Wednesday 17 August 2016

ఆకలి కేకలు

మన దేశం శాంతికి పెట్టింది పేరు అంటారు..కాని అలాంటి శాంతి మన దేశంలో ఎక్కడ వుంది..మన దేశంలో వున్నదల్లా పేదవాడి ఆకలి మంటలు,రైతుల ఆత్మహత్యలు..!


                             ( 1 )

ఇది ఆకలి,చావులకు దగ్గరగా భందు,బాందవ్యాలకు దూరంగా వున్న ఒక ముసలివాడి కథ.
అతని చెయ్యి నరికి వేశారు..ఏమైంది అని అడగ్గా అతను చెప్పిన సమాదానం..

నాకు గుండె నొప్పి బాబు దానికోసం రోడ్డు ప్రక్కన అడుక్కోని మరి 5 సంవత్సరాలుగా రూపాయి,రూపాయి పోగుచేసుకోని యింకో 2 రెండు రోజుల్లో హొస్పిటల్ కి వెళతా అనగా అర్ధరాత్రి ఎవరో వొచ్చి నా చెయ్యి నరికి ఆ డబ్బు తీసుకెళ్ళారు,అని అతను చెప్పిన సమాధానానికి ఎంత ఆపుకున్నా ఆగలేదు కంటి నీరు.. పేదవాని దగ్గర డబ్బులు కూడా లాక్కున్న వాడిని ఏమనాలో కూడా మాటలు రావటం లేదు,ప్రబుత్వం ఏం చేస్తుంది..

చాల మంది సిగిరేట్ తాగుతూ వుంటారు ఒక 5 మంది ఒక సంవత్సరం సిగిరేట్ తాగటం ఆపి ఆ డబ్బులు యిలాంటి పేద వాళ్ళకి యిస్తే అప్పుడు వొచ్చిన ఆనందం ముందు సిగిరేట్ తాగితే వొచ్చే 5  నిమిషాల ఆనందం ఎంత పాటిది..!

సిగిరేట్ తాగక పోవటం వాల్ల ఒక పేదవాడి ప్రాణం కాపాడొచ్చు..! 





                           ( 2 )

రేపే లాస్ట్ రోజు అంట నాన్న స్కూల్ ఫీజు కట్టటానికి రేపు కట్టక పోతే స్కూల్ కి రానివ్వరంట..ఏమోయ్ రామనాథం నా అప్పు రేపటి కల్లా తీర్చక పోతే నిన్న నీ కుటుంభాన్ని రోడ్డున పడేస్తా..ఏమండీ ఇంట్లో బియ్యం అయిపోయాయి పిల్లలు ఆకలి,ఆకలి అని ఏడుస్తున్నారు.అప్పులు ,ఆకలి కేకలు..!

వీటన్నింటిని భరించలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

మనం ప్రతీ సంవత్సరం బర్త్ డేకి  ఖర్చు పెట్టే పదివేలో,పన్నెండు వేలో ..వారికి యిస్తే ఇలాంటి రైతుల ఆత్మహత్యలు వుండవు..

మనం ఒక నైట్ బర్త్ డే  పార్టీ ఒక పేదవాడికి రెండు నెలల జీవనాధారం..


2 రోజుల డిస్కో పార్టి పేద విధ్యార్ది ఒక సంవత్సరం స్కూల్ ఫీజు..
మీరు కూడ పై వాటిని పాటిస్తారు అని కోరుకుంటూ యిక సెలవు..


                               
                                     రచన

                                రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts