SUNDAY న మండే ఎండలో బైక్ మీద వెళ్తున్న నన్ను చక చక వొచ్చి డీ కొట్టింది ఒక ap లారి. . డీ కొట్టిన మరుక్షణం గాలిలోకి విసిరిన బంతిలా ఎగిరి క్రిందపడే ఆ క్షణం నేను ఎప్పటికి మరిచిపోలేని నా చిన్ని జీవితం నా కనుల ముందు మెదిలింది . . . నాకు అంతిమ గడియలు సమీపించాయని కుడా ఆ క్షణమే అర్ధం అయింది.
నా పేరు కృష్ణ. . . ఇది మీ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ.
అది నేను 10th క్లాస్ చదువుతున్న రోజులు స్కూల్ కి bye చెప్పి నా తొట్టిగాంగ్ తో కలిసి పిట్టగోడ మీద కూర్చొని వొచ్చే,పోయే లవర్స్ ని చూస్తూ ఆ కత్తి లాంటి అమ్మాయి ఆ కరివేపాకు గాడి ఫేస్ కి ఎలా పడిందిర, చీ దీనమ్మ జీవితం మనకి ఎప్పుడు అమ్మాయిలు పడుతారు అంటు పని లేని మేము అలా పనికిరాని మాటలతో కాలం గడిపే వాళ్ళం. అలా అంటున్న నన్ను మా స్నేహితులలో ఒకడు ఎప్పుడు లవ్, లవ్ అంటూ వుంటావు ఎప్పుడో నువ్వు దీనికి తగిన శిక్ష అనుభవిస్తావు, అయిన కలెక్టర్ అవ్వాలనేది నీ గోల్ కదా
దాన్ని వోదిలేసి ఈ అమ్మాయిల గొడవ ఎందుకురా నీకు అని అడిగాడు.
దానికి సమాధానంగా..!
స్కూల్ నుండి ఇంటికి రాగానే బోర్ కొడుతుంది అదే లవ్ లో వుంటే పార్క్ ల వెంట తిరుగుతూ ,సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు చెపుకుంటూ టైం పాస్ చెయ్యొచ్చు కదా అందుకే నాకు లవ్ అంటే చాల ఇష్టం. లవ్ టైం పాస్ అనుకుంటున్న నాకు ఆ లవ్వే నా టైమింగ్ ని మార్చేస్తుందని అర్ధం ఐన రోజు. .
aug 26th 2005:-time 12:00am ఇవాళ నా bithday ఈ రోజు దేశం మొత్తం సెలవు ప్రకటించాలి అంటూ నా ఫ్రెండ్స్ తో హాస్యం చేస్తున్న time లొ...🙇🙇🙇
ఎవ్వరో.... ,ఎవ్వరో... అంటూ నా ఫోన్ మోగింది
hello..
happy bithday కృష్ణ అంటూ శ్రేయగోశల్ లాంటి voice తో ఒక అమ్మాయి ఆ voice వినగానే నా గుండెల్లో అలారం మ్రోగింది. తెలిసిన అమ్మాయి ఫోన్ చేస్తేనే సినిమాలో సైడ్ కారెక్టర్ దొరికినంత ఆనందపడే నేను. . . ఆ అమ్మాయి voice విన్న తర్వాత రాజమౌళి సినిమాలో ఏకంగా హీరో కారెక్టర్ దొరికినంత ఆనందంగా వుంది నాకు
ఎవరు :-
my name is ' no name '
అని ఫోన్ కట్ చేసి నా గుండెని బ్రేక్ చేసింది ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకున్న మార్నింగ్ లేచే సరికే సూర్యుడు మండిపడుతున్నాడు. post అంటూ గార్జిల్లా గొంతుతో పోస్ట్ మెన్ . email రోజుల్లో లెటర్ crazy, crazy ఫీలింగ్ తో క్రేజీ గా ఓపెన్ చేసా birthday లెటర్ అని రాసి క్రింద మాత్రం నేను ఊహించని విదంగా లవ్ లెటర్ .
హాయ్ కృష్ణ నేను నిన్ను లవ్ చేస్తున్నాను కానీ లవ్ అంటే కేవలం టైం పాస్ అనుకునే మనస్తత్వం నీది అంతే కాకుండా మీ డాడి ఒక సాదారణ మెకానిక్ అలాంటి కుటుంభములో వున్న వాడిని లవ్ చేసానంటే మా డాడి అసలు ఒప్పుకోడు . . . మా డాడి కి మన లవ్ విషయం చెప్పాలంటే నువ్వు ఏదైనా మంచి position లో వుండాలి ఎలాగు కలెక్టర్ కావాలన్నది నీ గోల్ కాబట్టి బాగా చదివి IAS అవ్వు. అప్పటి వరకు నీకు నా గురించి ఎం చెప్పను కానీ ఎప్పటికి నిన్నే లవ్ చేస్తూ వుంటాను నువ్వు నీ గోల్ ని అందుకున్న రోజు నేనె నీ ముందు కు వస్తాను.
ఇట్లు
no name
ఆ లెటర్ చూసి నన్ను అంతలా లవ్ చేస్తున్న అమ్మాయిని చూసి ఆనందపడాలో లేక ఆశ్చర్యపోవాలో నాకు అర్ధం కాలేదు .
చూస్తూ వుండగానే exams స్టార్ట్ అవ్వటం result రావటం ఒక కలలా జరిగిపోయింది. .
మా స్కూల్ topper..!
చాల ఆడుతూ పడుతూ వున్న నా జీవితంలో సడన్ గా అవాక్కయ్యే సంగటన. . . హార్ట్ఎటాక్ తో మా డాడి మరణం. . . . . ఫ్యామిలీ కష్టాలు అన్ని నా బుజం పైన వేసుకున్న ఉదయం పేపర్ బాయ్ లా సాయంత్రం మెకానిక్ లా సూర్ర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నాకు అలుపె లేదు. . . కాలేజీ లో చేరటానికి డబ్బు లేక చదువు మానేద్దాం అనుకుంటున్నా రోజుల్లో మళ్ళి ఆ అమ్మాయి దగ్గర నుండి లెటర్ with moneyorder .... నువ్వు ఎట్టి పరిస్తితుల్లో నీ చదువును మానకూడదు నీకు నేనున్నా అంటూ 50,000/-రూపాయలు.... నీ మీద నాకు నమ్మకం వుంది ఈ డబ్బు తో ముందు కాలేజీ ఫీజు కట్టు నీకు ఊరికే తీసుకోవటం ఇష్టం లేకపోతె అప్పుగా తీసుకో నువ్వు ias ఐన తర్వాత నీ దగ్గర నుండి నేను తీసుకుంటా. . . మళ్ళి నా లక్ష్యం వైపుకు నన్ను అడుగులు వేసేలా చేసింది ఆమె.ఓడిపోతున్నాను అనుకున్న ప్రతీసారి నీకు నేనున్నా అని దైర్యం చెప్పేది ... ఆ అమ్మాయిని కనిపెట్టటం కోసం చాల ప్రయత్నాలు చేసా కానీ ప్రతీసారి వేరు,వేరు నంబర్స్ నుండి కాల్స్,లెటర్ మీద నో అడ్రస్..., కానీ ఓడిపోయా.....
'కాలంతో మారె లవ్ మనకొద్దు కాలాన్ని కూడా మార్చే లవ్ మనకు ముద్దు ' అంటూ మా నాన్న నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి . . . నాకు లవ్ అంటే timepass కాకుండా మునిగిపోతున్న వాడిని కాపాడే ఒక హస్త్రం లా అనిపించింది ఆ క్షణం నుండి . . అ అమ్మాయి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనె ఏ కష్టం వొచ్చిన ఎదిరించి పోరాడా. . ఆ అమ్మాయిని చూడకుండానే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఏర్పడింది. . ఆమెనే తలుచుకుంటూ కస్టపడి చదివి అతి చిన్న వయసులో ias ఐన మొదటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచా.
ఫోన్ మోగింది. . . . . . . . . . . . . congrats ias అయ్యావని తెలిసింది. రేపు నీ birthday కాదా అంతే కాకుండా నువ్వు కలెక్టర్ గా ఛార్జ్ తీసుకునేది కూడా రేపే కాబట్టి ... అందుకే నీకిచ్చిన మాట ప్రకారం రేపు సాయంత్రం రెస్టారెంట్ లో మనం కలుద్దాం అని చెప్పింది
నా ఆశ, ఆశయం,యిన్ని రోజుల కళ నెరవేరే రోజొచ్చింది
2012 aug 26th కలెక్టర్ గా ఛార్జ్ తీసుకొని ఆ అమ్మాయిని కలవటానికి వెళ్తున్న టైం లో. . . . ..
>>>👞👞👞👞👞👞
>>.>
ఇలా accedent అయింది
కనులు తెరిసే సమయానికి హాస్పిటల్ లో నేను నా పక్క బెడ్ లో మా 10th క్లాస్ అమ్మాయి రాధ . . . పక్కన వున్న మా అమ్మతో ఆ అమ్మాయికి ఏమైంది అని సైగ చేసా .... ఆ అమ్మాయి నిన్ను 7 ఇయర్స్ గా లవ్ చేస్తుంది అంట నీకు accedent ఐంది అన్న మరుక్షణం పట్టరాని దుక్కము తో హాస్పిటల్ కి వొచ్చింది.. . accident లో నీ రెండు కిడ్ని లు పాడయ్యాయి డాక్టర్ లు బ్రతకటం కూడా కష్టం అంటున్న సమయం లో తను వొచ్చి కిడ్ని ఇస్తా అనటం తన కిడ్ని నీకు మ్యాచ్ కావటం జరిగింది. . .future లో ఒక కిడ్ని తో వుండటం చాల కష్టం అని డాక్టర్ లు చెప్పిన వినలేదు.... ఇన్ని రోజులు నన్ను లవ్ చేసింది ఇంకా చేస్తూనే వుంది మా 10థ్ క్లాస్ అమ్మాయి అది తలుచుకోగానే ఆశ్చర్యం వేసింది.. . .
నెలకు ఒక boyfriend ని మారుస్తున్న ఈ రోజుల్లో నన్ను కలవకుండా,ఎప్పుడు నన్నే తలుచుకుంటూ 7 ఇయర్స్ గా లవ్ చేస్తుంది..... ఆ అమ్మాయి కిడ్ని కాదు కాదు అవసరం ఐతే తన ప్రాణాన్ని కూడా ఇస్తుంది అది ఆ అమ్మాయి గొప్పతనమో లేక నా గొప్పతనమో కాదు అది కేవలం లవ్ లో ని మేజిక్...
లవ్ అంటే ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రా లు వేసుకొని తాగటం కాదు అవసరమైతే ఒకరికోసం ఒకరు ప్రాణాలైన ఇవ్వటం .....
రచన
----------------------
రఘు చౌదరి (8686482562)
Good
ReplyDeleteTnq anna
ReplyDeleteTnq anna
ReplyDeleteVery Nice..
ReplyDeleteTnq
ReplyDeletenice!!
ReplyDeleteTnq akka
ReplyDeletekeka ra nuvu superrrrrrrrrrrrr
ReplyDeleteHeyy akhil tnq tnq
ReplyDeleteNyc one bro...
ReplyDeleteTnqq akhil
ReplyDeletesimply superd. No more words. God bless you
ReplyDeleteTnq tnq Uppi anna
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGood story but antha auto biography la undhi,
ReplyDeleteTnq huntingeye
ReplyDelete