Sunday, 27 March 2016

💘 లవ్ టిప్స్ 💚

ప్రయాణీకులకు విజ్ఞప్తి ట్రైన్ నంబర్  08686 హైదరాబాద్ నుండి ముంబాయి వెళ్ళవలిసిన ముంబాయి express మరికోద్ది క్షణాల్లో 2వ నంబర్ ఫ్లాట్ ఫాం నకు వోచ్చుచున్నది..
     ఆ ట్రైన్ కోసం 2 గంటల నుండి 2 వ నంబర్ ఫ్లాట్ ఫాం లొ ఎదురుచూస్తున్న నేను , ట్రైన్ రాగానే 2 seconds లొ నా సీటులో చేరాను..
నా ఫోన్ లొ కాజల్ కంటే ఎక్కువ అనుష్క కంటే తక్కువగా వున్న అమ్మాయి ఫోటో చూసి గాడిద లాంటి గొంతుతో గోరంగా ఏడుస్తున్న నన్ను ఏమైందో చెప్పమని  ఎన్నెన్నో ప్రశ్నలతొ  ముంచెశాడు నా తోటి ప్రయాణికుడు పరమానందం.. . . . . .
                       కంటిలో నుండి పొంగుకుంటు వస్తున్న నర్మద ని బలవంతంగా ఆపి ఒక్కసారి గతంలోకి వెలితే..... .
2 నెలల క్రితము 
నీళ్ళు లేని బావిలో దూకి సూసైడ్ చేసుకోటానికి రేడీ గా వున్న నన్ను బరబర శబ్దం చేసే బుల్లెట్ మీద 1కి వొచ్చి చక చక వెనక్కి లాగాడు గౌతమ్ నంద....
ఏమైంది సూసైడ్ చేసుకోటానికి కారణము ఏంటి అని నేను నిలుచున్న చోటునె నన్ను నిలదీసాడు......
నేను :-) ఒక అమ్మాయి కోసం...
  
     -) అది తెలుస్తూనే వుంది.... ఏమైంది లవ్ ఫేల్యూర్ రా.. లేక ఆ అమ్మాయికి  ప్రపోజ్ చెయ్యగానే చెప్పుతొ కొట్టిందా ? ?  చెప్పు అని చాల థ్రిల్లింగ్ గా అడిగాడు గౌతమ్ నంద ... .
ఆ అమ్మాయి పేరు ప్రియ నేను 1year నుండి ఆమెను లవ్ చేస్తున్నాను,ఈ రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యటానికి వెళ్తుంటే వాళ్ళ అన్నయ్య గురించి తెలిసింది.వాళ్ళ అన్నయ్య ఒక పెద్ద రౌడీ..చెల్లి వంక ఎవరైన చూస్తే చాలు వాళ్ళకి చావు తప్పదు అంట నేను ప్రపోజ్ చేసినట్టు వాళ్ళ అన్నయ్య కి తెలిస్తే నన్ను చంపేస్తాడు...
అందుకే ఆ అమ్మాయికి  నా ప్రేమ గురించి చెప్పలేక ఆ అమ్మాయిని మర్చిపోలేక.....
          చచ్చిపోదాము అనుకున్నావ్ అంతే కదా.. ఇల చనిపోతే నీది గొప్ప లవ్ అవుతుంది అనుకుంటున్నవ...
దీనికే ఎవరైన సూసైడ్ చేసుకుంటారా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు తెలీకుండా ఆ అమ్మాయిని పడేయటానికి నీకు కొన్ని టిప్స్  నేను చెపుతా అవి ఫాలొ అవ్వు... సరే రేపు ఇదే ప్లేస్ లొ  కలుద్దాం..
అవును ఇంతకీ నీ పేరు ఏంటి  (చందు)
 
లవ్ టిప్స్ నేర్చుకోటానికి ఉదయాన్నే లేచి తలస్నానము చేసి రేడీ అయ్యి గౌతమ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న.ఫోన్ రావటమే ఆలస్యం కాకిలా వాలిపోయాను నా సూసైడ్ ప్లేస్ కి..
   
టిప్ 1 :-   హెల్ప్...  ఆ అమ్మాయికి తెలిసేలా ఎవరికైన హెల్ప్ చెయ్ దానివల్ల అమ్మాయిలు ఎక్కువ impress అయ్యే అవకాశం వుంది.  వెళ్ళు అదే పనిలో వుండు
అవును ఇంతకి మీ కాలేజ్ పేరు,
  చైతన్య డిగ్రీ కాలేజ్... చైతన్య కాలేజా వుండు ఒక ఫోటో తీసుకుంటా మా చెల్లి మధు ది కూడా అదే కాలేజ్ తనకి చెపుతా ఏమైన హెల్ప్ చెయ్యమని...
        హెల్ప్ ఎలా చెయ్యలి అని ఆలోచిస్తూ మా స్నేహితుడు కాలేజ్ లో బ్లడ్ ఇస్తుంటే నేను పక్కన వెళ్ళా.. బాటిల్ బ్లడ్ teesi ఒక బత్తాయి కాయ చేతిలో పెట్టారు.అది మాత్రమ్ నీకు ఎందుకు మామ అని వాడి దగ్గర నుండి ఆ పండు ని లాక్కొని బయటకు వస్తుంటే . . .
అదే టైం లో నన్ను చూసింది ప్రియ.. ఆమెను చూసిన సందడిలొ వుండగా నా కాళ్ళకు ఏదో తగిలి నా చేతిలో వున్న పండు వెళ్ళి పక్కనే అడుక్కునే వాడి ప్లేట్ లొ పడింది...
దానితో ప్రియ వొచ్చి మీరు చాల గ్రేట్ బ్లడ్ ఇవ్వటమే కాకుండా మీకిచ్చిన పండు కూడా దానము చేసారు.మీలా హెల్ప్ చేసేవాళ్ళు అంటే నాకు చాల గౌరవం..నేనే బ్లడ్ ఇచ్చా  అనుకుంది.
friend ఇచ్చిన 1 బాటీ ల్  బ్లడ్ నా 1 year ప్రేమకు నీళ్ళ పోసింది..
మీ పేరు -) చందు
ప్రియ impress ఐన విధానం చూసి నాలో నేనే నవ్వుకున్నాను.. .
టిప్ 1 చాల సక్సేస్ ఐంది
టిప్   2 :-) friendship ఎక్కువమందికి  ఈ దశ నుండే ప్రేమ మొదలవుతుంది.. ప్రేమ అనే పదానికి అసలు పునాది స్నేహము.
Friendship ఎలా చెయ్యలి అనుకుంటూ కాలేజ్ కి వెళ్ళటానికి ఆటో ఎక్కాను.. అందులో ప్రియ చాల టెన్సన్ పడుతోంది... నన్ను గుర్తుపట్టి hiii చెప్పింది.. చేతిలో పర్స్ వుంది బహుశ అందులో చాల మనీ వున్నవి కాబోలు..,. ఆటో చాల ఇరుకుగా  వుంది ఆ సమయం లోనే నాకు ఒక ఆలోచన వొచ్చింది,వొచ్చిన మరుక్షణం ఆ అమ్మాయి పర్స్ లోని మనీ కాస్త కాలి అయ్యాయి..( అవి తీసింది నేనే )
ప్రియ హడావిడిగా దిగి ఫీజు కట్టటానికి వెళ్ళింది చూస్తే కాలి పర్స్...ఆ సమయం లో మనీ తీసుకెళ్ళి ఆటో లో మీ పర్స్ లో డబ్బులు కొట్టేసి  మీ పక్కన వున్న వాడు ముందు స్టొప లోనె దిగాడు వాడిని పట్టుకొని మీ డబ్బులు తెచ్చాను అని అబద్దం చెప్పను..
దానితో మా మధ్య స్నేహము మొదలయింది 
టిప్ 3 :- ప్రపోజ్ ... ఎలా చెప్పాలంటే నువ్వు చెప్పే dialouge కె ఆ అమ్మాయి పడిపోవాలి..,.
మదురం short film dialouge లు అన్ని బట్టి పట్టి ప్రియ ముందు చెప్పాను.
          ( ఆ short film ప్రియ చూడలేదు )
ఆ dialouge లు విన్న తర్వాత ఏ అమ్మాయి  పడదు చెప్పండి..
నా ప్రేమ success అయింది దాంతో నేను,గౌతమ్ టెన్సన్ వొదిలేసి బీర్లు మొదలేసాము..
అవును ఇంతకి మీ ప్రియ ఫోటో నాకు చూపించలేదు... నా ఫోన్ లో ప్రియ ఫోటో చూడగానే గౌతమ్ కళ్ళు ఆది సినిమాలో ntr వి మండినట్లు మండిపోయాయి ...
ఏంట్రా నా చెల్లి మధు ఫోటో చూపిస్తున్నావు. మీ చెల్లి ఏంటి మీ చెల్లి పేరు మధు అన్నావ్ కదా,.. అవును మధుప్రియ..
అంటే ఇన్ని రోజులు నా చెల్లిని పడేయటానికి నేనే టిప్స్ చెప్పనా ఛా.. ఛా
ఇది  జరిగింది అతని నుండి తప్పించుకొని  ఇల ట్రైన్ ఎక్కాను.. నన్ను వెతుక్కుంటూ రానే వోచ్చాడు గౌతమ్ నంద.. కానీ నన్ను చంపటానికి కదు మా పెళ్లి చెయ్యటానికి... నీకంటే నా చెల్లిని ప్రేమించే వాడిని ఎక్కడ తీసుకురాగలను అందుకే మీ పెళ్లి చెయ్యాలని నిర్ణయము తీసుకున్నా.
మా పెళ్లి చాల గ్రాండ్ గా జరిగింది..
14 నెలల క్రితము మన లవ్ కి మా అన్నయ్య అసలు ఒప్పుకోడు నాకు ఏం చెయ్యాలో అర్దంకావటం లేదు...
  మరి పారిపోయి పేల్లిచేసుకుందామ అంటే,మా అన్నయ్య ని వొదిలి నేను రాలేను అన్నది ప్రియ ..
మరి ఎలా మీ అన్నయ్య ని ఒప్పించడం... అని ఆలోచిస్తున్న నాకు ఒక ప్లాన్ తట్టింది. . పైన అనుకున్న విదముగా ప్లాన్ చేసి వాళ్ళ అన్నయ్య చేతుల మీదిగానే  మా పెళ్లి జరిపించాము.
  ఇదంతా నేను ప్రియ అనుకొని చేసిన ఒక ప్లాన్  ట్రైన్ లో పరమనన్దయ్యకి చెప్పింది మేము ఆడుతున్న నాటకమే...
                                 రచన     
                           _______________         
                        
                            రఘు చౌదరి                

Saturday, 13 February 2016

NO NAME

SUNDAY న మండే ఎండలో బైక్ మీద వెళ్తున్న నన్ను చక చక వొచ్చి డీ కొట్టింది ఒక  ap లారి. . డీ కొట్టిన మరుక్షణం గాలిలోకి విసిరిన బంతిలా ఎగిరి క్రిందపడే ఆ క్షణం  నేను ఎప్పటికి మరిచిపోలేని నా చిన్ని జీవితం నా కనుల ముందు మెదిలింది . . . నాకు అంతిమ గడియలు సమీపించాయని కుడా ఆ క్షణమే  అర్ధం అయింది.
నా పేరు కృష్ణ. . . ఇది మీ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ. 
అది నేను 10th క్లాస్ చదువుతున్న రోజులు స్కూల్ కి bye చెప్పి నా తొట్టిగాంగ్ తో కలిసి పిట్టగోడ మీద కూర్చొని వొచ్చే,పోయే లవర్స్ ని చూస్తూ ఆ కత్తి లాంటి అమ్మాయి ఆ కరివేపాకు గాడి ఫేస్ కి ఎలా పడిందిర, చీ దీనమ్మ జీవితం మనకి ఎప్పుడు అమ్మాయిలు పడుతారు  అంటు పని లేని మేము అలా పనికిరాని మాటలతో కాలం గడిపే వాళ్ళం. అలా అంటున్న నన్ను మా స్నేహితులలో ఒకడు ఎప్పుడు లవ్, లవ్ అంటూ వుంటావు ఎప్పుడో నువ్వు  దీనికి తగిన శిక్ష అనుభవిస్తావు, అయిన  కలెక్టర్ అవ్వాలనేది నీ గోల్ కదా 
 దాన్ని వోదిలేసి ఈ అమ్మాయిల గొడవ ఎందుకురా నీకు అని అడిగాడు. 
దానికి సమాధానంగా..!

స్కూల్ నుండి ఇంటికి రాగానే బోర్ కొడుతుంది అదే లవ్ లో వుంటే పార్క్ ల వెంట తిరుగుతూ ,సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు చెపుకుంటూ టైం పాస్ చెయ్యొచ్చు  కదా అందుకే నాకు లవ్ అంటే చాల ఇష్టం. లవ్ టైం పాస్ అనుకుంటున్న నాకు ఆ లవ్వే నా టైమింగ్ ని మార్చేస్తుందని  అర్ధం ఐన రోజు. . 
aug 26th 2005:-time 12:00am ఇవాళ నా bithday ఈ రోజు దేశం మొత్తం సెలవు ప్రకటించాలి అంటూ నా ఫ్రెండ్స్ తో హాస్యం  చేస్తున్న time లొ...🙇🙇🙇
ఎవ్వరో.... ,ఎవ్వరో...  అంటూ నా ఫోన్ మోగింది 

    hello..

      happy bithday కృష్ణ అంటూ శ్రేయగోశల్ లాంటి voice తో ఒక అమ్మాయి ఆ voice వినగానే నా గుండెల్లో అలారం  మ్రోగింది. తెలిసిన అమ్మాయి ఫోన్ చేస్తేనే సినిమాలో సైడ్ కారెక్టర్ దొరికినంత ఆనందపడే నేను. . . ఆ అమ్మాయి voice విన్న తర్వాత  రాజమౌళి సినిమాలో ఏకంగా హీరో కారెక్టర్ దొరికినంత ఆనందంగా వుంది నాకు 
ఎవరు :-
         my name is     ' no name '


అని ఫోన్ కట్ చేసి నా గుండెని బ్రేక్ చేసింది ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకున్న మార్నింగ్ లేచే సరికే సూర్యుడు మండిపడుతున్నాడు. post అంటూ గార్జిల్లా గొంతుతో పోస్ట్ మెన్ . email రోజుల్లో లెటర్ crazy, crazy ఫీలింగ్ తో  క్రేజీ గా  ఓపెన్ చేసా birthday లెటర్ అని రాసి  క్రింద మాత్రం నేను ఊహించని విదంగా లవ్ లెటర్ . 

        హాయ్ కృష్ణ నేను నిన్ను లవ్ చేస్తున్నాను కానీ  లవ్ అంటే కేవలం టైం పాస్ అనుకునే మనస్తత్వం నీది అంతే కాకుండా మీ డాడి ఒక సాదారణ మెకానిక్ అలాంటి కుటుంభములో వున్న వాడిని లవ్ చేసానంటే  మా డాడి అసలు ఒప్పుకోడు . . .   మా డాడి కి మన లవ్ విషయం చెప్పాలంటే నువ్వు ఏదైనా మంచి position లో వుండాలి ఎలాగు కలెక్టర్ కావాలన్నది నీ గోల్ కాబట్టి బాగా చదివి IAS అవ్వు. అప్పటి వరకు నీకు నా గురించి ఎం చెప్పను కానీ ఎప్పటికి నిన్నే లవ్ చేస్తూ వుంటాను నువ్వు నీ గోల్ ని అందుకున్న రోజు నేనె నీ ముందు కు వస్తాను. 

                                                                                                                ఇట్లు 
                                                                                                             no name 


ఆ లెటర్ చూసి నన్ను అంతలా లవ్  చేస్తున్న అమ్మాయిని చూసి ఆనందపడాలో  లేక ఆశ్చర్యపోవాలో నాకు అర్ధం కాలేదు . 
చూస్తూ వుండగానే exams స్టార్ట్ అవ్వటం result రావటం ఒక కలలా జరిగిపోయింది. . 
మా స్కూల్ topper..!
చాల ఆడుతూ పడుతూ వున్న నా జీవితంలో సడన్ గా అవాక్కయ్యే సంగటన. . . హార్ట్ఎటాక్ తో మా డాడి మరణం. . . . . ఫ్యామిలీ కష్టాలు అన్ని నా బుజం పైన వేసుకున్న ఉదయం పేపర్ బాయ్ లా సాయంత్రం మెకానిక్ లా సూర్ర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నాకు అలుపె లేదు. . . కాలేజీ లో చేరటానికి డబ్బు లేక చదువు మానేద్దాం అనుకుంటున్నా రోజుల్లో మళ్ళి ఆ అమ్మాయి దగ్గర నుండి లెటర్ with moneyorder .... నువ్వు ఎట్టి  పరిస్తితుల్లో నీ చదువును మానకూడదు నీకు నేనున్నా అంటూ 50,000/-రూపాయలు....  నీ మీద నాకు నమ్మకం వుంది ఈ డబ్బు తో ముందు కాలేజీ ఫీజు  కట్టు నీకు ఊరికే తీసుకోవటం ఇష్టం  లేకపోతె అప్పుగా తీసుకో నువ్వు ias ఐన తర్వాత నీ దగ్గర నుండి నేను తీసుకుంటా. . . మళ్ళి నా లక్ష్యం వైపుకు నన్ను అడుగులు వేసేలా చేసింది ఆమె.ఓడిపోతున్నాను అనుకున్న ప్రతీసారి నీకు నేనున్నా అని దైర్యం చెప్పేది ...  ఆ అమ్మాయిని కనిపెట్టటం కోసం చాల ప్రయత్నాలు చేసా కానీ ప్రతీసారి వేరు,వేరు నంబర్స్ నుండి కాల్స్,లెటర్ మీద నో అడ్రస్..., కానీ ఓడిపోయా..... 

'కాలంతో మారె లవ్ మనకొద్దు కాలాన్ని కూడా మార్చే లవ్ మనకు ముద్దు ' అంటూ మా నాన్న నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి . . . నాకు లవ్ అంటే timepass కాకుండా  మునిగిపోతున్న వాడిని కాపాడే ఒక హస్త్రం లా అనిపించింది  ఆ క్షణం నుండి . . అ అమ్మాయి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనె ఏ కష్టం వొచ్చిన ఎదిరించి పోరాడా. . ఆ అమ్మాయిని చూడకుండానే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఏర్పడింది. . ఆమెనే తలుచుకుంటూ కస్టపడి చదివి అతి చిన్న వయసులో ias ఐన మొదటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచా. 
 ఫోన్ మోగింది. . . . . . . . . . . . . congrats ias అయ్యావని తెలిసింది. రేపు నీ birthday కాదా అంతే కాకుండా నువ్వు కలెక్టర్ గా  ఛార్జ్ తీసుకునేది కూడా రేపే కాబట్టి  ... అందుకే నీకిచ్చిన మాట ప్రకారం  రేపు సాయంత్రం రెస్టారెంట్ లో మనం  కలుద్దాం అని చెప్పింది 
నా  ఆశ, ఆశయం,యిన్ని రోజుల కళ నెరవేరే రోజొచ్చింది 

2012 aug 26th కలెక్టర్ గా ఛార్జ్ తీసుకొని ఆ అమ్మాయిని కలవటానికి వెళ్తున్న టైం లో. . . . .. 
>>>👞👞👞👞👞👞
>>.>
ఇలా accedent అయింది 
కనులు తెరిసే సమయానికి హాస్పిటల్ లో నేను నా పక్క బెడ్ లో మా 10th క్లాస్ అమ్మాయి రాధ . . . పక్కన వున్న మా అమ్మతో ఆ అమ్మాయికి ఏమైంది అని సైగ చేసా .... ఆ అమ్మాయి నిన్ను 7 ఇయర్స్ గా లవ్ చేస్తుంది అంట నీకు accedent ఐంది అన్న మరుక్షణం పట్టరాని దుక్కము తో హాస్పిటల్ కి వొచ్చింది.. . accident లో నీ రెండు కిడ్ని లు పాడయ్యాయి డాక్టర్ లు బ్రతకటం కూడా కష్టం అంటున్న సమయం లో తను వొచ్చి కిడ్ని ఇస్తా అనటం తన కిడ్ని నీకు మ్యాచ్ కావటం జరిగింది. . .future లో ఒక కిడ్ని తో వుండటం చాల కష్టం అని డాక్టర్ లు చెప్పిన వినలేదు.... ఇన్ని రోజులు నన్ను లవ్ చేసింది ఇంకా చేస్తూనే వుంది మా 10థ్ క్లాస్ అమ్మాయి అది తలుచుకోగానే ఆశ్చర్యం వేసింది..  . . 
నెలకు ఒక boyfriend ని మారుస్తున్న ఈ రోజుల్లో నన్ను కలవకుండా,ఎప్పుడు నన్నే తలుచుకుంటూ 7 ఇయర్స్ గా లవ్ చేస్తుంది..... ఆ అమ్మాయి కిడ్ని కాదు కాదు అవసరం ఐతే తన ప్రాణాన్ని కూడా  ఇస్తుంది అది ఆ అమ్మాయి గొప్పతనమో లేక నా గొప్పతనమో కాదు అది కేవలం లవ్ లో ని మేజిక్... 

లవ్ అంటే ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రా లు వేసుకొని తాగటం కాదు అవసరమైతే ఒకరికోసం ఒకరు ప్రాణాలైన ఇవ్వటం ..... 

                    

                                                          
                                                                                                              రచన 
                                                                                                           ----------------------
                                                                                                          రఘు చౌదరి (8686482562)
                  

Thursday, 10 December 2015

సంజు డైరీ

ఇంట్లో సాఫీ  గా కాఫీ  తాగుతున్న రోజు... ఆ రోజు ఉష్ణోగ్రత 105 డిగ్రీలు అనగా నేను జ్వరం తో కుస్తీ పడుతున్న రోజు.    ఎప్పుడు missed కాల్ ఇచ్చే గౌతమ్ గాడు కాల్ చేసి టెన్షన్,టెన్షన్ గా అరయ్ రామ్ మన సంజయ్ (సంజు)గాడు ఆ అజయ్ గాడిని,నందిత ని ,హత్య చేసి అంతే కాకుండా అంజలి (అంజు ) మీద యాసిడ్ పోసి ఎటో పారిపోయాడు అంట రా ఇప్పుడు అంజలి కోమా లో వుంది  పోలీస్ లు వాడు కోసం వెతుకుతున్నారు.ఇవాళ టీవీ  లో మొత్తం అదే న్యూస్ రా నాకు ఎం చెయ్యాలో అర్ధం కావటం లేదు ......  అని వాడు ఫోన్ కట్ చేసాడు .
  వెంటనే మా tv ని  tv 9 కి  tune చేసా
flash న్యూస్,flash న్యూస్ అంటూ మాకు fever తెపించ్చే న్యూస్.. 
బయట పడ్డ ఆ 2 శవాలని అజయ్ ,నందిత లు గా  గుర్తించారు. ఈ హత్య వెనుక సంజు అంతే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్   రామ్ ,గౌతమ్ ,సాయి లు కూడా వుండవచ్చు  అని మా అనుమానం అని పోలీస్ లు న్యూస్ లో పదే ,పదే చెపుతున్నారు .
ఈ పోలీస్ లు టీవీ లో కనపడటానికి చెపుతారో ,లేక ఏదో చెప్పాలి కదా అని చెపుతారో నాకు  మాత్రం అర్ధం కాలేదు కానీ మా జీవితాలతో మాత్రం అడుకోబోతున్నారు  అని అనుకున్న. 
ఆ న్యూస్   విన్న నాకు  కారిన చెమటతో ఒక చిన్న పాటి చెరువు కూడా  తయారు చెయ్యొచ్చేమో అనిపించింది.. 
... 
... 
సంజు గాడికి కాల్ చేస్తే వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు ఎం చెయ్యాలో  అర్ధం కావటం లేదు 

వెంటనే ఇంకొక కాల్ ఈ సారి కాల్ చేసింది మా మామయ్య అనగా పోలీస్ అజయ్ ,నందిత ల హత్య కేసు లో మిమ్మల్ని interogation  చెయ్యాలి అని. 
అమ్మకి ప్రాజెక్ట్ అని అబద్దం చెప్పి పులి బోను లాంటి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టాం నేను మా ఫ్రెండ్స్..... 

వెళ్లి, వెళ్ళగానే ఆ స్టేషన్ CI హత్యలు బాగానే చేసారు కదరా . చెప్పండి వాళ్ళని మీరు ఎందుకు హత్య చేసారు ,వాళ్ళకు మీకు ఏంటి శత్రుత్వం నిజం చెప్పక పోయారో ఇదే మీ చివరి రోజు అవుతుంది అని మమ్మల్ని బెదిరించాడు ..... 
అది విన్న నేను ఏడుస్తూ సర్ మాకు కోళ్ళని చంపటం అంటే నే భయం సర్ కానీ మీరు మాత్రం ఏకంగా మనుషులనే చంపినము  అంటున్నారు మాకు ఈ హత్యలకు ఎటువంటి సంబంధం లేదు సర్ ...... 

సంజు మేము రూం మేట్స్ వాడు చాల మంచి  వాడు సర్ . 
సంజు  అంజలి 2 years నుండి లవ్ చేసుకుంటున్నారు . నందిత అంజలి ఫ్రెండ్ . మా seniour అజయ్ ది అంజలి ది ఒకటె ఊరు... అజయ్ అంజలిని లవ్ చేస్తున్న అని వేదించే వాడు కానీ ఎప్పుడు అంజలి ఆ విసయాన్ని సంజు కి చెప్పలేదు కానీ ఒక రోజు అజయ్ అంజలికి కాల్ చేసి నన్ను లవ్ చెయ్యకపోతే మీ లవ్ మేటర్ మీ ఇంట్లో చెపుతా అని బెదిరించాడు. 
అంజలి వాళ్ళ నాన్న చాల స్ట్రిక్ట్  ఈ విషయం తెలిస్తే కచ్చితంగా చదువు మనిపిస్తాడు . దానితో ఇక ఓపిక నశించి అంజలి సంజు కి ఈ విసయాన్ని చెప్పింది. దానితో సంజు మేము వాడిని  కొట్టి ,చిన్నపాటి వార్నింగ్ ఒకటి ఇచ్చాం ..

 అప్పుడు వాడు ఎలాగైనా మిమ్మల్ని చంపుత అని కసి గా  అన్నాడు వాడు అన్న మాటల్ని మేము అంతగా పట్టించుకోలేదు  
దాని తర్వాత సెమిస్టరు హాలిడేస్ కి మేము  వోచ్చాం వాడికి సప్ప్లీస్ ఉండటంతో వాడు రూం లో నె వున్నాడు ... మాకు తెలిసింది మాత్రం ఇదే సర్ అని చెప్పాం .. 


ఇంతలో సడన్  గా సంజు కాల్ చేసాడు ...... అన్ని సినిమాల్లో లాగానే మన పోలీస్ లు స్పీకర్ ఆన్ చెయ్యమన్నారు ,రికార్డ్ కూడా చేసారు .. నేను ఏమైంది  సంజు ఏంట్రా రా ఈ  హత్య చెయ్యటం అని అడిగా  ..... 

సంజు :-మీరు sem హాలిడేస్ కి వెళ్ళాక 2డేస్ తర్వాత అంజలి నాకు కాల్ చేసి నేను నందిత బైటకు వెళ్తున్నాం అని చెప్పింది ఎక్కడకి అని అడిగితె ఏమో ఏదో surprise  అని చెప్పింది .సరె వొచ్చాక కాల్ చేస్తా అని చెప్పింది . 


అదే రోజు ఒక గంట తర్వాత మన క్లాస్ అనిల్ గాడు కాల్ చేసి మామ నందిత ని మన seniour అజయ్ ని థియేటర్ లో చూశారా  ఇద్దరు కలిసి మూవీ కి వొచ్చారు   చాల క్లోజ్ గా  వున్నారు అని చెప్పాడు ...  

దానితో నాకు అనుమానం వొచ్చి అంజు లి కాల్ చేసా స్విచ్ ఆఫ్ వస్తుంది ,నందితకు కాల్ చేస్తే అది లిఫ్ట్ చెయ్యటం లేదు . వెంటనే మా ఫ్రెండ్ మధు  వాడు హాకింగ్ కింగ్ వాడి దగ్గరకు వెళ్లి నందిత నెంబర్ ని ట్రేస్ చేయించా  . అది మేము వున్నా ఏరియా కి 30 kmps దూరం వెంటనే బయలుదేరా .  అజయ్ గాడు అన్నంత పని చేసాడు ,వెళ్ళే సరికి అంజలి పేస్ యాసిడ్ తో కాలి పోయింది . అంజు ని రేప్ చేసి పేస్ మీద యాసిడ్ పోసారు . పక్కనే అజయ్ ,నందిత వున్నారు  ....

                                   

s /o  సత్యమూర్తి మూవీ లో అల్లుఅర్జున్ అన్నట్లు నా చేతి లో కత్తి వుంటే వాడి బాడీ పంజాగుట్ట స్మశానం లో వేలాడి  వుండేది ... కానీ ఆ క్షణం  నా  చేతిలో కతి వుంది వాడి బాడీ లో 11 పోట్లు పొడిచా ,పక్కనే వుండి  మోసం చేసినందుకు నందితను కూడా చంపి దాని మీద కూడా యాసిడ్ పోసా . పోలీస్ జీప్ హార్న్  వినపడటం తో అక్కడ నుండి పారిపోయా  . 

పక్కనే వున్న పోలీస్ నా  చెవిలో మనం ఎప్పుడు కలిసే  స్పాట్ లో  కలుద్దాం అని చెప్పమన్నాడు అలాగే చెప్పా వాడు స్పాట్ కి వొచ్చే  సరికి పోలీస్ లు వాడిని చుట్టూ ముట్టారు ... అరస్ట్ చేసి , కోర్ట్ లో హాజరు పరిచారు .. 

కోర్ట్ judgment ఈ సెల్ ఫోన్ లో రికార్డు ఐన దాన్ని బట్టి తన లవర్ మీద హత్య యత్నం  చేసారు అన్న కక్ష  తోనే  వాళ్ళను చంపాడు అని తెలిసింది కానీ ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసింది ఎవరో తలయాదు  .అలా అని సంజు నె యాసిడ్ పోసాడు అని కూడా చెప్పలేం .కనుక  సంజు కి 25 లక్షలు జరిమానా అంతే కాకుండా కటిన కారాగార శిక్ష  విదించటం జరిగింది .  ఒక వేల అంజలి కోమా నుండి  బైటకు వొచ్చి సంజు చెప్పింది నిజమే అని చెపితే 20 years  జైలు శిక్ష   . 

8 years  తర్వాత అంజు కోమా  లోనుండి బైటకు వొచ్చి జరిగిన విషయం చెప్పి సంజు కి శిక్ష  తగ్గించింది ... 

సంజు బైటకు రావటానికి ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి వుంది . 


                 

Wednesday, 11 November 2015

నా తోలిచూపు

నిన్ను చూసే వరకు తెలియదు అందo ఎలా వుంటుందో..
నిన్ను చూసిన  నా కనులకు తెలిసింది ,నువ్వే నా కనుపాప వని
నిన్ను చూసిన ఆ క్షణo
నేను మరిచిపోలేని ఒక జ్ఞాపకం.

                               కవిత -రచన
                            -------------------------
                              రఘు చౌదరి

Wednesday, 4 November 2015

ప్రేమ వ్యద



చెలి నీ స్థానం నా మదిలో
నువు కాదంటే నేనుంటా సమాదిలొ
అవునంటే మనం వుందాo పల్లకీలో 
మన ప్రేమ చిరస్థాయిగా మిగలాలి ఈ జగములో
                                రచన
                         *************
                            రఘు చౌదరి
                                 

Monday, 2 November 2015

Student life

            

ఈ  కథలోని మాటలు  ఎవరినీ  వుద్దేసిన్చినవి కాదు.

స్టూడెంట్స్ అందరు  మాకు చాలా సమస్యలు వున్నాయి   అంటున్నారు అసలు  ఈ  సమస్యలు అనేవి ఎలా వుంటాయో తెలుసుకుందాం.

రేపు exam వుంటుంది  ఇవాళ ఎలాగైనా చదవాలి అని అని కసిగా అనుకుంటాము చివరకి చదువుదామని బుక్  ఓపెన్ చేయగానే అనుకోకుండా ఫ్రెండ్ కాల్ చేస్తాడు.

మామ  మన మహేష్  మూవీ , 1st show కీ టిక్కెట్లు దొరికాయి వెళదాం రమ్మని..అప్పుడు మొదలవుతుంది కన్ఫ్యూషన్..

మూవీ  కీ వెళ్ళాలో లేక చదువుకోవాలో అని 

మీకు తెలుసో లేదో ప్రతి మనిషిలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి.. మంచి వాడు, చెడ్డవాడు అని..

మంచివాడు  : చదువుకో రా రేపు exam వుంది అంటుంటాడు.

చెడ్డ వాడు : మన సూపర్ స్టార్ మూవీరా ఏం  చదువుతావు మూవీ కీ వెళ్ళు అంతకు  కాకపొతే నైట్ఔట్  చెయ్యి అంటుంటాడు.

మనము అందరమూ వింటూనే  వుంటాము మంచి ముందు చెడు ఎప్పటికీ గెలవదు అని కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అవుతుంది.

చెడు ముందు మంచి ఎప్పుడూ గెలవదు.

Show compleate అవుతుంది మన exam  confuse అవుతుంది.

వొచ్చి రాగానే,
త్వర,త్వరగా books ఓపెన్ చేస్తాము.బుక్ ఇలా ఓపెన్ చేశామో లేదో ఫ్రండ్స్ సినిమా  ఎలా వుంది అంటారు.

ఇక ఏముంది  night  ఔట్ కాస్త biscuit అవుతుంధి.
సినిమా కబుర్లు కాస్త సొల్లు కబుర్లు అవుతాయి.
ప్లాన్ morning కి పోస్ట్ పోన్ అవుతుంది..
అలారం పెడతాము,హయ్ గా నిద్ర పోతాము.
Morning 4:00am  కీ alaram మోగుతుంది.
Alaram మోథ మా....... sir అరుపు కన్న ధరిద్రము గా వినబడుతుంది.
అప్పుడు అలారం నెత్తిన  ఒక మొట్టికాయ వేసి దాన్ని ఏ 4:20 కో 4:30 కో పెడతాము.
కానీ నిధ్రలో fail అయ్యాము అని  కళ...చేసేది  ఏమి  లేక లేస్తాము..
ఏధో చదువుతాము  మొక్కుబడిగా...

అసలే టెన్షన్ తో సెంటర్ కి వెళ్ళేసరికి  వాడు ఒకటి వీడు ఒకటి చెప్పి మన బుర్రలో వున్న కాస్త గుజ్జును గుల్ల చేస్తారు.

ఇక Exam start కాగానే మనకీ  టెన్సన్,టెన్సన్ ఎవడైనా చూపించే వాడు వున్నాడో లేధో అని
ఇంకొ టెన్సన్,
పక్కన ఎవరైనా మంచి అమ్మాయి పడిందో  లేధో అని,
ఒక వేళ మంచి అమ్మాయి పడితే మన luck  పడక pothe దాని luck.
Exam రాసి బైటకు వొచామో లేధో
100 కి 90% అడిగే question..
Exam ఎలా రాసావు అని కాదు.
ఇప్పడు ట్రెండ్ మారింది అండోఁయ్
Exam pass aitava
Question దో పాటు ఆన్సర్ కూడ మారింది
పక్క ఫైల్ అసలు ఏమి రాయలేదు మామ.
ఒక వేళ రాసిన కాని  ఇల చెప్పకపోతే కస్టమ్.
Exams compleate అవుతాయి
ఇక  నేడే results అంటుంది jntu.
Results అనగానే బయము స్టార్ట్ అవుతున్ధి
     దానితో పాటే
                  బీరు తాగటం స్టార్ట్ అవుతుంది
Pass ఐతే సంతోషం తో....
ఫైల్ ఐతే బాదతో.కాని తాగటం మాత్రమే comman.
ఇల తాగటం వళ్ళ  బార్ కీ లాబము
తర్వాత doctor కీ లాబము
మనకే చాల nastam.
ఎలానో  కస్టపడి btech compleate  చేస్తాము
ఇంత కస్టపడి pass అయ్యి ఇంటరవ్యూ  కీ వెళ్తే
Percentage ఏంటి అమ్మ  ఇన్థ తక్కువ గా వుంది
కానీ  మనము pass అవ్వటానికి ఎంత కస్టపడ్డామో...
ఇంటరవ్యూ questions
Tell me your BD?
Ans - BD is  also injurious to health sir.
ఇంటరవ్యూ officer అవాక్కు అవుతాడు.
2: What  is resistor ?
 resistor  is a is a....,
Simple questions ఇక మన టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది.
In case your selected, how  much salary expected
      Just 50, 000/- sir
Int  off :
మనం :ఏంటి sir తక్కువ అని ఫీల్ అవుతున్నార
Int off :GET OUT......
ఈ స్టోరీ నేను ఏన్థగనో  . . .  నా G...... కీ అంకితం
               Wtitten by                                      
            **************
               రఘు చౌదరి

Saturday, 17 October 2015

కస్టపడితె కలదు సుకము



Btech అంటె ఒక course అనేదే మర్చిపోయారు.

ఇప్పుడు btech అంటె ఒక style,ఒక fashion ఇల అంటున్నారు అందరు.

ఇలాంటి btech life లోకి ఎప్పుడు సిటీకి కూడా రాని ఒక వ్యక్తి btech చదవటానికి వస్తే అతని life ఎలా టర్న్ అవుతుంది అనేదే ఈ స్టోరీ


                   

అతని పేరు దనయ్య

లాగు వేసుకొని బొట్టు పెట్టుకొని బస్ నుండి పార్వతీశం దిగినట్లుగా  hyd లొ దిగాడు.

మనవాడు గోడ మీద వున్న చార్మినార్ బొమ్మని చూసి అదే చార్మినార్ అనుకున్నాడు

దిగగానే ఆటో వాడు address అడిగాడు..

మన వాడు తోచింది చెప్పాడు.

ఆటో వాడు ,మీటర్ వంద అన్నాడు

అది విని మనవాడు కంగు తిన్నాడు
కానీ చేసేది ఏమి లేక ఇక చలో అన్నాడు.

ఆటో దిగాడు...హాస్టల్ లొ చేరాడు

మనవాడికి lord క్రిష్ణ కలలో కనపడి చెప్పాడు అంట

Ece తీసుకో అమ్మాయిలతో ఆడుకొ అని

కానీ వాళ్ళ చేతిలోనె  మనవాడు ఆట బొమ్మ అవుతాడు అని ఊహించలేక పోయాడు

Btech college అనగానే అందరు

Happy days మూవీ లొ cbit లా వుంటుంది అనుకుంటారు కాని

చేరాక తెలుస్తుంది

అది ibp లొ gurunanak లా వుంటుంది అని

ఇక మొదటి రోజు college అనగానే

అబ్బాయిలను impress చెయ్యటానికి అమ్మాయిలు
అమ్మాయిలను పడేయడం కోస0 అబ్బాయిలు
లేని style ని వున్నట్లు గా చూపిస్తారు

కానీ మన వాడు  మాత్రమ్ shirt,లాగు ఇస్త్రీ చేయించి వాటిని వేసుకొని బొట్టు  పెట్టుకొని బయలుదేరుతాడు

వీడిని చూసి అందరు నవ్వుతారు

అందరినీ చూసి వీడు ఏడుస్తాడు

Classes స్టార్ట్ అవుతాయి

Faculty చెప్పింది వీడికి అర్దం కాదు

వీడు చెప్పింది అసలు ఎవరికి అర్దం కాదు.

అలా చూస్తూ వుండగానే exams వస్తాయి

Question paper చూడగానే మనవాడికి

అందులో questions కి బదులుగా వాడి life paper కనబడుతుంది

ఇక రానే వస్తాయి results...

పోనె పోతాయి 3subjects.

1St మనవాడు ఫీల్ అవుతాడు తర్వాత తనతో పాటు ఇంకో 30మంది వున్నారు అని తెలిసి చిల్ అవుతాడు.

Pass ఐన వాళ్ళ కంటె ఫైల్ ఐన వాళ్ళే షో చెయ్యటం మొదలు పెడతారు
వాళ్ళతో పాటే మనవాడు వుంటాడు

మెల్లిగా మన culture కి  అలవాటు పడతాడు

Style గా అవుతాడు

Gang maintain చేస్తాడు

దనయ్య కాస్త ధను బాయ్ గా మారుతాడు

కస్టపడి చదువుతాడు job కొడతాడు

కంపనీ పెడతాడు.



అందరూ కస్టపడండి కస్టపడితే సాదిన్చలేనిది ఏది లేదు అందుకు మన దనయ్య sorry
మన ధను బాయ్ ఎ example.

                                     రచన

                                 రఘు చౌదరి
  

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts