Sunday 5 November 2017

రఘు అనే నేను - 5



ఎలా చెప్పగలవు..??

నా మీద నాకు ఉన్న నమ్మకం..హారిక మీద ఉన్న ప్రేమ ..ఇవి చాలవా??
సినిమాలో చూడటానికి  బాగానే ఉంటాయి ఇటువంటి dialogue లు, నిజజీవితంలో ఇవన్నీ వొట్టి కబుర్లే..అయినా నువ్వు చెప్పే మాటలకు అమ్మాయిలు పడతారేమో కానీ అమ్మాయిల తండ్రులను పడేయాలి అంటే మాత్రం ఒక హోదా ఉండాలి ..అయినా ఇదంతా చెప్పటం అనవసరం నీకు.. ఇక నువ్వు వెళ్ళొచ్చు..

వొచ్చే నెల పదవ తేదీన మా హారిక పెళ్లి..అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.. నీలా ఖాళీగా ఉండడు..

హారిక వైపు తదేకంగా చూసాను ఒక క్షణం..తాను తలా క్రిందికి దించుకుని మౌనంగా ఉంది..మా ప్రేమ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె మౌనంగా తలదించుకునే ఉండేది..అయినా తను మాత్రం ఏం చెప్పగలదు  వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ తనకు..

వెళ్ళొస్తాను హారిక..!
హహహహ చిన్న నవ్వు నవ్వి సారీ వెళ్తున్నాను..

అలా  చెపుతున్నప్పుడు నా  మాటల అడుగున ఒక చిన్నటి వణుకు..కనుల చివర నుండి ఎప్పుడెప్పుడు బయటపడుదామా అని సిద్ధంగా ఉన్న నీళ్లు..

నేనుఇక  అక్కడ నుండి వొచ్చేసాను..తర్వాత రెండు రోజులు భారంగా గడిచాయి..ఎక్కడ చూసినా మేము తిరిగిన  ప్రదేశాలే.. విడిపోని జ్ఞాపకాలే..!

ఇక అక్కడ ఉంటే తన జ్ఞాపకాల నుండి బయట పడను అనిపించింది..అందుకే ఇక ఆ సిటీ వొదిలి ఎక్కడికైనా వెళదాం అనుకున్నాను.. చివరిగా మా ఫ్రెండ్ గౌతమ్ బెంగళూరు లో ఉండటంతో  బెంగుళూరు వెళదాం అని నిర్ణయించుకున్నాను.. రెండు రోజుల తర్వాత పాత స్నేహితులకి , హైదరాబాద్ కి వీడ్కోలు చెప్పి బెంగళూరు వెళ్ళాను..తర్వాత హరికకు పెళ్లి అయిపోయింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను..అది జరిగాక  నా ఫోన్ wallpaper హారిక ఫోటో నుండి..లవ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఫోటో లకి ..నా ఫోన్ లో సాంగ్స్ పాప్ ,రాప్ సాంగ్స్ నుండి..మనసు గతి ఇంతే..లాంటి మెలోడీ సాంగ్స్ కి మారిపోయాయి.

  దురదృష్టం మన వెంటే ఉంటే..ఆ దేవుడు కూడా మనల్ని బాగు చెయ్యలేదు..అవసరం కోసం ప్రయత్నించిన ప్రతీసారి నిరాశపరిచిన ఉద్యోగ అవకాశాలు..హారిక కు పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ వొచ్చాయి..అందులోనూ ఒకటి కాదు రెండు జాబ్ లు..దీనినే దురదృష్టం అంటారు కాబోలు..

మొదటి రోజు ఆఫీసు..
   కొంచెం భయం భయంగా..కొంచెం ఆనందంగా గడిచింది..మరుసటి రోజు నుండి కొద్దీ కొద్దీ గా పరిచయాలు ఊపందుకున్నాయి..

హలో రఘు..నువ్వా ?? అంటూ దూరం నుండి ఒక గొంతు వినపడింది..

నేను..! ఈ గొంతును ఎక్కడో విన్నట్టు వుందే అనుకుంటూ తలా పైకెత్తి చూసాను..

నా ఎదురుగా వుంది ఎవరంటే.. ????

No comments:

Post a Comment

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts