Sunday 24 June 2018

My writings

సమాధానం లేని సందేహాలే ప్రశ్నలుగా మిగిలిపోతాయి..

      < --------------------------------------------->

కనులను మైమరపించిన అందమా..
మనసును నిద్దుర లేపిన రూపమా..
మనిషికి ప్రాణం పోసిన శిల్పమా..
మరువను నిన్నెప్పుడు..
మరువకు నా గుర్తులు..

    < ------------------------------------------------>
దేవుడు తన వినోదం కోసం భూమి ని దాని మీద నివసించటానికి మనుషులను ఏర్పాటు చేశాడు..భూమిని మొత్తాన్ని టీవీ గా మార్చి తన చేతిలో రిమోట్ పెట్టుకొని ప్రజలు అనే చానల్స్ ను మార్చి మార్చి ట్యూన్ చేస్తూ వారి మధ్య జరిగే సంఘటనలను చూసి తను ఆనందాన్ని పొందుతున్నాడు..అందుకే తనకు నచ్చిన చానల్స్ లోని క్యారెక్టర్ ని ఎక్కువ రోజులు భూమి మీద ఉంచి బోర్ కొట్టిన, విసుగొచ్చిన క్యారెక్టర్ లని తొందరగా తీసుకెళ్తుంటాడు..మనం కేవలం ఆ దేవుడు మార్చినట్టు మారే నిమిత్త మాత్రులమే..

     <----------------------------------------------->
కాలం - ఎప్పటికి ఆగని యంత్రం

కల - నిజ జీవితంలో సాధ్యం కాని పనులను సులువుగా నెరవేర్చే సాధనం.

దేవుడు - ఎవరికి కనపడకుండానే ప్రపంచం మొత్తం పేరు తెచ్చుకున్న వ్యక్తి.

       <---------------------------------------------->
అందం అంటే గుర్తొచ్చేది వెన్నెలలు విరజిల్లి అందరికి కనిపించే ఆ చందమామ అయితే..
నువ్వు తెరవెనుక ఉన్న చందమామవు..

ఇంత పెద్ద విశ్వంలో అనేక వేల గ్రహాలు,నక్షత్రాలు,సౌరకుటుంబాలు,నదులు,  సరస్సులు, పాలపుంతలు ఉండగా నా మెదడు పొరల్లోంచి నీ ఆలోచనలే ఎందుకు బయటకు వస్తున్నాయి..
నా మస్థిస్కం తనలో నీ ఆలోచనలనే ఎందుకు నిక్షిప్తపరుచుకుంటుందో నా మనసుకు అర్థం కావటం లేదు..
భూమి కి ఆకర్షణ శక్తి ఉందని తెలుసు కానీ అది నువ్వు ఉన్న వైపే ఎందుకు ఆకర్షిస్తుందో ఏ శాస్త్రవేత్తకి అంతు బట్టడం లేదేంటో..

నేను నది లాంటి వాడిని..ఆలోచన,ప్రేమ,బాధ అనే ఉపనదులను కలుపుకుంటూ చివరికి సముద్రం లాంటి నీ దగ్గరకే వచ్చి చేరుతాను..

       < ------------------------------------------- >
భార్యను అనుమానించటం రాముడు నేర్పిస్తే..
దొంగతనాలను కృష్ణుడు నేర్పించాడు..
కలహాలు పెట్టడం నారదుడు నేర్పిస్తే..
తల నరకటం శివుడు నేర్పించాడు..
భక్తి ని ఆంజనేయుడు నేర్పిస్తే..
బద్దకాన్ని కుంభకర్ణుడు నేర్పించాడు..

      <------------------------------------------------ >

పుట్టుక అనే 3 అక్షరాలతో మొదలవుతుంది జీవితం..
ఆ 3 అక్షరాల జీవితంలో
ఎన్నో 3 అక్షరాల కష్టాలు
ఇంకెన్నో 3 అక్షరాల సుఖాలు..
ఎన్ని 3 అక్షరాల కష్టాలు,సుఖాలు వోచిన చివరికి మరణం అనే 3 అక్షరాలతోనే ముగిసిపోతుంది ఈ 3 అక్షరాల జీవితం..

#3అక్షరాలజీవితం🙏🙏

    <   ----------------------------------------------- >

నా జీవితం ఒక 50 పేజీల పుస్తకం.
ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేజీ..
అందులోనే ఎన్నో చాప్టర్ లు,ఎన్నో ప్రశ్నలు,ఎన్నో పరీక్షలు..
ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాను కానీ సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ అయ్యాను..
మొదటి 49 పేజీలు నేను రాయగలను..
కానీ ఆఖరి 50 వ పేజీ శుభం ( మరణం ) ఎవరో ఒకరు రాయాల్సిందే..

         < ------------------------------------------>

మనిషి ఆప్యాయత అనే బంధాన్ని మెడలో వేసుకొని పుట్టి..
మాతృ ప్రేమ అనే బంధంతో పెరిగి..
పెళ్లి అనే బంధంతో స్త్రీ కి దగ్గరయి..
నాన్న అనే అనురాగ బంధంతో గర్వపడి..
తాత అనే పిలుపుతో సంతృప్త పడి..
చావు అనే బంధంతో వేరొక లోకానికి వెళ్లిపోతున్నాడు..

          < ------------------------------------------->

మనిషి ఒక్కసారే చనిపోతాడు..
కానీ మనిషిలోని  మనసు మాత్రం కొన్ని వేల సార్లు మరణిస్తూనే ఉంటుంది..

        < --------------------------------------------->
గడియారం చిన్నగానే కనపడుతుంది కానీ దాని లోపల ఉండే కాలమే ఒక జీవితాన్ని మర్చివేయగలంత పెద్దదిగా ఉంటుంది..

No comments:

Post a Comment

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts