Monday 19 June 2017

రఘు అనే నేను - 4


స్కూటీ ఇక్కడ ఆపు అంది ఆపాక ఇలా అంది..
నాలో టెన్షన్ ఎక్కువ అయింది ఆమె వైపు సూటిగా చూడాలేక పోతున్నాను..
రఘు నేను నీకు నో చెప్పలేను అలాగని యెస్ కూడా చెప్పలేను..
అర్ధం కాలేదు..??

నువ్వంటే నాకు ఇష్టమే...కానీ నా జీవితానికి సంబంధించిన ఏ విషయం అయినా మా తల్లిదండ్రులు నిర్ణయించాల్సిందే..నేను లవ్ చేసి అది వాళ్లకు నచ్చక పారిపోయి పెళ్ళిచేసుకోటాలు,ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల పరువు తీసి వాళ్ళు తల ఎత్తుకోకుండా చెయ్యటాలు ఈ ప్రోసెస్ ఏ నాకు చిరాకు..అందుకే మా పేరెంట్స్ ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు..

   ఇప్పుడు నీ మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది హారిక..లవ్ చేసి పారిపోయే వాళ్ళను చూశాను కానీ తల్లిదండ్రుల పరువు పోతుంది అని ఆలోచించే వాళ్ళు కొందరే వుంటారు ఆ కొందరిలో నేను లవ్ చేసిన అమ్మాయి ఉండటం నాకు ఎంతో ఆనందంగా వుంది..
జాబ్ రాగానే వొచ్చి మీ నాన్నగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను..

                 *  2014 సెప్టెంబర్ *

ఈ సాఫ్టువేర్ జాబ్ లను నమ్మటమే పాపం అయిపోయింది.. రెండు సంవత్సరాలు గడిచినా జాబ్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది..జాబ్ లేకుండా ఏమని అడగను మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అని..పోషించటం చేతకాని నాతొ సంసారానికి పంపండి అని..

హారిక ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అని చెప్పింది.. ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.

ఇక వెళ్లి హారిక వాళ్ళ నాన్నకు జరిగినది చెప్పి కొంచెం గడువు అడుగుదాం అని  బయలుదేరాను..నేను హారిక ఫ్రెండ్ గా వాళ్ళ నాన్నగారికి పరిచయమే..

హలో అంకుల్ ..!
హా రావోయ్ రఘు ..ఏంటి ఈ మధ్య బొత్తిగా రావుటమే మానేశావ్..
మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంకుల్..
దేనిగురించోయ్..??

మీ అమ్మాయి గురించి..
మా అమ్మాయి గురించా అతని ముఖం మీద ఆశ్చర్యార్థకం క్లియర్ గా కనిపిస్తుంది..

జరిగిన విషయం, జాబ్ కోసం పడిన పాట్లు, మీతో ఈ విషయం చెప్పటానికి పడిన మనోవేదన, పూసగుచినట్టు వివరించాను..

ఐతే ఇప్పుడు నీకే దిక్కులేదు నా  కూతుర్ని పెళ్లి చేసుకొని ఆమెను పోషించాలి అంటే నీకు జాబ్ కావాలి అప్పటివారకు నా కూతురికి పెళ్లి చెయ్యకుండా ఉండాలి..నీకు జాబ్ వొచ్చేవరకు గడువు ఇవ్వాలి అంతే కదా ??

 సరే ఇది చెప్పు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు..వెనకాల ఎమన్నా ఆస్తులు ఉన్నాయా..
నాన్న చిన్నప్పుడే పోయారు..అమ్మ కూలి పని చేసి నన్ను చదివించింది..

ఒకవేళ నీకు జాబ్ రాకపోతే ??

ఒక వేళ వొచ్చినా కానీ.. వొచ్చిన కొంచెం శాలరీలో మీ అప్పు తీర్చటానికి సగం..మీరు బ్రతకటానికి సగం ఇంకా మా కూతుర్ని ఏం పెట్టి పోసిస్తావు..దాన్ని పస్తులు ఉంచుతావా..

నా రేంజ్ ఏంటో తెలుసా నీకు ..ఈ స్టేట్ లొనే ఒన్ అఫ్ ది బెస్ట్ లాయర్ ని, నా స్టేటస్ చూసి MLAలు MP లు నా కూతుర్ని తమ కోడలిగా చేసుకునేందుకు క్యూ కడుతున్నారు..

చిన్నపటి నుండి నా కూతురు ఏం కావాలంటే అది చిటికెలో ఎంత ఖరీదు అయినా సరే చిటికెలో తెచ్చి ఇచ్చే వాడిని..

నువ్వు ఇవ్వగలవా అలా..
నువ్వు చూసుకోగలవా నాలా..
ఏం చెయ్యగలవు నువ్వు నా కూతురు కోసం..

నాకు డబ్బు లేకపోవొచ్చు, మీ కూతురు అడిగింది నేను ఇవ్వలేక పోవొచ్చు..కానీ మీకంటే బాగా చూసుకుంటాను అని మాత్రం చెప్పొచ్చు..

ఎలా చెప్పగలవు...???

NEXT EPISODE WILL BE UPDATED SOON..
                                      
                                         రచన
                                      రఘు చౌదరి

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts