Friday, 27 July 2018

- శ్రీ దేవి -


నల్లటి చీకటిని నీ కనులకు కాటుకగా అద్ది..

చుక్కలను జతచేసి నీ వాలు జడలో పూలగా పెట్టి..

ఇంద్రధనుస్సును తెచ్చి నీ నడుముకు వడ్డాణంగా మలచి..

ఆకర్షణని నీ కనుపాపలో దాచి భూమి మీదకు పంపాడు దేవుడు ఒకప్పుడు, సృష్టి నీ అందం చూసి అసూయపడాలి అని..

కానీ ఇప్పుడు తనకంటే అందం లేదని మురిసిపోతున్న ప్రకృతికి ఒక్కసారి మళ్ళీ నిన్ను పరిచయం చెయ్యాలని ఉంది..   

                                                   - శ్రీ దేవి

                                                                                                   - రఘు





స్త్రీ


దేవుని అద్భుత సృష్టిలో స్త్రీ కూడా ఒకటి..
అలాంటి అద్భుతాన్ని సృష్టించి సృష్టిలో అన్ని బాధలే పెట్టాడు దేవుడు..
చెవులకు ఝంకాలు పెట్టి బాల్యం లొనే నొప్పిని పరిచయం చేస్తాడు.. 
ప్రతి నెలా నొప్పిని ఇచ్చి యవ్వనం నుండే బాధను కలిగిస్తాడు..
పెళ్లి పేరుతో తల్లి దండ్రులకు దూరం చేసి మనసులో బాధను కలుగచేస్తాడు..
పెళ్లయ్యాక బిడ్డకు జన్మనిస్తూ పురుడి నొప్పులు పడేలా చేసాడు..
భర్త చనిపోయాక తన అందాన్ని , అలంకారాన్ని దూరం చేసి చేతి గాజులను పగలగొట్టి నొప్పిని పొందేలా చేసాడు..
మనవళ్లు,మనవరాళ్లను ముద్దాడక ముందే రోగంతో మంచం మీద విలవిల లాడేలా చేస్తాడు..

రాజకీయ చదరంగం

నాకు చెస్ ఆడుతుంటే ఒక ఆలోచన వొచ్చింది..మనం చెస్ లో వేసే ఎత్తులు,రాజకీయాల్లో వేసే ఎత్తులు ఒకేలా ఉంటాయి అనిపించింది..

ఎలా అంటే..

చెస్ బోర్డ్ మొత్తాన్ని ఒక రాష్టంగా భావించాం అనుకోండి..

ర్రాష్టాన్ని రెండు భాగాలుగా విభజించారు..అనగా చెస్ బోర్డ్ ని రెండు భాగాలుగా విభజిస్తే ..చెస్ బోర్డు కి ఒకవైపు గళ్లలో అధికార పక్షంవారు ,రెండోవ వైపు గళ్లలో ప్రతిపక్షం వారు వుంటారు..మధ్యలో ఉన్న ఖాళీ గళ్ళు వీరందరికి ఓటు వేసి గెలిపించే జనం.

చెస్ బోర్డు లో ఒకవైపు గళ్లలో వుండేవారు అధికార పక్షం వారు.. గళ్ళ మధ్యలో ఉండేది రాజు అనగా ముఖ్యమంత్రి..రాజు పక్కనే ఇరువైపులా వుండేవారు MLA లు MP లు అనగా ఏనుగు,ఒంటె మొదలైనవి..ముందు వరుసలో ఉన్న సిపాయిలందరు పార్టీ కోసం కృషి చేసి కార్యకర్తలు,పార్టీ పిచ్చి ఉన్న జనం, నాయకులు..అధికార పక్షం వారు ,ప్రతిపక్ష వర్గం వారు ఇద్దరూ మధ్య గళ్లలో ఉన్న ఓటు వేసిన జనాన్ని తొక్కుకుంటూనే వెళ్తుంటారు..

విధంగా రాజు ( ముఖ్యమంత్రి ) చుట్టూ ఒక కంచుగోడలా వుంటారు పార్టీ సభ్యులు   ( ఏనుగు,ఒంటె)..అధికార పక్షంలో అయినా ప్రతిపక్షంలో అయినా రాజు భద్రత కోసం తమ పార్టీ క్షేమం కోసం సిపాయులు (కార్యకర్తలు)ఒక అడుగు ముందుకు వేస్తాడు.. సిపాయి వల్ల తన పార్టీకి ఆపద రాకుండా ఉండటానికి మరొక వర్గం లో ఉన్న సిపాయిలు (కార్యకర్తలు) వీరికి అడ్డంగా వెళ్తుంటారు.. ఇలా పార్టీ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు మధ్యలో వుండే సిపాయిలు,కార్యకర్తలు..

మరొక వైపు..MLA ( ఏనుగు ) లు MP లు(ఒంటె) చురుగ్గా అడ్డదిడ్డంగా అవతలి వారి వర్గం మీద దాడి చేస్తూ ఆలాగే తమ రాజును కాపాడుకుంటూ వస్తుంటారు..అలా జరిగే క్రమంలో అధికార వర్గం వారు ప్రతిపక్ష వర్గంలోని చేరి రాజును కదలకుండా ప్లాన్ తో చెక్ పెడితే మళ్ళీ వీళ్లదే రాజ్యము గెలుపు..ఒకవేలా అలా కాకుండా ప్రతిపక్షం వారు అధికార పక్షంలోకి వొచ్చి రాజుకు చెక్ పెడితే ప్రతిపక్షం వారు అధికారంలోకి వస్తారు..

ఇలా ఎత్తుకు పై ఎత్తులు వేసి అధికారంలోకి వస్తుంటారు..వీళ్ళు వేసే ఎత్తులు తెలియని జనం మాత్రం మధ్యలో బలైపోతున్నారు.. 

                                                                                                      -  రఘు 


                      

Sunday, 24 June 2018

My writings

సమాధానం లేని సందేహాలే ప్రశ్నలుగా మిగిలిపోతాయి..

      < --------------------------------------------->

కనులను మైమరపించిన అందమా..
మనసును నిద్దుర లేపిన రూపమా..
మనిషికి ప్రాణం పోసిన శిల్పమా..
మరువను నిన్నెప్పుడు..
మరువకు నా గుర్తులు..

    < ------------------------------------------------>
దేవుడు తన వినోదం కోసం భూమి ని దాని మీద నివసించటానికి మనుషులను ఏర్పాటు చేశాడు..భూమిని మొత్తాన్ని టీవీ గా మార్చి తన చేతిలో రిమోట్ పెట్టుకొని ప్రజలు అనే చానల్స్ ను మార్చి మార్చి ట్యూన్ చేస్తూ వారి మధ్య జరిగే సంఘటనలను చూసి తను ఆనందాన్ని పొందుతున్నాడు..అందుకే తనకు నచ్చిన చానల్స్ లోని క్యారెక్టర్ ని ఎక్కువ రోజులు భూమి మీద ఉంచి బోర్ కొట్టిన, విసుగొచ్చిన క్యారెక్టర్ లని తొందరగా తీసుకెళ్తుంటాడు..మనం కేవలం ఆ దేవుడు మార్చినట్టు మారే నిమిత్త మాత్రులమే..

     <----------------------------------------------->
కాలం - ఎప్పటికి ఆగని యంత్రం

కల - నిజ జీవితంలో సాధ్యం కాని పనులను సులువుగా నెరవేర్చే సాధనం.

దేవుడు - ఎవరికి కనపడకుండానే ప్రపంచం మొత్తం పేరు తెచ్చుకున్న వ్యక్తి.

       <---------------------------------------------->
అందం అంటే గుర్తొచ్చేది వెన్నెలలు విరజిల్లి అందరికి కనిపించే ఆ చందమామ అయితే..
నువ్వు తెరవెనుక ఉన్న చందమామవు..

ఇంత పెద్ద విశ్వంలో అనేక వేల గ్రహాలు,నక్షత్రాలు,సౌరకుటుంబాలు,నదులు,  సరస్సులు, పాలపుంతలు ఉండగా నా మెదడు పొరల్లోంచి నీ ఆలోచనలే ఎందుకు బయటకు వస్తున్నాయి..
నా మస్థిస్కం తనలో నీ ఆలోచనలనే ఎందుకు నిక్షిప్తపరుచుకుంటుందో నా మనసుకు అర్థం కావటం లేదు..
భూమి కి ఆకర్షణ శక్తి ఉందని తెలుసు కానీ అది నువ్వు ఉన్న వైపే ఎందుకు ఆకర్షిస్తుందో ఏ శాస్త్రవేత్తకి అంతు బట్టడం లేదేంటో..

నేను నది లాంటి వాడిని..ఆలోచన,ప్రేమ,బాధ అనే ఉపనదులను కలుపుకుంటూ చివరికి సముద్రం లాంటి నీ దగ్గరకే వచ్చి చేరుతాను..

       < ------------------------------------------- >
భార్యను అనుమానించటం రాముడు నేర్పిస్తే..
దొంగతనాలను కృష్ణుడు నేర్పించాడు..
కలహాలు పెట్టడం నారదుడు నేర్పిస్తే..
తల నరకటం శివుడు నేర్పించాడు..
భక్తి ని ఆంజనేయుడు నేర్పిస్తే..
బద్దకాన్ని కుంభకర్ణుడు నేర్పించాడు..

      <------------------------------------------------ >

పుట్టుక అనే 3 అక్షరాలతో మొదలవుతుంది జీవితం..
ఆ 3 అక్షరాల జీవితంలో
ఎన్నో 3 అక్షరాల కష్టాలు
ఇంకెన్నో 3 అక్షరాల సుఖాలు..
ఎన్ని 3 అక్షరాల కష్టాలు,సుఖాలు వోచిన చివరికి మరణం అనే 3 అక్షరాలతోనే ముగిసిపోతుంది ఈ 3 అక్షరాల జీవితం..

#3అక్షరాలజీవితం🙏🙏

    <   ----------------------------------------------- >

నా జీవితం ఒక 50 పేజీల పుస్తకం.
ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేజీ..
అందులోనే ఎన్నో చాప్టర్ లు,ఎన్నో ప్రశ్నలు,ఎన్నో పరీక్షలు..
ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాను కానీ సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ అయ్యాను..
మొదటి 49 పేజీలు నేను రాయగలను..
కానీ ఆఖరి 50 వ పేజీ శుభం ( మరణం ) ఎవరో ఒకరు రాయాల్సిందే..

         < ------------------------------------------>

మనిషి ఆప్యాయత అనే బంధాన్ని మెడలో వేసుకొని పుట్టి..
మాతృ ప్రేమ అనే బంధంతో పెరిగి..
పెళ్లి అనే బంధంతో స్త్రీ కి దగ్గరయి..
నాన్న అనే అనురాగ బంధంతో గర్వపడి..
తాత అనే పిలుపుతో సంతృప్త పడి..
చావు అనే బంధంతో వేరొక లోకానికి వెళ్లిపోతున్నాడు..

          < ------------------------------------------->

మనిషి ఒక్కసారే చనిపోతాడు..
కానీ మనిషిలోని  మనసు మాత్రం కొన్ని వేల సార్లు మరణిస్తూనే ఉంటుంది..

        < --------------------------------------------->
గడియారం చిన్నగానే కనపడుతుంది కానీ దాని లోపల ఉండే కాలమే ఒక జీవితాన్ని మర్చివేయగలంత పెద్దదిగా ఉంటుంది..

Sunday, 5 November 2017

రఘు అనే నేను - 5



ఎలా చెప్పగలవు..??

నా మీద నాకు ఉన్న నమ్మకం..హారిక మీద ఉన్న ప్రేమ ..ఇవి చాలవా??
సినిమాలో చూడటానికి  బాగానే ఉంటాయి ఇటువంటి dialogue లు, నిజజీవితంలో ఇవన్నీ వొట్టి కబుర్లే..అయినా నువ్వు చెప్పే మాటలకు అమ్మాయిలు పడతారేమో కానీ అమ్మాయిల తండ్రులను పడేయాలి అంటే మాత్రం ఒక హోదా ఉండాలి ..అయినా ఇదంతా చెప్పటం అనవసరం నీకు.. ఇక నువ్వు వెళ్ళొచ్చు..

వొచ్చే నెల పదవ తేదీన మా హారిక పెళ్లి..అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.. నీలా ఖాళీగా ఉండడు..

హారిక వైపు తదేకంగా చూసాను ఒక క్షణం..తాను తలా క్రిందికి దించుకుని మౌనంగా ఉంది..మా ప్రేమ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె మౌనంగా తలదించుకునే ఉండేది..అయినా తను మాత్రం ఏం చెప్పగలదు  వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ తనకు..

వెళ్ళొస్తాను హారిక..!
హహహహ చిన్న నవ్వు నవ్వి సారీ వెళ్తున్నాను..

అలా  చెపుతున్నప్పుడు నా  మాటల అడుగున ఒక చిన్నటి వణుకు..కనుల చివర నుండి ఎప్పుడెప్పుడు బయటపడుదామా అని సిద్ధంగా ఉన్న నీళ్లు..

నేనుఇక  అక్కడ నుండి వొచ్చేసాను..తర్వాత రెండు రోజులు భారంగా గడిచాయి..ఎక్కడ చూసినా మేము తిరిగిన  ప్రదేశాలే.. విడిపోని జ్ఞాపకాలే..!

ఇక అక్కడ ఉంటే తన జ్ఞాపకాల నుండి బయట పడను అనిపించింది..అందుకే ఇక ఆ సిటీ వొదిలి ఎక్కడికైనా వెళదాం అనుకున్నాను.. చివరిగా మా ఫ్రెండ్ గౌతమ్ బెంగళూరు లో ఉండటంతో  బెంగుళూరు వెళదాం అని నిర్ణయించుకున్నాను.. రెండు రోజుల తర్వాత పాత స్నేహితులకి , హైదరాబాద్ కి వీడ్కోలు చెప్పి బెంగళూరు వెళ్ళాను..తర్వాత హరికకు పెళ్లి అయిపోయింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను..అది జరిగాక  నా ఫోన్ wallpaper హారిక ఫోటో నుండి..లవ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఫోటో లకి ..నా ఫోన్ లో సాంగ్స్ పాప్ ,రాప్ సాంగ్స్ నుండి..మనసు గతి ఇంతే..లాంటి మెలోడీ సాంగ్స్ కి మారిపోయాయి.

  దురదృష్టం మన వెంటే ఉంటే..ఆ దేవుడు కూడా మనల్ని బాగు చెయ్యలేదు..అవసరం కోసం ప్రయత్నించిన ప్రతీసారి నిరాశపరిచిన ఉద్యోగ అవకాశాలు..హారిక కు పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ వొచ్చాయి..అందులోనూ ఒకటి కాదు రెండు జాబ్ లు..దీనినే దురదృష్టం అంటారు కాబోలు..

మొదటి రోజు ఆఫీసు..
   కొంచెం భయం భయంగా..కొంచెం ఆనందంగా గడిచింది..మరుసటి రోజు నుండి కొద్దీ కొద్దీ గా పరిచయాలు ఊపందుకున్నాయి..

హలో రఘు..నువ్వా ?? అంటూ దూరం నుండి ఒక గొంతు వినపడింది..

నేను..! ఈ గొంతును ఎక్కడో విన్నట్టు వుందే అనుకుంటూ తలా పైకెత్తి చూసాను..

నా ఎదురుగా వుంది ఎవరంటే.. ????

Tuesday, 24 October 2017

కన్యాశుల్కం కాలంలో...

18 వ శతాబ్ధపు మధ్యకాలంలో....!

    ఒకవైపు బ్రిటీష్ వాళ్ళు, మరొకవైపు కన్యాశుల్కం ఈ రెండింటి ప్రభావం వల్ల మన దేశం బానిస బ్రతుకు బ్రతుకుతుంది.. ఎక్కడ చూసినా తెల్లచీరె కట్టుకొని కనపడే పసిపిల్లలతో దేశం మొత్తం చిందర వందరగా వుంది.. 

సావిత్రి ...!    వెంకటయ్య ,మంగమ్మ గారి ఏకైక సంతానం..బాల్య  వివాహాలు ఎక్కువగా ఉండటం వలన 12 సంవత్సరాల వయస్సులోనే రంగయ్య అనే 70 సంవత్సరాల ముసలి వాడు అంతేకాకుండా మూడవ పెళ్లి వాడికి  ఇచ్చి పెళ్లి చేసాడు సావిత్రి తండ్రి వెంకటయ్య..( ఆ కాలంలో పిల్ల తండ్రి ముందుకి బానిష అయితే వారికి మందు ఆశ చూపించే వారు లేకపోతె ఎంతోకంత డబ్బు ని ఆశగా చూపించి వారి అమ్మాయిలను వివాహం చేసుకునేవారు )




  పెళ్ళైన నెల రోజుల నుండి రంగయ్య మంచాన పడ్డాడు ఆ రోజు నుండి అతనికి సేవ చెయ్యటానికే 2 సంవత్సరాల సమయం గడిచిపోయింది తర్వాత అనారోగ్యంతో అతను మరణించాడు..భర్త చనిపోయినప్పుడు కూడా సావిత్రి ఏడవలేదు  అసలు భర్త ,బాధ్యతలు అనే బంధాలు కూడా తెలియవు..భర్త చనిపోగానే సావిత్రిని విధవని చేసి తెల్లచీరె కట్టి ఇంట్లో కూర్చో పెట్టారు.. 

6 సంవత్సరాల తర్వాత..! 

      ఈ బాల్య వివాహాలు, కన్యాశుల్కం ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది..అప్పుడు అప్పుడే ప్రజలలోకొద్దికొద్దిగా  చైతన్యం మొదలయింది ఈ బాల్య వివాహాలను అరికట్టాలి అనే దిశగా.. 

శ్రీను ....!     26 సంవత్సరాల యువకుడు..ముఖంలో తేజస్సు..అపారమైన తెలివి తేటలు..ఎంతటి వారినైనా రెండు నిమిషాలు చూసి మనిషిని అంచనా వెయ్యగల దిట్ట.. పట్టణంలో బారిస్టారు పూర్తి చేసి  5 సంవత్సరాల తర్వాత ఊరికి తొలిసారిగా  తిరిగి వొచ్చాడు ..ఎప్పటినుండో ఈ బాల్య వివాహాల పట్ల అతను వ్యతిరేకతను చేస్తూనే ఉండేవాడు..కానీ తన ఊరిలో చిన్న చిన్న పిల్లలను విదవలుగా చూడగానే అతని గుండె చేదిరిపోయింది..ఈ మూఢనమ్మకాలను ఆపాలి అని కొద్దో గొప్పో చదువుకున్న వారికి హితోపాదేశం చేసి ఒక పది మందితో కలిసి చిన్న గ్రూప్ లాంటిది ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఈ మూఢనమ్మకాల ప్రభావాన్ని వివరిస్తూ దీని వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు గురించి వివరిస్తూ అందరిని చైతన్య వంతులను చెయ్యటం మొదలుపెట్టాడు..  

వీరి ఉద్యమం చాలా మందిని చైతన్య వంతులను చేయసాగింది ..అలా ఊరు ఊరు తిరుగుతూ ఉండగా ఒక ఊరిలో చూసాడు సావిత్రిని..గుండ్రటి ముఖం,నల్లని కలువల లాంటి కళ్లు,నడకతో పాటు ఒయ్యారంగా ఊగుతున్న ఒతైన జడ,ఎంతటి వారినైనా ఒకే నవ్వుతో పడేసే చిరునవ్వు..వీటి అన్నిటికి విరుద్దంగా తాను కట్టుకున్న తెల్లని చీరె..ఒక్క నుదిటిన బొట్టు తప్ప దేనిలోను అప్సరసలకి తీసిపోదు..వీరి ఇరువురి చూపులు కలుసుకున్నాయి సావిత్రి వెంటనే సిగ్గుతో లోపలికి వెళ్లిపోయింది..అమ్మాయిలకు పెళ్లి పట్ల ఎన్నో ఊహలు ఉంటాయి అవన్నీ ఎలాగూ తీరలేదు భర్త చనిపోయాక వేరే వారికి కన్నెత్తి చూసే అవకాశం లేదు మొదటి సారిగా శ్రీను ని చూడగానే ఎదో తెలియని అనుభూతి.. 

  ఇది ఇలా ఉండగా మరోపక్క తమ ఆచారాన్ని మంటగలుపుతున్నారు  అని  అక్కడ పెద్దమనుషులు అనే పేరు పెట్టుకున్న వారు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇది మన హక్కు అని చెపుతూ  బాల్య వివాహాల లాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించటం మొదలుపెట్టారు ...
మూఢనమ్మకాలకు విరుద్ధంగా పోరాటం చేసేవారు మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారితో  పోరాటాలు తారాస్థాయిలో జరుగుతున్నాయి..

కానీ ఇంతలోనే...! 

next episode will be updated soon 



                                                                                                                        రచన 

                                                                                                               రఘు చౌదరి 

Tuesday, 25 July 2017

మను


కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మనల్ని నిర్విరామంగా మోస్తూనే ఉంది..పాపా,పుణ్యాలను సమపాళ్లతో స్వీకరిస్తుంది.. పురాణాలను చదివిన వారు ఈ భూమిని దేవతంటారు..సైన్స్ చదివిన వారు ఆకర్షణ అంటారు..

ఎప్పటిలాగే తన చుట్టూ తాను తిరుగుతూ అలానే సూర్యుని చుట్టూ  ఒక కక్షలో తిరుగుతూ పోతుంది భూమి.. అలా తిరుగున్న సమయంలో   కనురెప్ప పాటు కాలంలో ఎన్నో చావులు,ఎన్నో పుట్టుకలు..ఎన్నో జీవితాలు కథలుగా మారుతాయి..మరెన్నో జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతాయి..

   ఈ కథ కూడా అలాంటి రెప్ప పాటు కాలంలోనే ప్రాణం పోసుకుంది...ప్రతి కథ ని ఒక రచయిత ప్రాణం పోస్తాడు కానీ నా కథకు మాత్రం పగ అనే మారణాయుధం  ప్రాణం పోసింది..

ఆవారాగా తిరిగే ఒక కుర్రాడు ??

కష్టపడి రూపాయి ,రూపాయి కూడపెట్టే ఒక అల్ప సంతోషి ??

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ఒక కరుడుకట్టిన రాజకీయ నాయకుడు ??

జరిగిన ఒక ఘోర సంఘటన ?? ఎంతమంది పరిస్థితుల్ని మార్చింది..??
చివరకు గెలిచింది న్యాయమా ??  అన్యాయమా ??

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ...


     *                               *                               *                             *

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రానున్ను రెండు రోజులు ఆంధ్ర,రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..కావున ప్రజలు అప్రమత్తులై ఉండాలి అని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేయడం జరిగింది..

  సిటీలో చిన్న గల్లీలో ఉన్న ఒక ఇరుకు ఇల్లు అది.. అక్కడ ఇళ్లే కాదు మనుషుల మధ్య కూడా ఇరుకే..ఒకవైపు ఇల్లు మొత్తం వర్షం కారణంగా నీటితో నిండి ఉంది..ఇక్కడ మన దేశపు రాజకీయ నాయకుడు మాకు చేసిన అన్యాయంతో మా  కళ్ళలో కూడా నీళ్లు నిండుతున్నాయి..

సెప్టెంబర్ 12
సాయంత్రం 6 గంటల సమయం

వర్షాకాలం కావటం వలన అందులోను వర్షం వలన చీకటి తొందరగా పాలన మొదలుపెట్టింది ... ఆ కటిక చీకటిలో ఒకరికి ఒకరు కూడా కనపడటం లేదు .. అప్పుడే సరిగ్గా బొంగురు గొంతు నుండి చిన్నగా బయటకు వొచింది ఒక మాట ,రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మనది మనకు ఎందుకురా పెద్ద వాళ్ళతో గొడవలు..మనం ఈ ఊరు వొదిలి దూరంగా ఎక్కడకు అయినా వెళ్లి బ్రతుకుదాం..ఇప్పటికి జరిగినది చాలు ?? మనకు ఆ స్థలం వొద్దు ఏం వొద్దు ?

ఎక్కడకు వెళదాం నాన్న ??

ఎక్కడకు వెళ్లినా ఇలాంటి నీతి మాలిన కుక్కలు ఉంటూనే వుంటారు..డబ్బు ఉంది అన్న అహంకారం..పదవిలో వున్నాను అన్న పొగరు..అనవసరంగా నాలాంటి మెంటల్  (నా బీప్ -----) గెలికాడు..నేనేంటో చూపిస్తా వాడి పొగరు దించుతా ?? ఇప్పటివరకు ఆవారాగా తిరిగా అదే ఆవారాగాడికి ఏం చెయ్యాలో కూడా తెలుసు ..మనల్ని అవమానించిన వాడే మన కాళ్ళ మీద పడేలా చేస్తా..,?? 


5 సంవత్సరాల తర్వాత??

        ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , ఈ రోజు మాత్రం రిసీవ్ చేసుకోవటానికి వొచ్చిన వారితో కిత కితలాడుతోంది..ఇసుక వేస్తె రాలనంత మంది జనం.. ఆడ,మగ తేడా లేదు..వయసు మళ్ళిన వారు ఎముకలు క్రుళ్ళిన వారు అని భేదం లేదు ?? 

అందరి కళ్ళు నిస్తేజంగా ఎదురుచూస్తున్నాయి.. మాములు జనం తో  పాటు మంత్రులు,MLA లు కూడా అతని రాక కోసమే ఎదురుచూస్తున్నారు..అతను దిగగానే ఎదో ప్రళయం వోచినట్టు అందరూ, సెక్యూరిటీ వారిని కూడా లెక్కచేయకుండా ఒక్కసారిగా  మీద పడిపోయారు..ఫొటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపిస్తూ తమ కెమెరాలో అతన్ని భందించేసారు. విడియోగ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే సమయం వొచ్చింది అన్నట్లు అందులో లీనమైపోయారు..
ఎంతో మంది ఇలాంటి కొడుకు నాకు ఎందుకు పుట్టలేదా అని కుమిలిపోయారు ?? మంత్రులు పుష్పగుచ్చా లతో అతనికి స్వాగతం పలికారు..

5 సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఆవారా గాడు అని బిరుదులు ఇచ్చిన వారు...ఈ రోజు అతని విలువ తెలుసుకొని దేవుడు అని సంబోదిస్తూ అతనికి స్వాగతం పలకటానికి వొస్తున్నారు ..

అతను రాజకీయ నాయకుడా ??  కాదు.
దొంగ స్వామిజీనా ??  కాదు..

అతను ఇండియా వొదిలి 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇంత ప్రేమ ఎలా ??
కేవలం 5 సంవత్సరాలలో ఇంత ఎదుగుదల ఎలా సాధ్యం..??

అసలు ఎవరు ఈ మను ??

జనం ఇంతగా అతన్ని ఎందుకు ఆదరిస్తున్నారు..??

5 సంవత్సరాల క్రితం _______     బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలవ్వక ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మరుసటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ??


( ఇంకా ఉంది ...next episode will be updated soon ).

ఛాయ్ విలేజ్

సాయంత్రం 6 గంటల సమయం.. ఆ రోజు ఎందుకో నాలో ఏవో అంతుచిక్కని ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి..ఈ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సరదాగా అలా...

most popular posts