ఆ ఎండకు తాను పెట్టుకున్న కుంకుమ మీద నుండి స్వేద బిందువులు జారుతుంటే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనబడుతుంది..
భూమి - అయితే నేను కూడా కొత్తగా చెప్పటానికి ఏం లేదు మా అమ్మాయిలందరూ దశాబ్దాలుగా మీ అబ్బాయిలకు చెపుతున్నదే..
అదే - sorry
- నేను నిన్ను ఫ్రెండ్ గానే చూశాను
- అని ఏమో చెపుతారు కదా అదే నేను కూడా చెప్తున్నాను.. ( బస్ స్టాప్ లో వున్న అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టారు ).
ఆకాష్ - AS EXPEXTED..! మీ అమ్మాయిలందరూ ఇదే చెపుతారు కదా.
భూమి - నో చెపుతాం, ఛీ కొడతాం అని తెలిసి కూడా చెప్పడం దేనికి.. అది కూడా అందరిముందు..
ఆకాష్ - ప్రపోజ్ చెయ్యటం మా హక్కు
నో అనడం మీ అలవాటు
నో అన్న మీతోనే చివరకు yes చెప్పించుకోవటం మా పద్దతి..
అలవాటును మార్చుకోవొచ్చు కొంచెం కష్టపడితే, కానీ హక్కును మార్చాలంటే కష్టం ..
భూమి - సరే..! నీకిిచ్చిన టైం అయిపోయింది.. నాకు టైమ్ అవుతుంది వెళ్ళాలి..
ఇంతకీ చెప్పడం మర్చిపోయా మేము నో చెప్పగానే మందు గ్లాసులు చేతిలో పట్టుకొని గడ్డాలు పెంచటం మీ అబ్బాయిలకు అలవాటు కదా అలా చెయ్యకు చెండాలంగా ..
ఆకాష్ - పెళ్లి అయింది అని తెలియటానికి సింబాలిక్ గా అమ్మాయిలకు మెట్టెలు,పుస్తెలు ఎలానో లవ్ ఫెయిల్యూర్ అని తెలియటానికి అబ్బాయిలకు సింబాలిక్ గా గడ్డం అలాగ ..
TIME - 01:15 ని.లు
అంతలో బస్ రావటంతో భూమి వెళ్ళిపోయింది.. ఆకాష్ అక్కడే నిల్చొని భూమిని తీసుకెళ్లిన బస్సు వైపు చూస్తున్నాడు..
బస్సు ఎక్కిన భూమికి వెనుక వున్న అమ్మాయిల మాటలు చెవిన పడ్డాయి.. ( అబ్బాయి చాలా బావున్నాడు, ఆ ప్రపోసల్ కి ఎవరైనా పడిపోవాల్సిందే అదే నాకు చెపితే ఎగిరి గంతు వేసే దాన్నే అంటూ మాట్లాడుకుంటున్నారు)
ఆ మాటలు విన్న భూమి పెదాల అంచున చిన్న చిరునవ్వు,ముఖంలో చిన్నపాటి సిగ్గు ప్రత్యక్షమయ్యాయి అవి సహజం..
భూమికి ఆ రోజు నిద్ర పట్టలేదు ఆ బస్సు లో విన్న మాటలే గుర్తొస్తున్నాయి..
చూస్తుండగానే కాలగమనంలో వారం రోజులు గడిచిపోయాయి.. భూమి రోజు బస్ స్టాప్ లో ఆకాష్ కోసం ఎదురుచూసేది కానీ కనపడలేదు..
వారం రోజుల తర్వాత
సందులేకుండా జాగింగ్ చేస్తున్న పార్కులో ఆ రోజు భూమి కూడా జాగింగ్ కి వొచ్చింది.. అక్కడ జాగింగ్ చేస్తున్న భూమి దగ్గరకు ఆకాష్ వొచ్చి నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా..
భూమి - నువ్వు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నావా ఆలోచించటానికి ఇంకోసారి కనబడితే మా husband కి చెపుతాను..
-- ఏంటి మీకు పెళ్ళైపోయిందాదాదా --
పెళ్లి అయిపోయిందా కాలేదా ?? ఒకవేళ పెళ్లి అయితే బస్ స్టాప్ లో ఎందుకు చెప్పలేదు ఆ విషయం.. ??
అసలు ఏం జరిగుంటుంది ??
తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..( ఇంకా వుంది )
రచన
- రఘు