Monday, 27 March 2017

Y టూ Y

                    
                     Y టూ Y 
కామం..మోహం.. అనేవి ప్రాణం వున్న ప్రతి జీవికి వుంటాయి. అది మనిషి అయిన,దేవుడు అయిన,చివరికి యముడు అయినా..
యమలోకం -
తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం త్రిమూర్తులకు అయినా అడ్డుగా నిలుస్తాడు,శక్తిలో,యుక్తిలో యమున్ని తలదన్నే వాడే లేడు అన్నది ప్రతీతి.అలాంటి యముడు కూడా ఒక స్త్రీ వలన భూలోకానికి వొచ్చి అష్ట కష్టాలను పడ్డాడు..దేవాదిపతి ఇంద్రునికే స్త్రీ వలన ఎన్నో సమస్యలు వొచ్చాయి అలాంటిది యముడెంత..
    మొదటి సారి నరకలోకాన్ని 2000 సంవత్సరాలు ఏక ధాటిగా పరిపాలించిన మొదటి యముడిగా చరిత్ర సృష్టించాడు నరకాధిపతి..   ఆ ఆనందంలో నరకలోకపు కట్టుబాట్లకు విరుద్ధంగా చిన్న పార్టీని ఏర్పాటు చేశాడు..ఆ పార్టీ కి యమలోకం లో వున్న భటులను, పాపులను కూడా ఆహ్వానించాడు.. భటులు,పాపులు చివరికి యముడితో సహా యమలోకం మొత్తం మద్యం మత్తులో జారిపోయి నృత్యం చేస్తున్నారు..
  స్వర్గలోకం లో వున్నవారు కూడా తొలిసారి నరకలోకానికి రానందుకు  బాధపడ్డారు.. తాగిన మత్తులో యమలోకం మొత్తం గుండ్రంగా  తిరుగుతున్నట్లు అనిపించింది యముడికి.. అలా తిరుగుతూ,తిరుగుతూ ఉండగా యముడి దృష్టి పాపుల్లో వున్న స్త్రీ మీద పడింది. ( అందమైన అమ్మాయి గురించి అబ్బాయిలకు ఒకళ్ళు చెప్పాలా ఏంటి మనకు కూడా తెలియకుండానే మన చూపు వారి వైపు వెళ్తుంది.). ఆమె పేరు మాయ..వయస్సు 30 - 35 సంవత్సరాల మధ్య ఉంటుంది.. నరకానికి వొచ్చి 20 రోజులు అవుతుంది.. పెద్ద రంగు కాదు కాని నరక లోకపు నీళ్లు పడటంతో కొంచెం రంగు తేలింది..
అంత అందమైన అమ్మాయిని చూశాక యముడు తన భాజ్యతలని, పదవిని మరిచి..పాదాలని వంకర టింకరగా వేసుకుంటూ వొచ్చి ఆ పాపులలో వున్న మాయ చీర పట్టుకు లాగాడు.
  దిక్కులన్నీ దద్దరిల్లేలా, ముక్కోటి దేవతలకు వినిపించేలా ప్రభూ అని కేక పెట్టింది..వేంటనే ప్రత్యక్షమయ్యాడు అందరి తలరాతలతో ఆడుకునే బ్రహ్మ..! ఈ సారి యముడితో ఆడుకోటానికి..
ఓరి యమా..!
యముడివనే అహంకారంతో , నరకలోకాపు కట్టుబాట్లకు విరుద్ధంగా స్త్రీ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు నవ్వు తక్షణమే  నీ పదవి వొదిలి,యామిని అనే పేరుతొ ఒక ఆడదానిగా భూమి మీద నీ జీవితాన్ని గడపుగాక అని శాపం పెట్టాడు.
దీనితో యముడు క్షమించు ప్రభు అహంకాయంతో,కామంతో తప్పు చేశాను దానికి అంత పెద్ద శిక్ష తగదు ప్రభు అని బ్రతిమిలాడడు.
యముని మాటలకు కరిగిపోయిన బ్రహ్మ...సరే నా మాటని వెనక్కు తీసుకోటం సాధ్యం కాదు కాని ఒక 1000 రోజులు నువ్వు శక్తులు అన్ని కోల్పోయి భూమి మీద ఆడదానిలా జీవించు స్త్రీ యొక్క కష్ట సుకాలు నువ్వు తెలుసుకోవాలి..అప్పుడే వాళ్ళ బాధలు నీకు అర్ధం అవుతాయి.
1000 రోజులు పూర్తి అయ్యాక నువ్వు మళ్లీ యముడిగా భాద్యతలు తీసుకోవొచ్చు..అప్పటి వరకు నీ కుమారుడు నందనుడు యముడిగా ఉంటాడు..అంతే కాకుండా నీకు అత్యంత అవసరమయినప్పుడు అదృశ్యామయ్యే శక్తి ని  ఇస్తున్నాను దీనిని కేవలం నాలుగు సార్లు మాత్రమే పనిచేస్తుంది..
      
     హైదరాబాద్ : -
   
  సమయం రాత్రి 11 గంటలు... 6 అడుగుల ఎత్తు మోహంలో క్రూరత్వం తో పాపులను వొణికించే యముడు ఇప్పుడు భూలోకంలో రంభ లాంటి ముఖ ఛాయ.. ఊర్వసి లాంటి ఉర్రుతలూగించే నడుము..మేనక లాంటి సొగసు..కాలగలిసిన అందగత్తె లా కుర్రకారును కవ్వించేలా మారాడు..
  ఆకలి దహించి వేస్తుంది..ఏం తినాలో అర్ధం కావటం లేదు..ఎక్కడకు వెళ్లాలో అర్ధం కావటం లేదు ...ఎటు చూసినా భవంతులు,వాహనాలు కోరుక్కు తినేలా చూస్తున్న మొగాళ్లు.. ఒక మైలు దూరం నడిచాక ఒక పెద్ద హోటల్ లో అందరు భోజనం చేస్తూ కనపడ్డారు..వెళ్లి తాను కూడా తిన్నది..డబ్బులు అడిగితె డబ్బులు అంటే అని అడిగింది..
డబ్బులు అంటే ఏమిటో తెలియదా..ఏ దేశం మనది..
ఇంతకీ నీ పేరు ఏంటి..
 యమలోకం... నా పేరు యామిని.
డబ్బులు లెవ్వు అంటున్నావు మరి లోపలికి వొచ్చి పిండి రుబ్బు..పిండా..
ఇంతకీ టైటిల్ పేరు చెప్పలేదు..చెప్పా కదా                     Y  టూ Y అని ....అంటే
        యమా టూ యామిని
తర్వాత ఏం జరిగింది..యముడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..
NEXT EPISODE UPDATED SOON..
                                       రచన
                                   రఘు చౌదరి

No comments:

Post a Comment

ఎవరినైనా ప్రేమిస్తున్నావా ??

ప్రేమ..రెండు అక్షరాల పదమే కాదు రెండు మనసుల కలయిక కూడా..మనం ఎన్నో ప్రేమ కథలను సినిమాల్లోనూ నిజజీవితంలో ను చూస్తుంటాము..కొన్ని ప్రేమ కథలు మన...

most popular posts