Sunday 27 March 2016

💘 లవ్ టిప్స్ 💚

ప్రయాణీకులకు విజ్ఞప్తి ట్రైన్ నంబర్  08686 హైదరాబాద్ నుండి ముంబాయి వెళ్ళవలిసిన ముంబాయి express మరికోద్ది క్షణాల్లో 2వ నంబర్ ఫ్లాట్ ఫాం నకు వోచ్చుచున్నది..
     ఆ ట్రైన్ కోసం 2 గంటల నుండి 2 వ నంబర్ ఫ్లాట్ ఫాం లొ ఎదురుచూస్తున్న నేను , ట్రైన్ రాగానే 2 seconds లొ నా సీటులో చేరాను..
నా ఫోన్ లొ కాజల్ కంటే ఎక్కువ అనుష్క కంటే తక్కువగా వున్న అమ్మాయి ఫోటో చూసి గాడిద లాంటి గొంతుతో గోరంగా ఏడుస్తున్న నన్ను ఏమైందో చెప్పమని  ఎన్నెన్నో ప్రశ్నలతొ  ముంచెశాడు నా తోటి ప్రయాణికుడు పరమానందం.. . . . . .
                       కంటిలో నుండి పొంగుకుంటు వస్తున్న నర్మద ని బలవంతంగా ఆపి ఒక్కసారి గతంలోకి వెలితే..... .
2 నెలల క్రితము 
నీళ్ళు లేని బావిలో దూకి సూసైడ్ చేసుకోటానికి రేడీ గా వున్న నన్ను బరబర శబ్దం చేసే బుల్లెట్ మీద 1కి వొచ్చి చక చక వెనక్కి లాగాడు గౌతమ్ నంద....
ఏమైంది సూసైడ్ చేసుకోటానికి కారణము ఏంటి అని నేను నిలుచున్న చోటునె నన్ను నిలదీసాడు......
నేను :-) ఒక అమ్మాయి కోసం...
  
     -) అది తెలుస్తూనే వుంది.... ఏమైంది లవ్ ఫేల్యూర్ రా.. లేక ఆ అమ్మాయికి  ప్రపోజ్ చెయ్యగానే చెప్పుతొ కొట్టిందా ? ?  చెప్పు అని చాల థ్రిల్లింగ్ గా అడిగాడు గౌతమ్ నంద ... .
ఆ అమ్మాయి పేరు ప్రియ నేను 1year నుండి ఆమెను లవ్ చేస్తున్నాను,ఈ రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యటానికి వెళ్తుంటే వాళ్ళ అన్నయ్య గురించి తెలిసింది.వాళ్ళ అన్నయ్య ఒక పెద్ద రౌడీ..చెల్లి వంక ఎవరైన చూస్తే చాలు వాళ్ళకి చావు తప్పదు అంట నేను ప్రపోజ్ చేసినట్టు వాళ్ళ అన్నయ్య కి తెలిస్తే నన్ను చంపేస్తాడు...
అందుకే ఆ అమ్మాయికి  నా ప్రేమ గురించి చెప్పలేక ఆ అమ్మాయిని మర్చిపోలేక.....
          చచ్చిపోదాము అనుకున్నావ్ అంతే కదా.. ఇల చనిపోతే నీది గొప్ప లవ్ అవుతుంది అనుకుంటున్నవ...
దీనికే ఎవరైన సూసైడ్ చేసుకుంటారా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు తెలీకుండా ఆ అమ్మాయిని పడేయటానికి నీకు కొన్ని టిప్స్  నేను చెపుతా అవి ఫాలొ అవ్వు... సరే రేపు ఇదే ప్లేస్ లొ  కలుద్దాం..
అవును ఇంతకీ నీ పేరు ఏంటి  (చందు)
 
లవ్ టిప్స్ నేర్చుకోటానికి ఉదయాన్నే లేచి తలస్నానము చేసి రేడీ అయ్యి గౌతమ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న.ఫోన్ రావటమే ఆలస్యం కాకిలా వాలిపోయాను నా సూసైడ్ ప్లేస్ కి..
   
టిప్ 1 :-   హెల్ప్...  ఆ అమ్మాయికి తెలిసేలా ఎవరికైన హెల్ప్ చెయ్ దానివల్ల అమ్మాయిలు ఎక్కువ impress అయ్యే అవకాశం వుంది.  వెళ్ళు అదే పనిలో వుండు
అవును ఇంతకి మీ కాలేజ్ పేరు,
  చైతన్య డిగ్రీ కాలేజ్... చైతన్య కాలేజా వుండు ఒక ఫోటో తీసుకుంటా మా చెల్లి మధు ది కూడా అదే కాలేజ్ తనకి చెపుతా ఏమైన హెల్ప్ చెయ్యమని...
        హెల్ప్ ఎలా చెయ్యలి అని ఆలోచిస్తూ మా స్నేహితుడు కాలేజ్ లో బ్లడ్ ఇస్తుంటే నేను పక్కన వెళ్ళా.. బాటిల్ బ్లడ్ teesi ఒక బత్తాయి కాయ చేతిలో పెట్టారు.అది మాత్రమ్ నీకు ఎందుకు మామ అని వాడి దగ్గర నుండి ఆ పండు ని లాక్కొని బయటకు వస్తుంటే . . .
అదే టైం లో నన్ను చూసింది ప్రియ.. ఆమెను చూసిన సందడిలొ వుండగా నా కాళ్ళకు ఏదో తగిలి నా చేతిలో వున్న పండు వెళ్ళి పక్కనే అడుక్కునే వాడి ప్లేట్ లొ పడింది...
దానితో ప్రియ వొచ్చి మీరు చాల గ్రేట్ బ్లడ్ ఇవ్వటమే కాకుండా మీకిచ్చిన పండు కూడా దానము చేసారు.మీలా హెల్ప్ చేసేవాళ్ళు అంటే నాకు చాల గౌరవం..నేనే బ్లడ్ ఇచ్చా  అనుకుంది.
friend ఇచ్చిన 1 బాటీ ల్  బ్లడ్ నా 1 year ప్రేమకు నీళ్ళ పోసింది..
మీ పేరు -) చందు
ప్రియ impress ఐన విధానం చూసి నాలో నేనే నవ్వుకున్నాను.. .
టిప్ 1 చాల సక్సేస్ ఐంది
టిప్   2 :-) friendship ఎక్కువమందికి  ఈ దశ నుండే ప్రేమ మొదలవుతుంది.. ప్రేమ అనే పదానికి అసలు పునాది స్నేహము.
Friendship ఎలా చెయ్యలి అనుకుంటూ కాలేజ్ కి వెళ్ళటానికి ఆటో ఎక్కాను.. అందులో ప్రియ చాల టెన్సన్ పడుతోంది... నన్ను గుర్తుపట్టి hiii చెప్పింది.. చేతిలో పర్స్ వుంది బహుశ అందులో చాల మనీ వున్నవి కాబోలు..,. ఆటో చాల ఇరుకుగా  వుంది ఆ సమయం లోనే నాకు ఒక ఆలోచన వొచ్చింది,వొచ్చిన మరుక్షణం ఆ అమ్మాయి పర్స్ లోని మనీ కాస్త కాలి అయ్యాయి..( అవి తీసింది నేనే )
ప్రియ హడావిడిగా దిగి ఫీజు కట్టటానికి వెళ్ళింది చూస్తే కాలి పర్స్...ఆ సమయం లో మనీ తీసుకెళ్ళి ఆటో లో మీ పర్స్ లో డబ్బులు కొట్టేసి  మీ పక్కన వున్న వాడు ముందు స్టొప లోనె దిగాడు వాడిని పట్టుకొని మీ డబ్బులు తెచ్చాను అని అబద్దం చెప్పను..
దానితో మా మధ్య స్నేహము మొదలయింది 
టిప్ 3 :- ప్రపోజ్ ... ఎలా చెప్పాలంటే నువ్వు చెప్పే dialouge కె ఆ అమ్మాయి పడిపోవాలి..,.
మదురం short film dialouge లు అన్ని బట్టి పట్టి ప్రియ ముందు చెప్పాను.
          ( ఆ short film ప్రియ చూడలేదు )
ఆ dialouge లు విన్న తర్వాత ఏ అమ్మాయి  పడదు చెప్పండి..
నా ప్రేమ success అయింది దాంతో నేను,గౌతమ్ టెన్సన్ వొదిలేసి బీర్లు మొదలేసాము..
అవును ఇంతకి మీ ప్రియ ఫోటో నాకు చూపించలేదు... నా ఫోన్ లో ప్రియ ఫోటో చూడగానే గౌతమ్ కళ్ళు ఆది సినిమాలో ntr వి మండినట్లు మండిపోయాయి ...
ఏంట్రా నా చెల్లి మధు ఫోటో చూపిస్తున్నావు. మీ చెల్లి ఏంటి మీ చెల్లి పేరు మధు అన్నావ్ కదా,.. అవును మధుప్రియ..
అంటే ఇన్ని రోజులు నా చెల్లిని పడేయటానికి నేనే టిప్స్ చెప్పనా ఛా.. ఛా
ఇది  జరిగింది అతని నుండి తప్పించుకొని  ఇల ట్రైన్ ఎక్కాను.. నన్ను వెతుక్కుంటూ రానే వోచ్చాడు గౌతమ్ నంద.. కానీ నన్ను చంపటానికి కదు మా పెళ్లి చెయ్యటానికి... నీకంటే నా చెల్లిని ప్రేమించే వాడిని ఎక్కడ తీసుకురాగలను అందుకే మీ పెళ్లి చెయ్యాలని నిర్ణయము తీసుకున్నా.
మా పెళ్లి చాల గ్రాండ్ గా జరిగింది..
14 నెలల క్రితము మన లవ్ కి మా అన్నయ్య అసలు ఒప్పుకోడు నాకు ఏం చెయ్యాలో అర్దంకావటం లేదు...
  మరి పారిపోయి పేల్లిచేసుకుందామ అంటే,మా అన్నయ్య ని వొదిలి నేను రాలేను అన్నది ప్రియ ..
మరి ఎలా మీ అన్నయ్య ని ఒప్పించడం... అని ఆలోచిస్తున్న నాకు ఒక ప్లాన్ తట్టింది. . పైన అనుకున్న విదముగా ప్లాన్ చేసి వాళ్ళ అన్నయ్య చేతుల మీదిగానే  మా పెళ్లి జరిపించాము.
  ఇదంతా నేను ప్రియ అనుకొని చేసిన ఒక ప్లాన్  ట్రైన్ లో పరమనన్దయ్యకి చెప్పింది మేము ఆడుతున్న నాటకమే...
                                 రచన     
                           _______________         
                        
                            రఘు చౌదరి                

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts