Thursday 1 September 2016

అంకుశ పోరాటం 💪💪

నా పేరు హర్ష..!
ఆడుతూ,పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసి US వెళ్ళి MS చేస్తే జీవితం బాగుంటుంది అనిపించి తొలిసారి మా నాన్న గారి మాటకు అడ్డు చెప్పి యిక్కడకు వోచ్చాను..
AUG 26 - 2002
ఉదయం నుండి వెలుగు యిచ్చి,యిచ్చి అలసిపోయి అస్థమించటానికి సూర్యుడు రెడీగా వున్నాడు.. అలాంటి వినూత్న సమయంలో అమ్మ కాల్ చేసి తేరుకోలేని విషయం చెప్పింది..కొంచెం దుఃఖం,కొంచెం బాధ రెండు కళగలిసిన కంఠంతో మావోయిస్ట్ లతో కలిసి దేశాన్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు అని నాన్నను పోలీస్ లు అరెస్టు చేసారు నువ్వు త్వరగా రా అంటూనే ఫోన్ కట్ చేసింది..
  మా నాన్న గారి పేరు రమణ.ఆరడుగుల మంచితనానికి ప్రాణం పోసి మనిషిగా చేస్తే ఎలా వుంటాడో అలా వుంటాడు,పేదలకు ఏ చిన్న కస్టము వొచ్చినా తను సహించడు,అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నాడు మా నాన్న.15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో ఆయన రెండు కాళ్ళను పోగొట్టుకున్నాడు,అప్పటి నుండి ఒక చిన్న కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు..సపోర్ట్ లేకుండా ఒక్కడే ఎక్కడికి వెళ్ళలేడు..అలాంటి ఆయన మావోయిస్ట్ లతో చేతులు కలపటం ఏంటి అని ఆలోచిస్తూ TV ఆన్ చేసాడు..
మీ భర్త పేదలకు చాల సహాయం చేసాడు,అలాంటిది మావోయిస్ట్ లతో చేతులు కలిపారు అంటున్నారు నిజమేనా అని మీడియా వాళ్లు ప్రశ్నలతో ముంచేశారు అమ్మని.
ఆయన గాంధీగారికి వీరాభిమాని ఏ సమస్య వొచ్చిన అహింసతోనే ఎదుర్కోవాలి అని చూసేవారు అంటు అమ్మ వారి ప్రశ్నలకు,జవాబులు చెప్పటం మొదలుపెట్టింది. చిన్న తనం నుండి పేదరికంలో పెరగటం వల్ల పేదవారికి ఏ చిన్న సమస్య వొచ్చిన ముందుంటారు..సరిగ్గా 5 నెలల క్రీతం ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వచ్చిన వరదలు వల్ల చాల ఆస్థి నస్టము చాల ప్రాణాలు బలి అయ్యాయి..
అది విని వాళ్ళను పరామర్శించటానికి భయలుదేరాడు..అనేక ప్రాంతాలు తిరిగాడు అన్ని ప్రాంతాల్లో పేదవాడిని ఆధారంగా వున్న గుడిసెలు చెల్లా,చేదురయ్యాయి..వుండటానికి ఇళ్ళు లేక చెట్టు,పుట్టల కింద తలదాచుకుంటున్నారు..




1998 : - పేదవాళ్ళు కనీస వసతి గ్రుహము లేక అవస్థలు పడుతున్నారు వారి గ్రుహ నిర్మాణానికి గాను 500 కోట్లను ప్రబుత్వం మంజూరు చెయ్యటం జరిగింది ఇక అందరికీ పక్క ఇల్లు వుంటాయి అని చెప్పటం జరిగింది..ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది..కనీసం ఏ ప్రాంతం లోను గ్రుహ నిర్మాణ పథకం అమలు కాలేదు..రమణ వాళ్ళ  కస్టాలు చూసి తట్టుకోలేక పోయాడు.. 5 నెలల క్రితం 52 మంది సబ్యులతో కలిసి పేదవానికి న్యాయం జరగాలి అంటు ఉద్యమాన్ని మొదలుపెట్టారు..ఎంతో మంది భయపెట్టి చూసారు కాని ప్రాణాలు ఇవ్వటానికి అయిన సిద్దంగా వున్న రమణ భయపడలేదు..
యింతలో అరెస్టు అంటు యిలా జరిగింది..హర్ష రెండు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నాడు..ఆ 52 మంది  ఉద్యమకారులతో కలిసి తన తండ్రి ని బయటకు తీసుకొని రావటానికి ఎంతో కస్ట పడ్డాడు,కోర్ట్ చుట్టూ తిరిగాడు కాని ఫలితం మాత్రం శూన్యం..

రమణను మావోయిస్ట్ లు,టెర్రరిస్ట్ లు వుండే భయంకరమైన కోడిగుడ్డు ఆకారం లో వుండే అండా జైలులో వుంచి 2 సంవత్సరాల పాటు కుంటివాడు అని కూడా చూడకుండా చిత్ర హింసలు పెట్టి యిక ఆరోగ్యం అంతంత మత్రమే వుండటంతో వోదిలేసారు..
ఏమైంది నాన్న అసలు నిన్ను ఎందుకు అరెస్ట్ చేసారు అని హర్ష అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేదవాళ్ళ గ్రుహ నిర్మాణానికి ప్రబుత్వం ప్రకటించిన నిధుల్లో MLA,MP లు కలిసి వారి విన్యాసాలకు వినియోగించుకున్నారు..నా ఉద్యమం వారిని ప్రశ్నించి ప్రబుత్వం పడిపోయే వరకు వొచ్చింది అందుకే వాళ్ళు అందరూ కలిసి నన్ను మావోయిస్ట్ లతో సంభoదాలు వున్నాయి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే అంత వరకు నన్ను జైల్లో వుంచి చిత్రహింసలు పెట్టి వోదిలేసారు..
నా తర్వాత నువ్వే ఆ పేదవాళ్ళకు అండగా వుండాలి అని చెపుతూ నా సమాదానం కోసం వేచిచూడకుండా తుదిశ్వాస విడిచారు..
ఆయన మరణానంతరం ఆ 52 ఉద్యమ కారులతో కలిసి అహింస తో కాకుండా హింసతో నేను ఉద్యమం మొదలుపెట్టాను..దీనికి కారణమైన ముగ్గురు MLA లను ఒక MP ని చంపేసాము..దానితో మిగిలిన వాళ్లు భయపడి పేదవాళ్ళ డబ్బును వాళ్ళకి చేరకుండా మా ప్రబుత్వం వాళ్ళే కాజేసి అడిగినందుకు రమణ గారిని చెయ్యని నేరానికి జైలు పాలు చేసాము అని ఒప్పుకోని పేదవాళ్ళ gruha నిర్మాణానికి కావలిసిన డబ్బును రిలీస్ చేసారు..
పేద వాడి కస్టాన్ని తీర్చక పోయిన పరవాలేదు కాని వాళ్ళ కస్టానికి మాత్రం కారణం కావోద్దు..
అన్ని సార్లు అహింస తోనే సమస్యలను పరిస్కరించటం అనేది పొరపాటు.కొన్ని సార్లు అహింస తో కాని పనులను హింస  చేసి చూపెడుతుంది..
ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండి లేకపోతే మీరు ఓటు వేసిన వాడే తర్వాత తర్వాత మీ ఆకలి కేకలకు కారణం అవుతాడు..
                          
                                       రచన
           
                                  రఘు చౌదరి

3 comments:

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts