Tuesday 13 June 2017

రఘు అనే నేను - 3




ఏంటి తనని చూడకుండా ఉండలేక పోతున్నాను..
ప్రేమిస్తున్నానా..??

ఛా.. ఛా.. తను నా ఫ్రెండ్ కదా అలాంటిది ఏం ఉండదు..
ఒక వేళ తనకు కూడా ఇలాంటి ఫీలింగే వుందా.. ఉంటే ఎలా తెలుసుకోవాలి..

ఇలా నాలో నేను మధన పడుతూ ఉండగా ఆ ఆలోచనలను తెంచుతూ రాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేసింది హారిక.

రేపు సండే కదా నీ ప్లాన్ ఏంటి??
ప్లాన్ అంటూ పెద్దగా ఏం లేదు హాస్టల్ లొనే..
బయటకు వెళదాం...రేపు ఉదయం 5 కి రెడీ గా వుండు నేను మీ హాస్టల్ దగ్గరకు వొచ్చి పిక్ అప్ చేసుకుంటాను..
అవును ఇంతకీ ఎక్కడికి వెళ్లేది ??

మార్నింగ్ 6:00 

   స్కూటీ ఎల్ బి నగర్ హయత్ నగర్ రోడ్ల వెంబడి వెళ్తుంది.. చల్లటి గాలి రివ్వున వీస్తుంది..హారిక స్కూటీ డ్రైవ్ చేస్తుంది నేను వెనుక కూర్చున్న... ఆ గాలికి ఆమె కురులు నా ముఖాన్ని తాకుతున్నాయి ..ఆమె తలనుండి వొచ్చే  మల్లెపూల సువాసన నాకు మత్తు ఎక్కిస్తుంది..గంట తర్వాత స్కూటీ సంఘీ టెంపుల్ చేరుకుంది..
సినిమాలకి,షాపింగ్ లకి ఒక రోజు ముందుగానే చెప్పే ఆడవాళ్లు గుడికి మాత్రం వెళ్లే వరకు చెప్పరు..
సంఘీ :-
     అన్ని గుళ్లలో లోపలికి వెళ్ళాక కనిపించే దేవుడు సంఘీ లో మాత్రం బయట గుడి మెట్లు ఎక్కుతుంటేనే కనిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు.. నానా కస్టాలు పడి పైకి చేరుకున్నాం.
లోపలికి వెళ్ళాక 108 ప్రదక్షణల కార్యక్రమం మొదలయింది..భక్తితో ప్రదక్షణలు చెయ్యటం మానేసి రన్నింగ్ చేస్తున్నారు భక్తులు..దర్శనం చేసుకొని వొచ్చి బయట మెట్లమీద ప్రసాదం తింటూ కూర్చున్నాం..
ఎందుకో తెలియదు పరికీని, ఓణీలో కడిగిన ముత్యం లా చూపు తిప్పుకొనియ్యకుండా వుంది హారిక..ఆమెను అలాగే చూస్తూ ఉండి పోయాను..
ఏంటి అలా చూస్తున్నావు..??
ఏం లెదు ఊరికే.
లేదు నీ చూపులో ఏదో తేడా కనపడుతుంది ఏమైందో చెప్పు..??
ఈ రోజు నువ్వు చాలా చాలా అందంగా వున్నావు..   
ఏంటి ఇవాళ ఎదో కొత్తగా మాట్లాడుతున్నావ్..
కొత్తగా కాదు నిజం మాట్లాడుతున్నా..
     ఐ లవ్ యు

నువ్వు 3 నెలలుగా నాకు తెలుసు..ఈ మూడు నెలల్లో నీ ఇష్టాలు,అయిష్టాలు తెలుసుకున్నాను..నీ కష్ట, సుకాల్లో పాలుపంచుకున్నాను..
నువ్వు నవ్వితే నా పెదాల మీద చిరునవ్వు కదలాడేది.. నువ్వు ఏడిస్తే నాకు తెలియకుండానే నా కళ్లలో నీళ్లు తిరిగేవి..ప్రేమంటే ఏంటో అర్ధం చెప్పిన కవులు ఆ ప్రేమ ఎలా పుడుతుందో మాత్రం చెప్పలేక పోయారు..బహుశా ఇదేనేమో ప్రేమంటే..నీకు కష్టం కలిగించే ఏ పని ఏది నేను చెయ్యను..నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పలేను కానీ నాకు ఉన్నంతలో నిన్ను మహారాణిలా చూసుకుంటాను..నన్ను పెళ్లి చేసుకుంటావా??

అక్కడ సూది పడితే వినపడే అంత నిశబ్ధం.. లబ్ డబ్ అంటూ నా గుండె చప్పుడు నాకే వినపడుతోంది..తను ఏం మాట్లాడకుండా స్కూటీ దగ్గరకు వెళ్ళింది నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళాను..

నన్ను డ్రైవ్ చెయ్యమని చెప్పింది..ఆమె ముఖం లో ఏ భావాలు కనిపించటం లేదు..నాలో టెన్షన్ పెరిగిపోయింది..ఆమె నో అని చెప్పినా ఇంత టెన్షన్ పడేవాడిని కాదేమో..
స్కూటీ వెళ్తుంటే ఇక్కడ ఆపు అంది..అక్కడ దిగాక ఇలా చెప్పింది..

( అంతలా ప్రేమిస్తున్న వ్యక్తికి ఏం చెప్పి ఉంటుందో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి..).
Next episode will be updated soon..
                                        
                                                 రచన
                                           రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts