్వం :--- సుమ.!

యిలా స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలని నా ఆశ.రెండు సంవత్సరాల నుండి దాని కోసమే  కష్టపడుతున్నా.కొత్త వాళ్ళకు అవకాశం  యివ్వకపోవటం వలనో ,ఇంట్లో ఆర్ధిక సమస్యల వలనో
( రాసిన మూడు కథలను అమ్ముకోవడం జరిగింది )  అనుకున్నది సాధించలేకపోయా. కొత్త సంవత్సరం మొదలయింది కనీసం ఈ సంవత్సరంలో అయిన నేను అనుకున్నది సాధించాలి..

పెన్,పేపర్ పట్టుకొని ఏదైన స్టోరీ తట్టదా అనుకుంటూ మేడ మీదకు వెళ్ళా.!అమ్మ ఆరోగ్యం ఏం భాగలేదు అందువల్ల ఏ విషయం మీద ఏకాగ్రత వుంచలేక పోతున్నాను. స్టోరి స్టార్ట్ కాకుండానే పులుస్టాప్ పడింది.

                        *         *          *           *         *         *           *          *

నిద్ర నుండి మెలుకువ వొచ్చింది గమ్మత్తైన కళ.  టైం చూసుకుంటే పడుకొని గంట అయింది అంతే..  ఆ కళని కనుక  కథగా మార్చి సినిమా  తీస్తే సిల్వర్ జూబ్లీ ఖాయం రేపు లేవగానే చేయాల్సిన మొదటి పని ఈ కళని కథగా రాయటమే అనుకొని నిద్రలోకి జారుకున్నా.!
  
               కథ రాయటానికి అంత సిధ్ధం చేసుకొని కూర్చున్నా ,కానీ రాత్రి జరిగిన కళ మంత్రo గుర్తురావటం లేదు..2 రోజులు గడిచాయి యింక నేను అదే కళ గురించి ఆలోచిస్తున్నా.. ఒకరోజు అమ్మ నన్ను గుడికి తీసుకెళ్ళింది,అక్కడ ఏదో యాగం జరుగుతుంది దాదాపు 11 మంది పూజారులతో కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దంపతులు యాగాన్ని చేస్తున్నారు.!
అది సర్ప నివారణ యాగం..ఆ దంపతుల్లో ఒకరికి రాత్రి పాము కళలో కనపడి వారిని చంపటానికి వెంటపడింది అది దోషము అని యాగము చేస్తున్నారు..వెంటనే నాకు ఒక సందేహం వొచ్చింది.నాకు వొచ్చిన కళ నాకు గుర్తులేదు కానీ వాళ్ళకు వొచ్చిన కళ వారికి ఎలా గుర్తుందా అని..
సరిగ్గా రెండు గంటల్లో కళల పైనే కాక ప్రపంచంలోని అనేకానేక విషయాల్లో పరిశోధనలు చేసి ఎన్నో అవార్డ్ లు పొందిన డా.కాలాని బ్రహ్మగుప్త గారిని కలిసి నా సందేహన్ని వెల్లడించాను.

        దానికి సమాధానంగా అతను. . !

ముఖ్యంగా కళలను 4 దశలగా వివరించవోచ్చు.!

మొదటి దశ :-  

 మనం నిద్రలోకి జారుకున్న తర్వాత నుండి 2 గంటలు వుంటుంది..ముఖ్యంగా ఈ దశ లో ఎక్కువు కళలు 4--6కళలు వొచ్చే అవకాశం వుంది..!ఈ దశలో వొచ్చిన కళలు ఎక్కువగా గుర్తు వుండవు కానీ వొచ్చేటప్పుడు మాత్రము చాల స్పష్టంగా తెలుస్తుంది..

రెండవ దశ : -

 ఈ దశ ప్రభావం యింక కొంచెం ఎక్కువుగా వుంటుంది ఈ దశలో 3 -5 కళలు వొచ్చే అవకాశం వుంటుంది..ఈ దశలో వొచ్చే కళలు మొదటి దశ కన్నా కొంచెం బ్లర్ గా వుంటాయి..

మూడవ దశ  :- 

 ఈ దశలో యింకా కొంచెము ప్రభావం ఎక్కువ. ఈ దశ లో వొచ్చే కళల సమయం మొదటి రెండింటి కన్నా ఎక్కువ..

నాల్గవ దశ : -

 ఈ దశనే మనం గాఢ నిద్ర అని కూడ అంటుంటాము..ఈ దశలో వొచ్చే కళలు అసలు క్లారిటీగా వుండవు.మన ముఖం తప్పు మిగిలిన ఫేస్ లు అన్ని బ్లర్ గా వుంటాయి..
కలల్లో 99% గుర్తువుండవు.మనం బాగా ఆలోచించిన విషయాలు కానీ,మనకు ఎవరైన చెప్పిన విషయాలు కానీ,ఎక్కడైన చూసినవి కళల రూపంలో బయటకు వస్తాయి..

ఉదా : -ఒక  B- TECH విధ్యార్దికి  2 సంవత్సరాలు అతను attendence లేక డీటేండ్ అయినట్లుగా ఒకటే కళ వొచ్చేది..అంటే అతనికి ఎప్పుడో దగ్గరగా అలాంటి సిచుయేషన్ వొచ్చి వుంటుంది అందుకే అది వాడి మైండ్ లో అలానే వుండి పోయి కళగా బైటకు వస్తుంది..

నేను :-    మరి ఆ కళలను గుర్తుపెట్టుకోవటం ఎలా ??
గుప్త :-    మనం నిద్రలో వుండగా మనకు కళ వస్తే కనుపాపలు కదిలి మనం మూసుకున్న కనురెప్పల మీద తెలుస్తుంది..ఇలా ఆ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో మనం అతనిని లేపి అడిగితే అతను వేసుకున్న రంగుతో సహ పూసగుచ్చినట్లుగా చెపుతాడు..
నేను : -   ఈ కలలను ఎక్కడైన రికార్డ్ చేయటము  లాంటిది చేస్తే నా సినిమా స్టోరీలకు యింతగా ఆలోచించనవసరం వుండదు,అంతే కాకుండ మనం కంటున్న కళలను కొంచెము మార్చి కథగా రాయొచ్చు. అలాంటి పరికరాలు ఏమైన వున్నాయా..
గుప్త:-      3 సంవత్సరాల క్రిత0 జపాన్ లో వున్న నా స్నేహితుడు మెదడు యొక్క Frequency ని ఉపయోగించి కలలను తేలుసుకునే ఒక  డ్రీంమిషన్ ను తయరు చేసాడు దాని తర్వాత వాళ్ళలో వాళ్ళకి ఏవో గొడవలు వొచ్చి అతన్ని చంపేసి ఆ మిషన్ను ద్వంసం చేసారు..కానీ అతను అది తయరు చెయ్యటానికి కావలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను నాకు చెప్పాడు..అంతే కాకుండా నాకు కూడ తెలిసిన కొన్ని విషయాలను అన్ని ఒక బుక్ లో వ్రాసి వుంచా నీకు అవసరం అనుకుంటే తీసుకో..

నేను : -     మీరు ఎందుకు తయారు చెయ్యలేదు దాన్ని..
గుప్త : - 😃 నాకు 70 సంవత్సరాలు ఇప్పుడు దీన్ని తయారుచేసి నేను ఏం చెయ్యగలను..
         దాన్ని తయారు చెయ్యటానికి మీరు నాకు సహయం చేస్తారా.!

నా వంతు సహయం నేను చేస్తా కానీ దీని వలన నీకు చాలా సమస్యలు వొచ్చి పడతాయి..
నేను నవ్వి అక్కడ నుండి బుక్ తీసుకొని వోచ్చేసా..రక రకాల విషయాలు,గుప్తాగారు యిచ్చిన బుక్ ఆధారముగా DREAM MACHINE  ని స్టార్ట్ చేసా..
మొదటి దశ లో వొచ్చే కళలు కలర్ ఫుల్ గా వుంటాయి కాబట్టి నేను ఆ దశ మీదనే స్టార్ట్ చేసా.
మనం మెలుకువతో వున్నప్పుడు మన కంటి నుండి
మెదడుకు అన్ని విషయాలు చేరుతూ వుంటాయి కానీ నిద్రలో వున్నప్పుడు మాత్రము మన శరీరం కళ్ళు అలసటతో కొంచెం రెస్ట్ తీసుకుంటుంది.ఆ సమయంలో మెదడు ఒక్కటే పని చెయ్యటం జరుగుతుంది..అందుకే పడుకున్న తర్వాత మన శరీరం పనిచెయ్యక పోవటం వల్ల మనం మెదడు తన అంతట తాను ఒక లోకాన్ని ఏర్పాటుచేసుకుంటుంది ఆ లోకంలో మన శరీరం బదులుగా మనం మెదడు చేసే పనే కళ..
గుప్తా గారి సహయంతో  ఒక మనిషి యొక్క బాడీ frequency మరియు మైండ్ లో వొచ్చే కధలికల ఆధారముగా నేను ఆ మిషన్ ను తయారు చేసాను..
పడుకున్న వ్యక్తి తల కి ఈ మిషన్ నీ అమర్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువ బయపడితే ఎక్కువ frequency,తక్కువ బయపడితే frequency మారుతుంది అంటే మనిషి మెదడు స్పందించే విదానన్ని బట్టి.ఆలా బైటకు వొచ్చిన గ్రాఫ్ ను తీసుకొని
( గ్రాఫ్ నీ బట్టి వారు ఆ సందేశాలనీ కనిపెట్టగలరు)
గ్రాఫిటీకాలజి వారికి ఇస్తే వాళ్ళు మనకు సందేశాల వివరంగా బయట పడిన విషయాన్ని చెపుతారు..
అలా మనకు కావలసిన కథలు బైటకు వస్తాయి.

        *                  *                  *                  *                 *                   *                 *

తన కథ పూర్తి అయింది మంచి సినిమా వొచ్చి వుంటుంది అనుకొని డైరీనీ మూసివేసాడు శ్యామ్..
ఆమెను మెచ్చుకుంటూ వుండగా అప్పుడే మొదలయిన గాలికి డైరీ చివరి పేజీ నుండి ఒక అమ్మయి ఫోటో ఎగురుతూ వొచ్చి అతని మీద వాలింది..అప్పుడే పాల సముద్రం లోపలి నుండి బైటకు వొచ్చిన అప్సరసలా వుంది.
అప్సరస కూడ తక్కువ పదం అవుతుందేమో అప్సరసను మించన అమ్మాయిలా వుంది..అతని చూపులు చివరి పేజీ మీదకు మల్లాయి..డైరీ లోని చివరి పేజీని చదవటం మొదలు పెట్టాడు..

      *                      *                   *                   *                   *                       *

మా అసిస్టంట్ లు సాయి,శివ లు డబ్బుకు ఆశపడి ఈ మిషన్ గురించి దేశం లోని ప్రముకులకు చెప్పటం వారి నుండి వేరే దేశంవారికి తెలియటం అన్ని జరిగి పోయాయి..
అప్పటి నుండి నాకు సమస్య మొదలు అయింది..

                  మన దేశంలో సినిమా రంగం చాల తక్కువ ఇండియా కంటే మనం ఎందులోనూ తగ్గకుడడదు..మన గూడాచారుల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే సుమ అనే అమ్మాయి కళలను బంధించే ఒక మిషన్ ను తయారు చేసింది దాన్ని ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఐన దానిని చంపి ఐన ఆ మిషన్ ను మన దేశానికి తీసుకొని వొచ్చి యిక్కడ కూడ సినిమా రంగాన్ని అభివృధి చేసుకోవాలి..
అని పాకిస్తానీ ప్రబుత్వం నిర్ణయించుకుని అతి కిరాతకుడు ఐన అబ్దుల్ ఖాన్ ను ఇండియా కి పంపింది..      వాడు ఇండియా లో అడుగు పెట్టగానే నాకు ఫోన్ చేసి మిషన్ ఇవ్వక పోతే చంపుతాను అని బెదిరించాడు..వెంటనే పోలీస్ స్టేషన్ కు కు వెళ్తే వాళ్ళు నా మాట వినటం లేదు..
         ( వాళ్ళ నోర్లు పాకిస్థాని వాళ్ళ యిచ్చిన లంచంతో మూసుకుపోయాయి ).

యింతలో మళ్ళీ ఫోన్ -- నువ్వు ఎవరితో చెప్పుకున్నా ఎవరు నీ మాట పట్టించుకోరు అందరినీ మా డబ్బు మత్తులో పడేశా.
రేపు మా వాళ్ళు నీ ఇంటికి వస్తారు వాళ్ళకి ఆ మిషన్ యిచ్చి పంపించు అంతే కాదు నువ్వు జీవితం లో మళ్ళీ దాన్ని తిరిగి స్టార్ట్ చెయ్యకూడదు..
వాళ్ళు రావటం మిషన్ తీసుకొని పోవటమే జరిగింది..ఇంకొక 10 రోజుల్లో వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు..

   *                  *                    *                       *                         *                         *

ఎన్నో కేసులను చూసాడు కానీ ఎప్పుడూ ఏ విదమైన ఫీలింగ్స్ రాలేదు..కానీ ఈ దారుణాన్ని చదివాక శ్యామ్ ముఖం ఎర్రబడింది..చేతులు వణకసాగాయి..క్యాలెండర్ వంక తదేకంగా చూసాడు ఇంకా వాళ్ళు దేశం దాటి పోవటానికి 2 రోజులు టైం వుంది వాళ్ళని ఇక్కడే ఆపి జైల్లో వెయ్యాలి.ఎలాగైనా ఆ అమ్మాయికి హెల్ప్ చెయ్యలి.

క్షణాల్లో ఆ ఫోటో ని తన స్టాప్ కి పంపటం తన అడ్రేస్ కనుక్కోవడం అన్ని జరిగిపోయాయి..
వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు డైరీతో సహ బయలుదేరాడు..తన గురించి చెప్పి ఆ అమ్మాయి చెయ్యవలసింది చెప్పాడు.సుమ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో తను తయరు చేసిన మిషన్ ని సి.బి.ఐ ఆఫీసర్ శ్యామ్ బెదిరించి తీసుకున్నాడని,ఆ కేసు విషయం అబ్దుల్ ఖాన్ కి అప్పుడే పోలీస్ లు తెలిపారు..మరుసటి రోజు పేపర్ లో డ్రీమ్ మిషన్ ను తయారు చేసిన సి.బి ఐ ఆఫీసర్ శ్యామ్ అని వొచ్చింది..
అప్పుడే సుమ కు,శ్యామ్ కు విడి విడిగా ఫోన్ లు వోచ్చాయి..రేపు మీ యిద్దరి ప్రాణాలు తీసి ఇక్కడ నుండి వెళ్తాను అన్న మాటలు..
   అప్పటికే వాళ్ల ప్లాన్ ప్రకారం అబ్దుల్ ఫోన్ ట్రాప్ చెయ్యటం అతనికి దగ్గర్లో ఒక వ్యక్తి ని వుంచడం..మొత్తం ప్లాన్ తో వున్నాడు శ్యామ్..
   
వాళ్ళు అనుకున్నట్లు గానే అబ్దుల్ రావటం వాళ్ళకి దొరకటం జరిగి పోయాయి..యింత పనికి కారణం అయిన ఆ డ్రీమ్ మిషన్ ని నాశనం చెయ్యటం జరిగి పోయింది..
 
                                                                                                                           రచన
                                                                                                                    రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts