Friday 27 July 2018

- శ్రీ దేవి -


నల్లటి చీకటిని నీ కనులకు కాటుకగా అద్ది..

చుక్కలను జతచేసి నీ వాలు జడలో పూలగా పెట్టి..

ఇంద్రధనుస్సును తెచ్చి నీ నడుముకు వడ్డాణంగా మలచి..

ఆకర్షణని నీ కనుపాపలో దాచి భూమి మీదకు పంపాడు దేవుడు ఒకప్పుడు, సృష్టి నీ అందం చూసి అసూయపడాలి అని..

కానీ ఇప్పుడు తనకంటే అందం లేదని మురిసిపోతున్న ప్రకృతికి ఒక్కసారి మళ్ళీ నిన్ను పరిచయం చెయ్యాలని ఉంది..   

                                                   - శ్రీ దేవి

                                                                                                   - రఘు





స్త్రీ


దేవుని అద్భుత సృష్టిలో స్త్రీ కూడా ఒకటి..
అలాంటి అద్భుతాన్ని సృష్టించి సృష్టిలో అన్ని బాధలే పెట్టాడు దేవుడు..
చెవులకు ఝంకాలు పెట్టి బాల్యం లొనే నొప్పిని పరిచయం చేస్తాడు.. 
ప్రతి నెలా నొప్పిని ఇచ్చి యవ్వనం నుండే బాధను కలిగిస్తాడు..
పెళ్లి పేరుతో తల్లి దండ్రులకు దూరం చేసి మనసులో బాధను కలుగచేస్తాడు..
పెళ్లయ్యాక బిడ్డకు జన్మనిస్తూ పురుడి నొప్పులు పడేలా చేసాడు..
భర్త చనిపోయాక తన అందాన్ని , అలంకారాన్ని దూరం చేసి చేతి గాజులను పగలగొట్టి నొప్పిని పొందేలా చేసాడు..
మనవళ్లు,మనవరాళ్లను ముద్దాడక ముందే రోగంతో మంచం మీద విలవిల లాడేలా చేస్తాడు..

రాజకీయ చదరంగం

నాకు చెస్ ఆడుతుంటే ఒక ఆలోచన వొచ్చింది..మనం చెస్ లో వేసే ఎత్తులు,రాజకీయాల్లో వేసే ఎత్తులు ఒకేలా ఉంటాయి అనిపించింది..

ఎలా అంటే..

చెస్ బోర్డ్ మొత్తాన్ని ఒక రాష్టంగా భావించాం అనుకోండి..

ర్రాష్టాన్ని రెండు భాగాలుగా విభజించారు..అనగా చెస్ బోర్డ్ ని రెండు భాగాలుగా విభజిస్తే ..చెస్ బోర్డు కి ఒకవైపు గళ్లలో అధికార పక్షంవారు ,రెండోవ వైపు గళ్లలో ప్రతిపక్షం వారు వుంటారు..మధ్యలో ఉన్న ఖాళీ గళ్ళు వీరందరికి ఓటు వేసి గెలిపించే జనం.

చెస్ బోర్డు లో ఒకవైపు గళ్లలో వుండేవారు అధికార పక్షం వారు.. గళ్ళ మధ్యలో ఉండేది రాజు అనగా ముఖ్యమంత్రి..రాజు పక్కనే ఇరువైపులా వుండేవారు MLA లు MP లు అనగా ఏనుగు,ఒంటె మొదలైనవి..ముందు వరుసలో ఉన్న సిపాయిలందరు పార్టీ కోసం కృషి చేసి కార్యకర్తలు,పార్టీ పిచ్చి ఉన్న జనం, నాయకులు..అధికార పక్షం వారు ,ప్రతిపక్ష వర్గం వారు ఇద్దరూ మధ్య గళ్లలో ఉన్న ఓటు వేసిన జనాన్ని తొక్కుకుంటూనే వెళ్తుంటారు..

విధంగా రాజు ( ముఖ్యమంత్రి ) చుట్టూ ఒక కంచుగోడలా వుంటారు పార్టీ సభ్యులు   ( ఏనుగు,ఒంటె)..అధికార పక్షంలో అయినా ప్రతిపక్షంలో అయినా రాజు భద్రత కోసం తమ పార్టీ క్షేమం కోసం సిపాయులు (కార్యకర్తలు)ఒక అడుగు ముందుకు వేస్తాడు.. సిపాయి వల్ల తన పార్టీకి ఆపద రాకుండా ఉండటానికి మరొక వర్గం లో ఉన్న సిపాయిలు (కార్యకర్తలు) వీరికి అడ్డంగా వెళ్తుంటారు.. ఇలా పార్టీ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు మధ్యలో వుండే సిపాయిలు,కార్యకర్తలు..

మరొక వైపు..MLA ( ఏనుగు ) లు MP లు(ఒంటె) చురుగ్గా అడ్డదిడ్డంగా అవతలి వారి వర్గం మీద దాడి చేస్తూ ఆలాగే తమ రాజును కాపాడుకుంటూ వస్తుంటారు..అలా జరిగే క్రమంలో అధికార వర్గం వారు ప్రతిపక్ష వర్గంలోని చేరి రాజును కదలకుండా ప్లాన్ తో చెక్ పెడితే మళ్ళీ వీళ్లదే రాజ్యము గెలుపు..ఒకవేలా అలా కాకుండా ప్రతిపక్షం వారు అధికార పక్షంలోకి వొచ్చి రాజుకు చెక్ పెడితే ప్రతిపక్షం వారు అధికారంలోకి వస్తారు..

ఇలా ఎత్తుకు పై ఎత్తులు వేసి అధికారంలోకి వస్తుంటారు..వీళ్ళు వేసే ఎత్తులు తెలియని జనం మాత్రం మధ్యలో బలైపోతున్నారు.. 

                                                                                                      -  రఘు 


                      

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts